భూమి వేట – కాకినాడ సెజ్‌

(ఆదివారం తరువాయి భాగం)0
చట్ట విరుద్దంగా భూసేకరణ చేసి ల్యాండ్‌ మాఫియాతో కుమ్మక్కై చట్టబద్దంగా భూసేకరణ చేసనిట్టుగా రైతులను నమ్మించి వారి భూముల నుండి, గ్రామాల నుండి తరలించేందుకు ప్రయత్నించిన అప్టటి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ అనిల్‌ కుమార్‌ సింఘాల్‌, రెవెన్యూ రిజిస్ట్రేషన్‌ ముఖ్య కార్యదర్శి ఎస్‌వి ప్రసాద్‌, పంచాయతీ రాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ఎం శామ్యూల్‌ల పైన విచారణ జరిపి బాధ్యులైన వారిపై ఐపిసి సెక్షన్‌ 120(బి) నేరుపూరిత కుట్ర 409 ఉద్యోగాలు ఉండి (నమ్మకాన్ని వమ్ము చేయడం) (బ్రీచ్‌ ఆఫ్‌ ట్రస్ట్‌) 420 మోసం, అవినీతి నిరధక చట్టం సెక్షన్‌ రెడ్‌విత్‌ 13(2), రెడ్‌విత్‌ (1)(సి)(డి), అధికార దుర్వినియోగం సెక్షన్‌ 15 కింద కేసులు నమోదు చేయాలని మొత&ంగావ సిబిఐ విచారణ జరపాలని చైతన్యవంతమైన నాయకత్వం డిమాండ్‌ చేస్తున్నది. అయితే ఇందులో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి ఈ మధ్య వరుస భూకుంభకోణాలలో సిబిఐ చూపిస్తున్న పాత్ర పట్ల ప్రజలు ఆకర్షితులై ఉండవచ్చు లేదా ఆ మేరకు ప్రజాస్వామిక ఆకాంక్ష ప్రభుత్వం తీరుస్తుందేమోనని ప్రజల నుంచి వచ్చిన ఉద్యమం కావచ్చు. కాని ఏమి జరుగుతుందో మనం ఊహించుకోవచ్చు. ఇకపోతే ఈ మధ్య తెరమీదకు వస్తున్న జాతీయ భూసేకరణ పునరావాసం బిల్లు 2011 బిల్లుకు సంబంధించని దాని గురించి ఇక్కడ ప్రస్తావించడం లేదు. ఎందుకంటే అది వలసవాద చట్టం కంటే లొసుగులతో కూడిన దేశ విద్రోహ చట్టం. ఇందులో ఒక నైతిక, సామాజిక స్పృహే లేదు.
ఇంతగా చట్టం చట్టుబండలవుతున్న విపక్షాల పాత్ర ఏమిటి అనే ప్రశ్న రావచ్చు. అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వ హాయంలో సెజ్‌లకు తెర తీశారు. కాబట్టి సెజ్‌ బాధితులు ప్రత్యామ్నాయం కోసం వెలికారు. 2009 ఎలక్షన్లకు ముందు సామాజిక న్యాయం అంటూ తెరపైకి వచ్చిన ప్రజారాజ్యం వైపు సాధారణంగానే ప్రజలు మొగ్గు చూపారు. పిఠాపురం నియోజక వర్గంలో ప్రజారాజ్యం తరుపున వంగా గిత నిలబడ్డారు. ఈమె ఒక కుల వర్గానికి సంబంధించింది. ఆ కులానికి సంబంధించిన వారే మొజారటీ అలాగే రాష్ట్రంలో అనేక మంది దళిత మేధావులు ప్రజారాజ్యం సామాజిక న్యాయంపై ఆవలు పెట్టుకుని ఆ పార్టీలో చేరినట్టే ఎక్కువ శాతం దళితులు ఆ పార్టీకే ఓటు వేశారు. గమనించవలసిన దేమిటంటే ఆమె స్థానికురాలు కాకపోయిన ఈ వర్గాలే ఆమెను గెలిపించాయి. ఏ పార్టీని సెజ్‌ బాధిత ప్రజలు ధిక్కరించారో ఆ పార్టీలోకే ప్రజారాజ్యం పార్టీ విలీనమయింది. అప్పటి వరకచు భూములు కాపాడు తామన్న ఆమె వెనుదిరిగింది. కాకినాడలో పెద్ద ఎత్తున ఏత్తున ఏరువాక లాంటి ఉద్యమాలు నడిపినా ప్రజలకు వారి ఆకాంక్షకు మద్దతు ఇవ్వలేదంటే ఆమె పాలక పక్షంలో మమేకమైనట్టే అని ప్రజలు గ్రహించారు.
