భూమి వేట – కాకినాడ సెజ్
(సోమవారం తరువాయి భాగం)
సెజ్ గ్రామాల్లోని చదువుకున్న యువత తాము చదువుకున్న చదువుకు ఉద్యోగాలు రాక గ్రామాలకు వెనుదిరుగుతున్నారు. గ్రా మాలలో భూములను కోల్పోయిన తమ తల్లిదండ్రులకు జరిగిన అన్యాయంపైన ఊరూరా తిరిగి అధ్యయం చేశారు. కలిసికట్టుగా తమ పొలాల్లో వంటవార్పు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తమ భూములు మేజర్లు కాని తమ అనుమతి లేకుండా బదిలీ చేయబ డిందని, కాబట్టి తమ భూములపై తమకు కూడా హక్కు ఉందని ఉపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. అందుకు గ్రామాలపై పడి పోలీసులు యువతను అరెస్టు చేశారు. తల్లిదండ్రులను బెదిరిం చాడు. అయినా యువత వెనుదిరగలేదు. ఇప్పటివరకు కొనసా గుతున్న ఉద్యమ బాటలోని ప్రయాణిస్తున్నారు. నాయకత్వ బాధ్య తలు తీసుకోవడానికి సంసిద్దులవుతున్నారు. ఇక ఉప ఎన్నికల సందర్భంలో చంద్రబాబు రైతులకు భూమిని పోరాడి ఇప్పిస్తాన న్నాడేకాని ఆ ప్రయత్నాలు ఏమీ లేక పోగా సరికొత్త విషయంలో అధికారి కోసం పాదయాత్ర మొదలు పెట్టారు. బీజేపీ, సీపీఏం వంటి అఖిల భారత పార్టీలయినా, తెలుగుదేశం లాంటి ప్రాంతీయ పార్టీలైనా సామ్రాజ్యవాద ప్రపంచీకరణను వ్యతిరేకించే ధోరణిని నటించి అధికారం లోకి వచ్చినా ఆ పార్టీల నిబద్ధత ఇప్పటి వరకు ప్రజలకు అనుభవ పూర్వకమే. ఏ రాజకీయ శక్తులైన, బానిస వ్యవస్థలో భూమిని వాడుకున్నారే గాని ఇంతగా భ్రష్టు పట్టించలేదు. అందుకే సెజ్‌లను క్షుణ్ణంగా అధ్యయం చేసిన ఆర్‌ఎస్‌రావు వివరణ ఎంతో సరైనది. ఆయన ఏమంటారంటే కమ్యూనిస్టు దేశాలు ఒక్క అడుగు వెనక్కి వేసిన కాలంలో పెట్టుబడి తనదైన శైలిలో ప్రవేశపెట్టిన ప్రపంచీకరణ కార్యక్రమంలో సెజ్‌లు అత్యంత ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉన్నాయి. సోషలిస్టు సమాజాలను పున ర్నిర్మించే కార్యక్రమంలో అంతర్‌రాష్ట్రీయ పెట్టుబడి ఎంచుకున్న రూపం సెజ్. ఈ పునర్‌నిర్మాణ కార్యక్రమంలో మిగిలిన సమాజం దాని చరిత్రతో సంబంధం లేకుండా ప్రభుత్వ ఆధిపత్యానికి దైరంగా స్వచ్ఛందంగా పెరిగినవే సెజ్‌లు అంటారాయన. పాలకులు పెట్టుబడి ద్వారా వృద్ధిని వ్యవస్థాగత మార్పులు లేకుండా తేవాలని చూస్తుంటే ప్రజలు వ్యవస్థలో మార్పు ఒక కొత్త నిర్మాణంలోకి అబి óవృద్ధిని వ్యవస్థాగత మార్పులు లేకుండా తేవాలని చూస్తుంటే ప్రజలు వ్యవస్థలో మార్పు ఒక కొత్త నిర్మాణంలోకి అభివృద్ధిని చూ స్తున్నారు. ఇది పాలకులకు ప్రజలకు చూపి అదే అభివృద్ధి అనే భావనను నెట్టేసి వృద్ధి అనే భూతాన్ని ప్రజలకు చూపి అదే అభివృ ద్ధిగా వర్ణిస్తున్నారు. పాత సమాజం నుంచి కొత్త సమాజంలో వృద్ధి సాధ్యపడినా మిగులు మనుష్యులు సమస్యలు