భూమి వేట – కాకినాడ సెజ్
( శనివారం తరువాయి భాగం)
భూమిలేని దళిత బహుజనులు దిక్కుతోచని పరిస్ధితులలో ఉన్న గూడును పాడుచేసుకొని (కూల్చేసుకుని) పసిపిల్లలతో సహా సెజ్ ప్రభుత్వం కటించిన కాలనీల్లోకి గొడ్డుగోదల్లాగా తరలించారు. ఒకరో, ఇద్దరో కాస్త భూమి ఉన్న వాళ్లు కూడా గ్రామలు ఖాళీ కావడంతో తమ సామాజిక వర్గం కోసం కాలనీలోకి వెళ్లిపోయారు. అసలు ఈ వర్గమే ఎందుకు నష్టపోతుంది అని ప్రశ్నించుకుంటే ఈ విషాదం వెనకాతల సామ్రాజ్యవాద ప్రపంచీకరణ చెప్పు చేతుల్లో నడుస్తున్న పాలకవర్గాల కుట్రు ఉంది. ఆధివపత్యం కులాల ధనిక రైతుల నుండి ప్రతిఘటన, వారికి వ్యవస్థలో ఉంటే బార్లైనింగ్ కెపాసిటిని గుర్తించిన సెజ్ యాజమాన్యం పాలకవర్గాల సహాయంతో దళిత బహుజనులను టార్గెట్ చేసుకుంది. సెజ్ ఏర్పాటుకు వ్యవసాయ పునర్ వ్యవస్థీకరణకు తొలి మొట్లుగా ఈ వర్గాలను వాడుకున్నారు. ఈ సామాజిక వర్గంలో ప్రలోభాలకు లొంగిన కొందరిని దళారులుగా మార్చుకొని, వారికి చిన్నా చితకా కాంట్రాక్టులు జంటగట్టి, తమ చెప్పు చేతుల్లో ఉంచుకున్నారు. ఇక మిగలన వారికి పని లేకపోవడంతో, వచ్చిన నష్టపరిహారాన్ని కాస్త వారి ఖర్చులకు, మోటార్ బైక్‌లలాంటి విలాసాలకు (వారి తహాతకు మించి) తుడిచిపెట్టుకు పోగా కొన్ని నెలల్లోనే వారు బికారులుగా మారి వీధిన పడ్డారు. గ్రామల్లో ఉన్నప్పుడు, భూముల్లో ఏదో పని దొరికేది. ఇప్పుడు పనికోసమే వేరే ప్రాంతాలకు వలస పోవలసి వస్తుంది. విశాలమైన గ్రామ వాతావరణానికి అలవాటు పడ్డ జీవితాలు అగ్గిపెట్టెలాంటి ఇళ్లలో మగ్గిపోతున్నారు. అటు పుట్టిన ఊరు నుంచి పెకిలించి వేయబడి ఇటు సెజ్ కాలనీల్లో ఉపాథిలేక వీరు రెండింటికి చెడ్డ రేవడి కావడమే గాక సెజ్ వ్యతిరేక పోరాట కమిటి నాయకత్వం దృష్టిలో ఉద్యమానిక వెన్నుపోటుదార్లుగా మిగిలిపోవడం యాదృచ్చికంగా కాదు. అభివృద్ది వెలుగునీడల గురించి కొత్తచూపు అందించిన ఆర్‌ఎస్ రావుగారి మాటల్లో చెప్పాలంటే ‘పెట్టుబడి దృక్పధం నుండి చూస్తే గ్రామాలలో ఉండే ఉత్పత్తి శక్తులు, రైతుకూలీలు, పేదరైతులు, కులవృత్తులు చేసేవారు పేద జనాభాగానే ఉంటారు. పెట్టుబడిదారీ విధానం గ్రామీణ ప్రాంతంలో ఉన& ఉత్పత్తి శక్తులను, ఉత్పత్తి పద్దతులను, విధానాలను రూపాంతంర చేసి మానవశ్రమ కేంక్రంగా ఉత్పత్తులను, మిగులు ఉత్పత్తులను తయారుచేసే వ్యవస్థగా మారుతుంది. ఈ రూపంలో మిగిలిన ఉత్పత్తి అంటే మిగులు ఉత్పత్తిగా ఈ పనివాళ్లను సమీకరించిన వ్యక్తికి చెందుతుంది. పట్టణీకరణ పారిశ్రామీకరణగా వృద్దిచెంది పెట్టుబడి ప్రవేశిస్తుంది. దాని ద్వారా వ్యవసాయం పునర్‌వ్యవస్థీకరణ చెంది పెద్ద పెద్ద పరిశ్రమలే అభివృద్ది అని సమాజంలో వ్యవసాయ రంగం కుచించుకు పోవాలని అరు అభివృద్ది అని చెపుతుంది. సరిగ్గా సామ్రాజ్యవాద ప్రపంచీకరణ నేటి మత పాలకులతో ప్రజలకు నమ్మబలికిస్తుంది కూడా ఇదే!
