భూసేకరణపై విపక్షాల ర్యాలీ

1

ర్యాలీలో పాల్గొన్న సోనియా, మన్మోహన్‌

న్యూఢిల్లీ,మార్చి17(జనంసాక్షి): భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించడానికి కాంగ్రెస్‌ నేతృత్వంలో ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. భూ సేకరణ బిల్లు ద్వారా ప్రభుత్వం రైతుల పొట్ట కొడుతుందని ఆరోపిస్తూ ప్రతిపక్షాలు పార్లమెంట్‌ భవన్‌ నుంచి రాష్ట్రపతి భవన్‌ వరకు ర్యాలీ చేపట్టాయి. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌ ఆ ర్యాలీకి నాయకత్వం వహించారు. ఆ ర్యాలీలో జేడీయూ, జేడీఎస్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌, సమాజ్‌వాది పార్టీ, సీపీఎం, సీపీఐ, డీఎంకే, లోక్‌దళ్‌ తదితర పార్టీలు పాల్గొననున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకీ మెమొరాండం అందజేస్తాయి. బీఎస్పీ అధినేత్రి మాయావతి ఈ ఆందోళనకు మద్దతు తెలిపారు. అయితే తమ పార్టీ ఆ ర్యాలీలో పాల్గొనడం లేదని ఆమె స్పష్టం చేశారు. కాగా ఈ ర్యాలీకి ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. ఇదిలావుంటే కాంగ్రెస్‌ ప్రముఖులు వీరప్పమొయిలీ, శశిథరూర్‌, అంబికాసోని సహా పలువురు ఇందులో పాల్గొన్నారు. ఇదిలావుంటే  బొగ్గు కుంభకోణంలో నిందితుడుగా ముద్రపడిన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌తో నేషనలిస్టు కాంగ్రెస్‌ బృందం ఆయన నివాసంలో భేటీ అయింది. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవర్‌ నేతృత్వంలోని బృందం ఆయనకు అండగా నిలబడతామని హావిూ ఇచ్చింది. ఆయా వ్యవస్థపై తమకు గౌరవం ఉందని, అయితే మన్మోహన్‌సింగ్‌ నీతి, నిజాయితీలపై తమకు పూర్తి నమ్మకం ఉందని శరత్‌పవర్‌ అన్నారు. ఆ సమావేశంలో పార్టీ ప్రధాన కార్యదర్శి తారీక్‌ అన్వర్‌, ఎన్సీపీ సీనియర్‌ నేత మజిద్‌ తదితరులు పాల్గొన్నారు. అనంతరం భూ సేకరణ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించనున్న ర్యాలీ గురించి ఈ సమావేశంలో చర్చింరారు.