తీరకపోవడం, పేదరికంతో, నిరుద్యోగంతో బతుకుతూ పెట్టుబడిదారీ వర్గాల దయా దాక్షిణ్యాల మీద ఆధారపడేటట్లు మన్ముందు చేస్తారు. దేశం లో మొట్టమొదటి సారిగా సెజ్‌లను తాత్కాలికంగా నిలిపివేసిన గో వాకు మేము వెళ్లినప్పుడు అక్కడ సామాజిక కార్యకర్తలు వెళ్లబుచ్చిన అభిప్రాయం కూడా ఇదే. వారు సెజ్ మైనింగగ్ వ్యతిరేక ఉద్యమాల అభిప్రాయం కూడా ఇదే. వారు సెజ్ మూనింగ్ వ్యతిరేకత ఉద్యమాల అనుభావాలను పంచుకొని కాకినాడ సెజ్ వ్యతిరేక ఉద్య మానికి మద్దతును ప్రకటించారు. గోవాలో ఎలక్షన్ల సంద ర్భంగా నియోజక వర్గాల ఎన్నికల పోటీలో నిలబడి సెజ్ వ్యతిరేక ఉద్యమాలకు అండగా నిలిచిన వారిని గెలిపించమని తద్వారా సెజ్‌లను రాష్ట్రంలో మట్టు పెట్టాలని ప్రజలు పిలుపునిచ్చారు. అప్పటి వరకు కాంగ్రెస్ కూటమి హయాంలో ఉన్న ప్రభుత్వ భూములను సెజ్‌లకు అప్పగించాలని ప్రయత్నిస్తే ప్రజలు ప్రత్యా మ్నాయంగా బీజేపీ కూటమిని గెలిపించారు. అప్పటి ప్రతిపక్షనేత మనోహర్ పారెకర్ నేటి ముఖ్యమంత్రి ఇతను ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు ఇనుప ఖనిజ తవ్వకాల్లో అవినీతి అక్రమాలను, మైనింగ్ కార్యకలాపాలలోని దోపిడీని ప్రజా ఉద్యమాలు బయటపెట్టాయి. గోవా ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్ధ ప్రజా ప్రయోజనాల వ్యాజ్యా న్ని సుప్రీం కోర్టులో వేసి అక్రమ మైనింగ్ కార్యకలాపాలపై దర్యాప్తు చేయాలని కోరిందిన. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం జస్టిస్ ఎం.బీ.షా నేతృత్వంలో ఒక కమీషన్‌ను నియమించింది. 12ఏళ్ల కాలంలో అక్రమ మైనింగ్ ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ. 35వేల కోట్ల నష్టం జరిగిందని నిర్దారించింది. ఈ నేపథ్యంలోనే గోవాలో మైనింగ్ కార్యకలాపాలపై పూర్తి స్థాయి నిషేధం విధిస్తూ సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆఫ్తాబ్ ఆలం నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. గోవాలో అక్రమ మైనింగ్‌పై నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని సుప్రీం సాధికార కమిటీకి ఆదేశాలు జారీ చేసింది. గోవాలో మైనింగ్ లీజులు అన్నింటిని చట్టవిరుద్ధంగా ఇచ్చారని గోవా ఫౌండేషన్ తరుపున హజరైన న్యాయవాది ప్రశాంత్ భూషన్ సుప్రీం కోర్టుకు తెలిపారు. రాష్ట్రంలోని మైనింగ్ కార్యకలాపాలపై గోవా ప్రభుత్వం ప్రజల ఒత్తిడితో, ఎన్నికల నాటి ప్రమాణాలకు అనుగుణంగా తప్పని పరిస్థితులలో తాత్కాలిక నిషేధం విధించింది. 