మండల జర్నలిస్టులు. వామపక్షాల ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి నిరసన
కడెం సెప్టెంబర్ 22 (జనం సాక్షి ) ఖానాపూర్ సాక్షి పత్రిక విలేకరి లక్ష్మణ్ పై దాడిని ఖండిస్తూ కడెం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై మండల జర్నలిస్టులు అఖిలపక్ష పార్టీల నాయకులు ప్రజా సంగల నాయకులు రోడ్డుపై భైఠాయించి నిరసన తెలిపారు నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణ కేంద్రనికి చెందిన సాక్షి పత్రిక విలేకరి లక్ష్మణ్ ఆన్ లైన్ వర్క్స్ జిరక్స్ సెంటర్ లో గత శనివారం రాత్రి ఖానాపూర్ పట్టణ కేంద్రానికి చెందిన ఓ యువకుడు జిరాక్స్ సెంటర్ నడుపుతున్న సాక్షి విలేఖరి లక్ష్మణ్ పై వాగ్వాదానికి దిగీ విలేకరి లక్ష్మణ్ పై దాడి చేయగా లక్ష్మణ్ తలకు తీవ్ర గాయాలయ్యాయి లక్ష్మణ్ ను హుటాహుటిన నిర్మల్ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందించారు మెరుగైన వైద్యం కోసం జగిత్యాల జిల్లా కేంద్రంలోని సాయి ప్రైవేట్ న్యూరో ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు కాగ లక్ష్మణ్ పై దాడి పట్ల లక్ష్మణ్ తల్లీ దండ్రులు కళావతి గంగారాం లు స్థానిక ఖానాపూర్ పోలీస్ స్టేషన్లో కుటుంబ సభ్యుల తో కలిసి ఫిర్యాదు చేశారు దాడిచేసిన వారిని వెంటనే రిమాండ్ కు తరలించాలని డిమాండ్ చేశారు దీనిపై పోలీసులు లక్ష్మణ్ పై దాడి చేసిన వ్యక్తి పై కేసు నమోదు చేశారు అయితే నిందుతున్ని రిమాండ్ కు పంపించకపోవడం లేదని దానికి తోడు నిందితుడు విలేకరి లక్ష్మణ్ పై కౌంటర్ కేసు వేసి లక్ష్మణ్ పై అక్రమ కేసులు పెట్టారని లక్ష్మణ్ పై దాడి పట్ల కడెం జర్నలిస్టులు అఖిలపక్ష పార్టీల నాయకులు ప్రజాసంఘాల నాయకులు నిర్మల్ మంచిర్యాల ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు లక్ష్మణ్ పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు లక్ష్మణ్ పై అక్రమ కేసులు ఎత్తివేయకపోతే జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని సిపిఐ ఎంఎల్ ప్రజాసంఘాల నాయకులు హెచ్చరించారు అనంతరం స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో జర్నలిస్టులు అఖిల పక్ష పార్టీల నాయకులు స్థానిక నాయకులు వినతిపత్రం చేశారు ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భరత్ చౌహన్ బిసిపి రాష్ట్ర నాయకులు వెంకన్న బిజెపి కాంగ్రెస్ పార్టీ ప్రజా సంఘాల నాయకులు సతీష్ రెడ్డి కిష్టయ్య ఉపాలి రాజేష్ సతీష్ మండల జర్నలిస్టులు స్థానిక నాయకులు పాల్గొన్నారు.