భూమివేట – కాకినాడ సెజ్
అభివృద్ది పేరుతో, ఉపాధి అవకాశాల ఆశ చూపుతూ రైతుల నుంచి వేలాది ఎకరాల భూమిని లాక్కొన్న పాకలులు నిర్వాసితులైన కారిక సరైఏశ్రీనా ప్రత్యామ్నాయ ఉపాధి చూపకుండా, నిలువ నీడ లేకుండా చేశారని అంటున్నారు హేమా వెంకట్రావ్
నూతన ఆర్ధిక విధానాలు, ప్రపంచీకరణ ఆ తర్వాతి క్రమంలో వచ్చిన ప్రత్యేక ఆర్ధిక మండలాల(సెజ్) గురించి ప్రగతిశీల శక్తులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగానే ఉంటూ, వాటి దుష్పలితాల గురించి ప్రజలకు తెలియజేయడం లో ముదు వరుసలోనే ఉన్నారు. 2005లో వచ్చిన ప్రత్యేక ఆర్ధిక మండలాల చట్టం గురించి మేధావులు ముందుగానే హెచ్చరించారు. 2006లోనే కాకినాడ సోఎజ్‌లకు బీజం పడిం ది. భూమిపై వేట మొదలయింది. బంగారం పండే ఎకరా భూమికి ముష్ఠి మూడు లక్షల రూపాయలు ఇచ్చి మొత్తంగా వేల ఎకరాల భూమిని చ్ట్టుపెట్టే ప్రయత్నాలు ముమ్మరమ య్యాయి. రైతులకూ, రైతు కూలీలకూ నిలువనీడ లేకుండా చేసే సెజ్ కుట్రల్ని పసిగట్టి పోరాట సంఘాలు 2008లో ప్రతిఘటనకు పూనుకున్నాయి. అరెస్టులు,కుట్ర కేసుల, కోర్టు లో న్యాయ పోరాటం, ఆనాటి తొలిదశ ఉద్యమ ం ఆత్మరక్షణలోనే నడిచింది. మారు తున్న రాజ కీయార్థిక పరిస్థితులలో పోలీసుల అత్యుత్సా హాన్ని నిలదీస్తూ, భూమి కోష్ట్ర్సం రాజీలని పోరాటానికి సిద్దపడుతున్నా మహిళలు, విద్యార్ధులు, యువకులు ఉద్యమంలో కొత్త నీరై చేరడం మలిదశ ఉద్యమంలో ప్రత్యేకతలుగా గుర్తించంచ్చు. వైఎస్ పాలనలో భూ భాగోతాలు బయటపడడం, వాన్పఇక్ భూములలో కెబినెట్ మంత్రులతో సహా జైళ్ల పాలవవడం, ఓట్ల రాజకీయాల కోసమైనా రైతులకు అండగా నిలుస్తామని ప్రతిపక్షాలు హీమీలు ఇవ్వడం. అంతర్జాతీయ ద్రవ్యోల్బణం, మందకోడిగా సాగుతున్న దేశీయ మార్కెటు స్థితులు సహజంగానే సెజ్ వ్యతిరేక ఉద్యమానికి ఊపిరి పోవాయి. మాభూములు మేము దున్నుకుం టుంటే మీరు ఎందుకు వచ్చారు? ఎవరు పంపితే వచ్చారు? అనే కాకినాడ సెజ్ ప్రతిపాదిత ప్రాంతంలో ఏరువాక సాగిస్తున్న భూములలోకి పోలీసుల వ్రేశాన్ని నిలదీసిన రమణక్కపేట మహిళల తెగువ ఈస్ట్ ఇండియా కంపెనీని ఎదిరించిన ఝూన్సీ లక్ష్మీబాయి వారసత్వాన్ని స్ఫురణకు తెచ్చారు. కాలం చెల్లిన సెజ్ ప్రతిపాదనల్ని కాలదన్ని మోసపూరితంగా, బలవంతంగా లక్కొన్న తమ భూముల్ని దున్నకోవడానికి సిద్దపడ్డారు. రైతులు వంటా వార్పు నిర్వహించి సెజ్ ఆక్రమణను నిరసించారు. శాంతియుతంగా ‘ఏరువాక’ నిర్వ హిస్తుంటే ఎందుకు తమ భూములలోకి రావల్సి వచ్చిందంటూ నిలదీశారు. సెజ్ కోసం అక్రమ ంగా లాక్కొన్న భూముల్ని తిరిగి ఇచ్చేంతవరకు పోరాటం చేస్తామన్నారు. 2012 మే 11న ఏరువాక ఆపడానిక వస్తున్న పోలీసు వాహ నాలను తమ దరికి చేరకుండా దారి మధ్యలో మంటలు వేసి తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేవారు. అక్కడికి చేరుకున్న పోలీసు మూకల్ని తిప్పి కొట్టారు. కాకినాడ సెజ్ ప్రతిపాదిత ప్రాంతం లోని రమణక్కపేటలో తిరిగి రగిలిన పోరాట జ్వాల ఇది. 2008 మార్చ్ 7న అంతర్జాతీయ మహిళా దినం మార్చ్ 8 పోరాట స్పూర్తితో ప్రతిఘటన రూపంతో ఉద్యమం మలుపు తిరిగింది, చైతన్యవంతులైన స్త్రీలు సెజ్ వ్యతిరేక ఉద్యమంలో ఉప్పెనలా వచ్చి పోరాటాన్ని మరింత పదునెక్కించారు. మరోవైపున దళితు లు,కొద్ది మంది బహుజనులు ఉద్యమం నుంచి వెనుదిరిగారు. అభివృద్ది ఆధునీకణ పేరుతోమ జరుగుతున్న ఈ క్రమంలో అట్టడుగు వర్గాలుగా ఉన్న దళితులు ఉద్యమానికి దూరంగానూ, సమాజంలో అసమానతకు గురయిన స్త్రీలు ఎందుకు ఒక ప్రవాహంలాగా ఉద్యమంలో చేరుతున్నారు? అలాగే ప్రపంచీకరణ మాయలో పడి కొట్టుకు పోయే ఇతర యువతలాగా కాకుండా కాకినాడ సెజ్ వ్యతిరేక ఉద్యమంలో స్థానిక యువత ఎందుకు క్రియాశీల పాత్ర వహిద్దామను కుంటుంది? వీటి సామాజిక, రాజకీయార్థిక నేపథ్యంలోకి వెళ్లేముందు అక్కడే వాస్తవాలను మీ ముందు ఉంచుతాను.