2012ఆక్టోబర్ వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది. అయితే తాత్కాలిక నిలుపుదలతో దీర్ఘకాలిక ప్రయోజనాలకు ఒరిగేది ఏమిలేదని ఇప్పటికే ప్రైవేటు కంపెనీలు గనుల నుంచి ఖనిజాన్ని తవ్వి రణా చేసుకుంటున్నాయని ప్రశాంత్ భూషణ్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఫలితంగా మైనింగ్ మాఫియా మీద సుప్రీంకోర్టు ఉక్కుపాదం మోపింది. ఆంధ్రప్రదేవ్, కర్ణాటకలలోని మైనింగ్ కార్యకలాపాలపై సుప్రీం కోర్టు నిషేధం విధించిన సంగతి సుపరిచితమే. సెజ్‌లపై రద్దు, మైనింగ్ కార్యకలాపాలపై ఉక్కుపాదం ప్రజల సంఘటిత శక్తితో అసాధ్యాలు అనుకున్నవి సుసాధ్యాలుగా మారతాయనడానికి ఇవి మచ్చుతు నకలు.అభివృద్ధి పేరిట జరిగే విధ్వంసంలో తాము ధ్వంసం అవుతున్నామని ప్రజలు హెచ్చరికగా తమ పోరును రాష్ట్రాలలో వివిధ స్థాయిలలో కొనసాగిస్తూనే ఉన్నారు. మన రాష్ట్రంలో సోంపేట, కాకరాపల్లి థర్మల్ విద్యుత్ పోరాటాలు తీసుకున్నటు ్లయితే అవి మరింత విస్తృతమయి భూపోరాటంగా మాత్రమే కాక పర్యావరణం, సహజ ప్రకృతి వనరులను కాపాడుకోవడం లక్ష్యంగా కదిలింది. అందుకే భూమి సొంతదారులే కాకుండా ప్రతి ఒక్కరిని ఉద్యమంలో భాగస్వాములను చేసింది. సామ్రాజ్యవాద పెట్టుబడి దారీ వర్గ వ్యతిరేక పోరాటంగా రూపుదిద్దుకొంది. సామ్రాజ్యవాద పెట్టుబడిదారీ వర్గ వ్యతిరేక పోరాటంగా రూపుదిద్దుకొంది. న్యాయ స్థానాలను ఆశ్రయించినా పోరాటపటిమను కోల్పోలేదు. అందుకు ప్రభుత్వ దమనకాండకు సోఎంపెట, కాకాపల్లిలో జరిగిన పోలీసు కాల్పులే సాక్షం. బహుళ జాతి కంపెనీలు, బడా పారిశ్రామిక వేత్తలు, బడా భూస్వాములు కావడానికి చేసే ప్రయత్నాలకు ప్రజలు గండి కొడుతున్నారు. అందుకు మొన్నటి నందిగ్రాం జయగీతికే సాక్షంఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల దగ్గర ఉన్న భూములు లాక్కుంటూ ప్రజల దృష్టిని మారల్చేందుకు మరో విడత భూపంపిణీకి సిద్ధమవుతుంది. ఈ విషయాన్ని రెవెన్యూ మంత్రి 2012 ఆక్టోబరు 5న ప్రకటించారు. పేదలకు భూములు పంచేందుకు కనీసం లక్ష ఎకరాలు భూమి సేకరించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఒక వైపు శ్రీకాకుళం భూమి సేకరించా లని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఒక వైపు శ్రీకాకుళం జిల్లాలోని లక్షీంపేటలో దమనకాండ జరిగి ఐదుగురు దళితులు చనిపోతే 250 ఎకరాల ప్రభుత్వ భూమిని పంచలేని పాలక వర్గాలు లక్షల ఎకరాల భూపంపిణీ చేస్తామని ప్రకటనలు చేస్తున్నాయి. త్వరలో ఆంధ్రప్రదేశ్ భూ నిర్వాహణ సంస్థ ఏర్పాటు కానుందని, భూములు కేటాయింపు స్వాధీనం వంటి ఆంశాలను ఈ సంస్థే పర్యవేక్షించ నుందని సెలవిచ్చారు. మరి ఇప్పటి వరకు వేల ఎకరాలను పంచే రంగాన్ని బడా పారిశ్రామికవేత్తలకు అప్పచెప్ని ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల సంస్థ (ఎపీఐఐసీ) కంటే ఈ సంస్థ ఏవిధంగా భిన్నమయింది..? ఈ విషయాలను సదురు మంత్రిగారు