మండలిలో ప్రతిపక్ష నేతగా షబ్బీర్ అలీ
హైదరాబాద్,మార్చి31(జనంసాక్షి): తెలంగాణ శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా షబ్బీర్ అలీని కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. ఈ మేరకు కౌన్సిల్ చైర్మన్ స్వామిగౌడ్ కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమకుమార్ రెడ్డి లేఖ రాశారు. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ ఆదేశాలతో షబ్బీర్ అలీని ప్రతిపక్ష నేతగా ఎంపిక చేశామని ఉత్తమకుమార్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటివరకు సీనియర్ నాయకుడు డి. శ్రీనివాస్ కౌన్సిల్ లో విపక్షనేతగా కొనసాగారు. కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జి దిగ్విజయ్ సింగ్ ఆదేశాలతో షబ్బీర్ అలీని ప్రతిపక్ష నేతగా నియమించడం జరిగిందని ఉత్తం తెలిపారు. ఇంతవరకు కాంగ్రెస్ సీనియర్ నేత డి.శ్రీనివాస్ విపక్ష నేతగా ఉన్నారు. ఆయన పదవీ కాలం ముగియడంతో షబ్బీర్ అలీకి ఈ అవకాశం వచ్చింది.డి.శ్రీనివాస్ మరోసారి ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. ఈ లోగానే షబ్బీర్ కు ప్రమోషన్ రావడం విశేషం. విపక్ష నేతకు ప్రభుత్వపరంగా క్యాబినెట్ ¬దా లభిస్తుంది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ పై విమర్శలు కురిపించడంలో షబ్బీర్ ముందు భాగాన ఉండడం కూడా ఆయనకు కలిసి వచ్చింది.