మంత్రి పువ్వాడ అజయ్ ని కలిసిన సర్పంచ్ సురేందర్ నాయక్
టేకులపల్లి ,సెప్టెంబర్ 23( జనం సాక్షి ): రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను ఖమ్మం లోని వారి స్వగృహంలో టేకులపల్లి మండల పరిధిలోని ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు గ్రామపంచాయతీ సర్పంచ్ మాలోత్ సురేంద్రనాయక్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఇల్లందు కొత్తగూడెం ప్రధాన రహదారి మండల పరిధిలో గుంతల మయంగా మారి రోడ్ అంతా అద్వానంగా తయారైందని ప్రమాదాలు నెలకొని ఉన్నాయని మరమ్మత్తులు చేపట్టాలని మంత్రికి వివరించారు. మంత్రిని కలిసిన వారిలో వార్డ్ సభ్యులు అజ్మీర రామ్ కిషోర్ నాయక్ ఉన్నారు.