ప్రస్తావిం చారు. పైగా క్రిష్టియన్, ముస్లీం మైనార్టీ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ఒక వైపు అణగా రిన వర్గాల నెత్తుటిలో భూమి తడిసి ముద్దవుతుంటే మరోవైపు పాలక వర్గాల బూటకపు మాటలు ప్రజలు నమ్మే స్థితిలో లేరు. కొన్ని సంవత్సరాలుగా దుర్వినియోగం అవుతున్న భూముల్ని గుర్తిం చి వాటిని స్వాధీనం చేసుకోవాలని రెవెన్యూ ముఖ్యకార్యదర్శి అనిల్ చంద్రపునేత కలెక్టర్లకు సూచించారు. బడా కంపెనీల ఏజెంట్లుగా పని చేస్తున్న పాలక వర్గాలు, పాదయాత్రల పేరుతో అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నా, ప్రతిపక్షాలుగాని, సెజ్ పేరు చెప్పి కొల్లగొట్టిన భూములను స్వాధీనం చేసుకోవాడానికి నిర్థిష్టమైన చర్యలు చేపట్టగలరా..? వైఎస్ అనే భూతాన్ని వదిలించుకోవడానికి పావులుగా రాజకీయం చదరంగం నడుస్తుంది. జాతీయ స్థాయిలో సంస్కరణల రూపంలో దేశాన్ని టోకుగా అమ్మివేయడానికి రంగం సిద్ధం అయింది. రాష్ట్రంలో సెజ్ వ్యతిరేక ఉద్యమం ఇప్పుడు నివురు గప్పిన నిపులా ఉంది. సామ్రాజ్యవాద ప్రపంచీకరణలో భాంగా భూమిని పోగొట్టుకున్న తండ్రుల తరం, తరాల సంపదని, ఉపాధిని పోగొట్టుకొన్న ఈ తరం కుంటుబ ఆర్థిక ఆస్థిరత్వానికి బలైన స్త్రీలు, మోసగింపబడ్డ దళిత, బలహీన వర్గాలు యుద్ధానికి సిద్ధంగానే ఉన్నాయి.గమనించవలసనది ఏమిటంటే వలసవాద కాలంలోనూ, స్వాతంత్య్రం పేరిట అధికార మార్పిడి తర్వాత దేశ పౌరులు తాము జీవించే స్వాతంత్య్రం పేరిట అధికార మార్పిడి తర్వాత దేశ పౌరులు తమ జీవించే హక్కుక్కై పోరాడుతూనే ఉన్నారు. సామ్రాజ్య వాద వ్యతిరేక పోరులో అమరులైన భగత్‌సింగ్ తదితరులు నవజవాన్ సభను ఏర్పాటు చేసి కార్మిక కర్షక రాజ్యం కోసం ఉరి కంబం ఎక్కారు. తెలంగాణ రైతాంగ ఉద్యమంలో బండగీ సోద రులు భూమి పంపకాలు, చాకలి ఐలమ్మ గొతులో భూస్వాములకు వ్యతిరేకంగా దున్నేవానికే భూమి నినాదం పుట్టుకొచ్చింది. ఇదే ఉద్యమం శ్రీకాకుళం మరిన్ని రైతాంగ పోరాటాలకు భూమిక అయింది. మన పొరుగు రాష్ట్రం తమిళనాడులో అణువిద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా, చత్తీస్‌గడ్‌లో ప్రజలు పెట్టుబడి అధారిత, అభివృద్ధి నమూనాలు వ్యతిరేకించి హింస, ప్రతిహింసలు మొదలైనా ప్రజలు వెనుదిరుగ లేదు. అంతిమంగా ఈ సెజ్ వ్యతిరేక పోరాటం ఒక పటిష్టమైన రాజకీయ దృష్టి కోణంలో ప్రజా ఉద్యమ నిర్మాణ బాటలో సంఘటితంగా సామ్రాజ్యవాద ప్రపంచీ కరణను ఎదుర్కొనే స్థాయికి చేరినప్పుడే పరిష్కారం దొరుకుతుంది. లేనట్లయితే అవి తాత్కాలిక విజయాలే కానీ శాశ్వత పరిష్కారం కావు కాకినాడ పోరాటానికి ఇది మినహాయింపు కాదు. అదే జరగాలని ప్రజల పోరుతో మనం మమేకమవుదాం.
– హేమ వెంకట్రావ్
వీక్షణం సౌజన్యంతో …