ఉప ఎన్నికల నేపథ్యంలో సెజ్‌ల భూములు రైతులకు ఇచ్చే వరకూ పోరు అని 2012 ఏప్రిల్‌ 20న ప్రజల ముందు చంద్రబాబు (తెలుగు దేశం) ప్రకటించారు. ఇదే చంద్రబాబు నాయుడు వ్యవపాయం దేశానికి పనికరాదని ప్రపంచ బ్యాంకుకు దాసోహమన్న విషయాన్ని అతను మర్చి పోయాడేమోగాని ప్రజలు మర్చిపోలేదు. కాకినాడ వ్యతిరేక ఉద్యమంలో మొదటి నుంచి బిజెపి వైఖరి వేరు. గుజరాత్‌కు భిన్నంగా వారి రాజకీయ ప్రయోజనాల కోసం సెజ్‌ వ్యతిరేక ఉద్యమానికి మద్దతు తెలిపారు. ఇక ఎనిమిది కమ్యూనిస్టు పార్టీలతో ఆవిర్భవించిన కాకినాడ సెజ్‌ వ్యతిరేక కమిటీలో మొదటి నుంచి సిపిఐ (ఎంఎల్‌) లిబరేషన్‌, న్యూడెమోక్రసీ పార్టీలు పోరాటంలో పాల్గొన్నాయి. ఎన్నొ అక్రమ కేసుల్ని ఎదుర్కొన్నారు. ఇద్దరు లిబరేషన్‌ నాయకులు జైళ్లపాలయ్యారు. మొదట్లో ఉన్న ఉద్యమ తీవ్రత తగ్గింది. ఒక క్రియాశీల ఐక్య కార్యాచరణ కొరవడింది.
ప్రజాపోరులో ఒక నిర్మాణాత్మకమైన వైఖరిని ఈ సంఘాలు తీసుకోలేకపోయాయి. 2008 నుంచి సెజ్‌ వ్యతిరేక పోరాట కమిటీ, ప్రజా సంఘాల నాయకులు, న్యాయవాదిపై పెట్టిన కేసుల కొనసాగుతూ ముగింపు దశకు చేరుకున్నాయి. ఈ కేసులన్ని పిఠాపురం, తుని, కాకినాడ కోర్టులలో ఉన్నాయి. వారంలో రెండు మూడు రోజులు నాయకులు ఏదో ఒక కేసులో హాజరు కావలసిందే, నాయకులకు శిక్ష ఖరారు కావడానికి కావలసిన అబద్దపు సాక్ష్యాలను సెజ్‌ యాజమాన్యం ప్రవేశపెడుతుంది. ఉద్యమ స్పూర్తితో మందుకు
వెళ్తున్న నాయకులకు ఎలాంంటి శిక్షలు పడతాయో వేచి చూడవలసిందే!
సెజ్‌ వ్యతిరేక పోరులో అత్యధికంగా పాల్గొన్నది మహిళలే . పోలీసులు గ్రామాలపై విరుచుకుపడితే తామే ముందుండి తమ వారిని కాపడుకోవడంతో పాటు అనేక విషయాలను చర్చించుకునేవారు. ప్రజలు ప్రకృతి వనరులను పోగొట్టు కోవడంతో పాటు దానికి సంబంధించిన జ్ఞానాన్ని కూడా పోగొట్టుకుంటారు. వ్యవసాయానికి బదులు పారశ్రామికీకరణే ప్రత్యామ్నాయంగా వచ్చే సమాజంలో నైపుణ్యంతో కూడిన జ్ఞానం కొరవడుతోంది. కాబట్టి స్త్రీలు ఈ విషయాన&ఇన ముందు గానే గుర్తించారు. ప్రత్యామ్నాయ సమాజంలో కావలసని నైపుణ్యంలేక, ఉన్న కాస్తంత ఆర్థిక స్వాతంత్య్రాన్ని కోల్పోతామని గృహ పరిధిలోకి నెట్టి వేయబడుతామన్న స్పృహ వారికి కల్గింది. స్త్రీలక కుటుంబ వనరులపై ఆధిపత్య హక్కులు లేకపోయినా ఓ మేరకు రక్షణ ఫ్యూడల్‌ వ్యవస్థ కల్పిస్తుంది. సహజంగానే మొదటి దశలో భూమిని కోల్పోయినప్పుడు డబ్బు రూపేణా వచ్చే పునరావాసం పురుషుని చేతుల్లోకి వెళ్లిపోయింది. పితృస్వామిక సమాజంలో ఈ మార్పు పురుషుని పెత్తనానికి దారితీసింది. ఇప్పటి వరకు ఉద్యోగం పురుష లక్షణం కాబట్టి పునరావాస కాలనీలో కల్పిస్తున్న కొన్ని శారీరక శ్రమకు సంబంధించిన పనులు అన్ని పురుషులకే ఇచ్చారు. శ్రామిక వర్గానికి చెందిన స్త్రీలు తమ అస్తిత్వాన్ని కోల్పోయి ఇంటికే అంకితమయిపోయారు. ఇది కుటుంబ హింసకు దారితీసింది. కాబట్టి స్త్రీలు ఉద్యమంలోకి ఉదృతంగా వచ్చారు. కాకినాడ సెజ్‌ రాములమ్మలు, పోలేపల్లి చుక్కమ్మలు, జిందాల్‌ దేవుడమ్మలు, రాయిఘడ్‌, మంగళూర్‌ దీదీలు ఈ కోవకు చెందిన వారే. విషాదమేమిటంటే కాకినాడ సెజ్‌ యాజమాన్యాన్ని ఠారెత్తించి ప్రతిఘటించిన స్త్రీలు నాయకత్వ స్థానంలో లేరు. కేవలం ప్రతిఘటనా స్వరాలుగా మారిపో యారు.