భూసేకరణ చట్టం`2011

ప్రాంతాల మధ్య, సమాజాల మధ్య, కుటుంబంలోని వ్యక్తులమధ్య ఉండు గుణాత్మకమైన తేడాలతో నిమిత్తం లేకుండా, వారి అభివృద్దితో సంబంధం లేకుండా భూసేకరణ బిల్లు రూపొందిందని అంటున్నారు ముదునూరి భారతి

గత అరవై ఐదు సంవత్సరాలుగా భారత ఆర్ధిక వ్యవస్థని అభివృద్ది చేసే పేరిట ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. మిగతా వెనుకబడిన దేశాల లాగానే మన దేశాన్ని కూడా ఒక సాంప్రదాయ వ్యవస్థగా గుర్తించడం జరిగింది. మన వ్యవసాయ కేంద్ర సాంప్రదాయ వ్యవస్థని పరిశ్రమల కేంద్ర ఆధునిక వ్యవస్థగా మార్చడానిక పెట్టుబడి` అంటే ధన రూపంలో కాని, జ్ఞాన రూపంలో కాని, టెక్నాలజీ రూపంలో కానీ ` ఒక్కటే మనకున్న ఏకైక మార్గమని భావించి అనేక పథకాలు రూపొందించడం జరిగింది. ఈ ప్రతిపాదన ఫలితంగా పెద్దపెద్ద డ్యాంలు, ఉక్కు పరిశ్రమల నిర్మాణం, సేవారంగంలో విద్య, వైద్యం, ప్రమాణ సౌకర్యాలు మొదలైన సదుపాయాలు కల్పించడంలో, సమాజం అనేక మార్పులకు లోనై ఒక కొత్త ఆధునిక సమాజం అవిర్బవించగలదనే ఊహ మన దేశ నేతృత్వానికి బలంగా ఉండేది. అంతే కాకుండా, గత రెండు దశాబ్దాలలో, ఈ అభివృద్ది క్రమాన్ని వేగవంతం చేసే ప్రయత్నంలో, ప్రపంచీకరణ కార్యక్రమంలో భాగంగా వ్యవసాయ రంగంలో కార్పొరేట్‌ వ్యవసాయం, పరిశ్రమల రంగంలో ప్రత్యేక ఆర్థిక మండలాలు, సేవారంగంలోఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే అనేక సంస్థలు, కార్పొరేట్‌ ఆస్పత్రులు, కార్పొరేట్‌ విద్యా సంస్థలు, ఆధునిక విమానాశ్రయ