భావవ్యక్తీరణ, మాట్లాడే స్వేచ్ఛ ఉంది

3

– జాతీయ వాదానికి లోబడి ఉండాలి

– అరుణ్‌ జైట్లీ

న్యూదిల్లీ,మార్చి20(జనంసాక్షి):తాము భావవ్యక్తీకరణకు, మాట్లాడే స్వేచ్ఛకు మద్దతిస్తామని.. అయితే అదే సమయంలో జాతీయ వాదానికీ తమ మద్దతు ఉంటుందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పేర్కొన్నారు. పార్టీ నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ సమావేశంలో రెండో రోజు విూడియాతో మాట్లాడుతూ జైట్లీ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేసే హక్కు ఉందని.. అందుకు స్వేచ్ఛ ఉంటుంది కానీ, అది దేశానికి నష్టం కలిగించడానికి కాదని జైట్లీ పేర్కొన్నారు.ఇటీవల జేఎన్‌యూలో దేశవ్యతిరేక నినాదాలు చేశారంటూ కన్నయ్య కుమార్‌ను అరెస్టు చేసిన ఘటన, మజ్లిస్‌ నేత అసదుద్దీన్‌ ఒవైసీ ‘భారత మాతాకీ జై’ అని నినదించను అని వ్యాఖ్యానించిన ఘటనల నేపథ్యంలో జైట్లీ ఈ విధంగా మాట్లాడారు. అలాగే భాజపా నేతలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దంటూ హితవు పలికారు. భాజపా అంటే నిర్దిష్టమైన నాయకత్వం, జాతీయవాద విధానాలు, ప్రగతిశీల పాలనకు నిదర్శనంగా ఉండాలని జైట్లీ సూచించారు.