సెజ్‌ ఉద్యమ సార థ్యా న్ని నిర్వహంచడంలో వీరి పాత్ర లేదు. అందుకు కారణం పితృస్వామ్య ధోర ణులు నాయకత్వంలో ఉండ డం. సునామీలా వచ్చి పోలీ సులను తరిమి వేసిన స్త్రీలు అంతే వేగంగా మిన్నకుం డిపోయారు. వంటవార్పు నిరసన కార్యక్రమంలో కూడా స్త్రీల బాగస్వామ్యం చెప్పుకోదగినదిగా లేదు. ఉద్యమకారులలో స్త్రీలు ముందుంటే పోలీసులు ఏమి చేయరన్న అబిప్రాయం ఉండోచ్చు. కానీ వారిని నాయకత్వ స్థానంలోకి తీసుకురావాలన్న అభీష్టం లేదు. అందుకు కారణాలు ఏమైనా కావచ్చు. కాని కుటుంబాన్ని ఇద్దరు వ్యక్తుల కలయికగా కాకుండా పితృస్వామ్య భావజాలంలో ఉన్న విభిన్న అభిప్రాయాలు కలిగిన వ్యక్తులుగా గుర్తించకపోవడం పెద్ద లోపం. రాష్ట్రంలో సెజ్‌ ఉద్యమాల ఆదర్శంగా నిలిచిన కాకినాడ సెజ్‌ ఉద్యమం మరింత పదును పెట్టుకోవడానికి తీసుకోవాలిసిన అవసరాలలో స్త్రీల నాయకత్వ శ్రేణులను ఏర్పర్యడం తక్షణ కర్తవ్యం కావాలి. మహిళా సాధికారత పేరిట ప్రభుత్వం స్వయం సహాయక గ్రూపులను ఏర్పాటు చేసి తమ ప్రయోజనాలకు వేదికగా మలిచింది. కాని సోంపేట థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టు వ్యతిరేక ఉద్యమంలోని స్త్రీలు ప్రభుత్వ ఆర్ధిక సహాయాన్ని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారన్న వాస్తవం మనకు తెలుసు. మన దేశంలో ఫెమినిస్టు ఉద్యమాలు వ్యక్తిగత సమస్యలకు పరిమితం అయినంతగా, ప్రజా ఉద్యమాలలో కమేకం కాలేక పోతున్నాయి. కుటుంబ సంబంధాల సమస్యల పరిధిని దాటి విస్తృత సమాజ స్థాయిలో ప్రజలతో కలిసి నడిచినప్పుడే స్త్రీల విముక్తి సాధ్యమవుతుందన్న ఆచరణ, స్పృహ నేడు ఫెమినిస్టు ఉద్యమాలకుఅత్యంత అవసరం. ఈ ఉద్యమాల రాజకీయ దృష్టి, తాత్విక పునాది మరింత పదునెక్కి సమాజ విముక్తిలో పాల్గొన్నప్పుడే ఇది సాధ్యం.
సెజ్‌ గ్రామాల్లోని చదువుకున్న యువత తాము చదువుకున్న చదువుకు ఉద్యోగాలు రాక గ్రామాలకు వెనుదిరుగుతున్నారు. గ్రామాలలో భూములను కోల్పోయిన తమ తల్లిదండ్రులకు జరిగిన అన్యాయం పైన ఊరూరా తిరిగి అధ్యయంన చేశారు. కలసికట్టుగా తమ పోలాల్లో వంటవార్పు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తమ భూములు మేజర్లుకాని తమ అనుమతి లేకుండా బదిలి చేయబడిందని, కాబ్టి తమ భూములపై తమకు కూడా హక్కు ఉందని ఉపాధి కలిపంచాలని డిమాండ్‌ చేశారు. అందుకు గ్రామలపై పడి పోలీసులు యువతను అరెస్టు చేశారు. తల్లితండ్రులను బెదిరించారు. అయినా యువతవెనుదిరగలేదు. ఇప్పటివరకు కొనసాగుతున్న ఉద్యమ బాటలోనే ప్రయాణిస్తున్నారు. నాయకత్వ బాధ్యతలు తీసుకోవడానికి సంసిద్దులవుతున్నారు.
– హేమ వెంకట్రావ్‌
వీక్షణం సౌజన్యంతో
తరువాయి భాగం రేపటి సంచికలో…