అభివృద్ది, ఉపాధి అని చెప్పినదాని పట్ల కూడా పాలక వర్గాలకు నిబద్దత లేదు. కాకినాడ సెజ్‌లలో ఏ పరిశ్రమలు వస్తాయి? ఎంతమందికి ఉపాధి దొరుకుతుంది? అభివృద్ది ఏ మేరకు జరుగుతుంది? అభివృద్ది జరిగినా అది ఎవరికి ఉద్దేశించినది? అన్న విషయాలకు పాలకవర్గాలకే కనీస అంచనాలు లేవు. అభివృద్ది అనేది ఉత్పత్తి శక్తుల ప్రాతిపదిక మీద, ఉత్పత్తి సంబంధాల ప్రాతిపదిక మీద, ఆ సంబంధాల మార్పు ద్వారా ఒక వ్యవస్థలోంచి మరొక వ్యవస్థలోకి మారడం అనేది ఒక ప్రాతిపదిక అయితే కేవలం ఉత్పత్తి అనేది గాలిలో తిరుగాడుతున్న మాటేగాని ఈనాటి వరకు (ఆరేళ్లకాలంలో) ఎటువంటి ప్రయత్నం, ప్రాజెక్టు లేదు. కేవలం కెవి రావు అనే వ్యక్తికి భూములను కట్టబెట్టి పన్ను రాయితీలను ఇచ్చి, రియల్ ఎస్టేట్ భూదాహానికి ప్రతీకగా నిలిచి పోయింది. వలసపాలనలో భూమి ఈ రోజు పెట్టుబడికి స్థావరం అయింది. అపారమైన ప్రకృతి వనరులు సెజ్‌ల పరమై పెట్టుబడి కేంద్రీకరణ జరుగుతుంది. అసలు మొదటి నుంచి కాకినాడ సెజ్ దారే వేరు. రాష్ట్రంలో సెజ్‌ల కోసం ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల సంస్థ(ఎపిఐఐసి) భూములను సేకరించి సెజ్‌లకు కట్టబెడితే కాకినాడలో ప్రత్యక్షంగా, కెవి రావు అఏ డెవలపర్‌కు కట్టబెట్టింది. సెజ్‌లలో కంపెనీలు పెట్టి ఉపాధి కల్పిస్తామన& ప్రభుత్వం ఉన& ఉపాధని పోగొట్టింది. సెజ్ గ్రామాలలో ఉపాధి హామీ పథకం నిలిపి వేసింది. బ్యాంకుల ద్వారా రైతులకు రుణాలు ఇవ్వడం నిలిపివేసింది. బడుగు బలహీనవర్గాలకు ఇచ్చే పాడి పశువులు, గొర్రెలు, మేకలు తదితర రుణాలు ఇవ్వడం లేదు. ప్రకృతి వైపరిత్యాలు వచ్చినపుడు పంట నష్టపరిహారం తాత్కాలిక సహాయం అందచేయడం లేదు. ఇందిరమ్మ గృహాలు, రోడ్డు, పాఠశాల భవనాలు, తుపాను షెల్టర్లలకు మరమ్మత్తులు చేయడం అనేవి జరగడం లేదు. ఈ మొత్తం క్రమం బడుగు బలహీన వర్గాలను గ్రామాల నుంచీ దూరం చేశాయి. కాకినాడ సెజ్ వ్యతిరేక పోరాటంలో బడుగు బలహీన వర్గాల నాయవత్వం తొలి దశలో లేనప్పటికీ మలిదశలో దళితులు అంబేద్కర్ సెజ్ వ్యతిరేక పోరాట కమిటీ ద్వారా తబపమ హక్కుల పరిరక్షణకు పూనుకున్నారు. తమ కోసం ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఐదు దళిత గ్రామాలతో పాటు వ్యవసాయ కూలీలు అధికంగా ఉన్న బిసి వర్గానికి చెందిన గ్రామాల్లోకూడా ప్రజల్ని కూడగట్టడానికి ప్రయత్నించారు. గ్రామ సభలు నిర్వహింంచారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా 2009 ఏప్రిల్ 14న ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ సభకు మానవహక్కుల కార్యకర్త డాక్టర్ బాలగోపాల్, హోప్ ఐలాండ్ సముద్ర తీరాన ఇసుక తవ్వకానికి వ్యతిరేకంగా పోరాడుతున్న హోప్ ఐల్యాండ్ పరిరక్షణ కమిటీ సభ్యులు సభలో పాల్గొనగా, కోస్తల్ కారిడార్ వ్యతిరేక కమిటీ, పోలేపల్లి సెజ్ వ్యతిరేక ఇతర ఉద్యమకారులు తమ మద్దతును ప్రకటించారు. ఈ సంఘం కార్యక్రమాలు సెజ్ యాజమాన్యాన్ని వణికించాయి. సెజ్ యాజమాన్యం సంఘం నాయకుల్ని నాయానా భయానా లొంగదీసుకుంది. దాంతో సెజ్ చూపించే ఉపాధి, లొసుగులు లేని పురావాసం వచ్చే వరకైనా పోరాటంలో భాగమవ్వాలని గ్రామాల్ని వదిలి వెళ్లొద్దన్న నిర్ణయం నీరుగారి పోయింది. అమ్ముడు పోయిన నాయకుల ద్రోహం వలన సంఘం విచ్చిన్నమయింది. చరిత్రలో అంటరానివారుగా వీరు వెలివేయబడితే ఈ రోజు తమకు తాముగా వెలివేసుకున్న ఒక సామాజిక వర్గంగా మిగిలిపోయారు. శతాబ్దలుగా అగ్రకులాల అణిచివేత భూమిలేని తనం వల్ల, సెజ్ ద్వారా మెరుగైన ఉపాధి లభిస్తుందన్న ఆశతో దళారీల వలలో చిక్కారు. ఈ బాధ సర్పద్రష్టుల్ని చూపించి, సెజ్ యాజమాన్యం మొత్తం ప్రజానీకం తమ వెంటే ఉన్నట్లు గొబెల్ ప్రచారం చేస్తుంది. మొదటి నుంచి పాలక వర్గాలు ఈ పేద బలహీన వర్గాల్ని ఉత్పత్తి శక్తులుగా, సమాజపు పునర్నిర్మాణానికి కేంద్ర శక్తులుగా, చోదక శక్తులుగా భావించే నిర్మాణాత్మకమైన వైఖరిని తీసుకోకుండా అతిహీనంగా నేడు సెజ్ యాజయాన్యాలకు బలిపెడుతున్నారు. ప్రభుత్వం బలహీన వర్గాల శ్రమను, జ్ఞానాన్ని వినియోగించుకొని భూసంస్కరణల ద్వారా అభివృద్దిని సాధించలేకపోయింది. సహజంగానే భూస్వామ్య వ్యవస్థలో ఉత్పత్తిగానీ, మిగులు ఉత్పత్తి గానీ మనిషి శ్రమ ద్వారా వచ్చిన కూడా అవి ప్రకృతి సహజంగా, భూమి కేంద్రంగాఆ మిగులు మీద అధికారం శ్రమకు కాకుండా, శ్రమ చేసిన మనిషికి కాకుండా, ఆ భూమి మీద ఉన్న వారికే చెందే క్రమం ఉంది. ఈ వ్యవస్థలో వ్యవవసాయేతర ఉత్పత్తులను, అవి తయారు చేసిన కులాలకు సామాజిక విలువ లేదు. కాబట్టి ఈ రోజు కాకినాడ సెజ్‌లో బడుగు బలహీనవర్గాలు భూమి నుంచి పెకిలించడానికి కారకులైయ్యారు. భూస్వామ్య సమాజంలో ప్రకృతి మీద ఉండే అవగాహన ఈ అవగాహన ద్వారా వచ్చిన ఉత్పత్తి పరికరాలు, ఆ పరికరాల ద్వారా వచ్చిన ఉత్పత్తి సంబంధాలు నేడు సెజ్‌ల ద్వారా చెల్లా చెదురై పెట్టుబడి కేంద్రీకరణ వ్యవస్థకు దారీ తీశాయి.
ఇన్నింటిని పోగోట్టుకున్న ఈ బాధితలకు అధికార యంత్రాంగం సరైన పనరావాసాన్ని కూడా అందించలేక పోయింది. ప్రత్యామ్నాయాన్ని చూపవలసిన పాలక వర్గాలు దళారీ పెట్టుబబడిదారీ వర్గానికి దాసోహమవుతున్నాయి. గ్రామాల నుంచి తరలించబడిన జనం పట్ల ప్రభుత్వం ఏ బాధ్యత వహించకుండా నిమ్మకుండి పోయింది. మధ్య ధనిక రైతాంగ నాయకత్వం ఉన్న సెజ్ వ్యతిరేక పోరాటం దళిత, బలహీన వర్గాల అసంతృప్తులను క్రోడీకరించి ఉద్యమ బాటలో కలుపుకోలేక పోతుంది.భూమిలేని నిరుపేదలు భూస్వామ్య వ్యవస్థలో కొత్తకాదు, భూమి మీద ఆధిపత్యం లేకపోయినా దాని మీద ఆదారపడ్డ అనుబంధంతో పోరాడారు. కానీ భూస్వామ్య వ్యవస్థ నుంచి పెట్టుబడిదారీ విధానంలో ప్రవేశిస్తున్న నేటి సమాజంలో సెజ్ యాజమాన్యం కొత్త ఆశలు రేకెత్తించి వ్యవసాయ కూలీలను భూమి నుంచి వేరు చేసింది. రైతులను, కూలీలను విడదీయ గలిగింది. అంటే భూమి నుంచి యాజమానులను తప్ప మెజారిటీ మనషులను దూరం చేసింది. రైతులు కూలీల మధ్య వైషామ్యాలు పెంచింది. రైతులను నిస్సహాయులను చేసి వారి స్థానంలో యంత్రాల వాడకాన్ని పెంచేలా చేసింది. వ్యవసాయం లాభసాటి కాదని మరోవైపు ప్రచారం చేస్తోంది. గమనించవలసిన విషయమేమిటంటే నందిగ్రాం, సింగూరులలో భూసంస్కరణలకు నోచుకొని ప్రజలు సెజ్ వ్యతిరేక ఉద్యమానికి ఊపిరి పోస్తే, కాకినాడ సెజ్‌లో బడుగు బలహీన వర్గాలే యాజమాన్యం చూపిన ఆశలకు బలై ఉద్యమానికి దూరంగా ఉండిపోయారు. అభివృద్ది యజ్ఞంలో సమిధలుగా మారిన వీరే అన్ని రకాల ఛీత్కారాలకు, హింసకు గురికావడం విషాదం.ఈ బడుగు బలహీన వర్గాల్లో ఎక్కువ శాతం దళితులే, వీరిలో 90 శాతం పైగా క్రైస్తవులైనా, స్టేట్ కుండే హిందుత్వ ధోరణి వల్ల వీరి మత హక్కును హరించేస్తోంది. వీరు ప్రభుత్వ రికార్డులలో హిందువులుగా, సామాజికంగా క్రైస్తవులుగా మిగిలిపోయారు. నాటి బ్రిటిష్ సామ్రాజ్య వాదుల కంటే నేటి అమెరికన్ సామ్రాజ్యవాదుల కంటే క్రూరమైన బ్రహ్మణ సామ్రాజ్యవాదం వీరిని క్రైస్తవులుగా గుర్తించదు. అలా గుర్తింపు కావాలంటే దళితుల రాయితీల మీద వేటు తప్పదు. అందుకే అనాదిగా అణగారిన ఈ కులాలు చాలా వరకు జనాభా లెక్కల్లో హిందువులుగానే మిగిలిపోయారు. ప్రపంచంలో ఏ సామ్రాజ్యవాది చేయనంత హీనంగా, క్రూరంగా దళితుల మానవ హక్కుల మీద దాడి చేస్తున్నారు. అందుకు కాకినాడ సెజ్ మినహయింపు కాదు. ఈ దళిత గ్రామాల్లో ఉన్న చర్చీలు కూడా మనిహాయింపు కాదు. తరతరాలుగా దళితులు పూజించుకున్న ప్రార్థన స్థలాలు కూడా సెజ్ కబ్జాలోకి చేరిపోయాయి. హిందూ మతతత్వ ఫాసిస్టు ప్రభుత్వం మైనారిటీ హక్కుల పట్ట మారణకాండ మాత్రమే కాకుండా ఆ మాణకాండ ప్రపంచ బ్యాంకు అభివృద్ది మరొక పార్శ్వమని ప్రత్యేక ఆర్ధిక మండలాలను అమలు పరుస్తున్న గుజరాత్ ముఖ్యమంత్రి నేటి హీరో. హిందూత్వ పాసిస్టు శక్తులు అంతగా సామ్రాజ్యవాదాన్ని బలపరుస్తున్నాయి అనడానికి ఇదొక మచ్చుతునక. వాటిలో కాకినాడ సెజ్‌లు కూడా భాగమే. కొసమెరుపు ఏమిటంటే క్రైస్తవ మైనారిటి సంఘాల నుంచి, దళిత సంఘాల నుంచి రావలసినంత ప్రతిఘటన లేకపోవడం!
– హేమ వెంకట్రావ్
వీక్షణం సౌజన్యంతో
తరువాయి భాగం రేపటి సంచికలో….