మగ్గంపై మరణ మృదంగం

సిరులుండే సిరిసిల్లాలో పచ్చని పంట పొలాలు వడ్లు ధాన్యపు రాసులు ,ప్రక్కనే మానేరు వాగు గలగలమంటు పరవళ్లు తొక్కుతుంది.సిరిసిల్లా పట్టణంలో చేనేత కార్మికులు మగ్గంపై ఆధారపడి జీవిస్తున్నారు.తరతరాలుగా చేనేత వృత్తి జీవనొ పాధి ఇస్తుంది. అగ్గిపెట్టెల్లో చీరఅల్లి చరిత్రను సృష్టించాడు.సిరిసిల్లా నేత కార్మికుడు.నేడు మగ్గం మరణ మగ్గంగా మారి ఆకలి చావు ఆత్మహత్యలతో దారిద్యాన్ని అనుభవిస్తున్నారు.రాజేశం నారాయణ కుటుంబాలు నేత రంగంపై ఆధారపడి బతుకుతు న్నారు.వీరు పుట్టినప్పటినుంచి చనిపోయేంతవరకు చేనేత రంగాన్న ప్రేమించారు.నమ్మారు.ఆ చేనేత నేడు కార్మికునికి కాకుండ పోయింది.దాజేశం ఉద యం లేచి కాలకృత్యాల అనంతరం పనిమీద పడే వాడు.పని తప్ప అతనికేమి జ్యాస ఉండేది కాదు. ఇంటి కుటుంబాన్ని అంతా బాగోగులన్నియూ రణ వ్వ చూసుకుంటుంది.రాజేశం పనిచేసి సంపాదించిన డబ్బును నెల నెలకు గాసానికి పిల్లల చదువుకు మంచి చెడులకు రెండు వేల రూపాయలు ఇచ్చేవాడు.రాజేశం మాత్రం క్షణం తీరిక లేకుండ మగ్గం నేస్తుండేవాడు.రణవ్వ పిల్లల బాగోగులు కుటుంబాన్ని చూసుకుంటూ బీడీలు తాలిచేది.రణవ్వకు నెలకు మూడు వందల రూపాయలు వస్తున్నవి.ఇద్దరి జీతంతో కుటుంబం గడవడం అరకొర ఇబ్బందిగానే జరుగుతుంది.ఇలా వీరి కుటుంబం కుటు ంబం వెళ్లదీస్తున్నారు.రణవ్వ రాజేశం క్షణ కాలం తీరిక లేకుండ పని చేసినా మళ్లీ నెల తిరిగే సరికి ఇంటిలో ఒక్కరూపాయి ఉండదు.కుండలో మెతుకుండదు.గాసం కూడ అయిపోతుంది. రోజు రోజుకు పిల్లలు పెరిగిపోతున్నారు.ఫీజులు పెరుగుతున్నాయి. కుటుంబ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి.భార్య భర్తలి ద్దరూ కలిసి నిత్యం పనిచేసినా నెల జీతం రెండువేలమూడొందలు దాటడం లేదు. పవర్‌లూంలు ఫ్యాషన్‌గా దుస్తులు రావడం మగ్గం పనులు అంతంత మాత్రంగానే జరుగుతుంది.ప్రభుత్వాలు చేనేత రంగాన్ని మరిచిపోతున్నాయి.ఇక రాజేశం ,నారాయణలకు కష్టాలు ఎదురవుతున్నాయి.రాజేశం నారాయణ ఇద్దరూ అన్నదమ్ములు .వీరి ముత్తాతల కాలంనుంచి మగ్గం నేసుకుంటూ కులవృత్తిపై ఆధారపడి బ్రతుకుతున్నారు.చేనేత వృత్తి అతి పురాతనమై నది.400వందల సంవత్సరాలనుంచి చేతిమగ్గంపై బట్టలు నేయ డం ఇతిహాసంగా ఉంది.రాజేశం నారాయణలు ఇద్దరూ అన్న దమ్ములు రేయింబగళ్లు వేళాపాలా లేకుండా మగ్గాలు నేస్తుం టారు.నిద్ర కునుకు తీరిక లేకుండా ఆకలితో అలమటిస్తూ పేగులు ఆర్చుకుంటు కడుపులు మాడుతూనే ఉన్నా చేనేత తన రెండు చేతులతో కష్టపడేవాడు.అయినా బ్రతుకు భారమై కుటంబం గడవక రణవ్వ రాజేశం ఇద్దరు పిల్లలు మంగమ్మ రాజయ్యలు చదువులో రాణిస్తున్నారు.అయినా మంగమ్మ రాజయ్యలను అతి కష్టం మీద పదవతరగతి వరకు చదివించారు.ఇక పై చదువులు చదివించడానికి ఆర్థిక స్తోమత లేదు. చేతిలో చిల్లిగవ్వలేదు. ఒకపూట తిండి తినడం గగనం రాజేశం రణవ్వలకు మాత్రం ఎలాగు ఎంత కష్టమైనా తన పిల్లలను చదివించాలనేది వారి తపన.తమ తల్లిదండ్రులు చదివించుతారో లేదో అని మంగమ్మ రాజయ్యలు బెంగపడుతున్నారు.ఇక రాజేశం రణవ్వలు ఆలో చనలో పడినారు.రాజేశం మగ్గం నేస్తునే దీనంగా ఆలోచిస్తు న్నాడు.రణవ్వ బీడీలు తూలుతూనే ఆలోచిస్తుంది.మనస్తు ఇక్కడున్న ఆలోచనలు ఎక్కడో ఉన్నాయి.ఏమి చేయాలి రోజుకి 18 గంటలు పనిచేసినా పూటపూటకు కడుపు మాడుడాకు ఎట్లాఅని మౌనంగా ఆలోచిస్తున్నాడు.మిట్ట మధ్యాహ్నం ఎండ బానుడి ప్రతాపం చూపుతుండు ఉక్కపోతలో రాజేశంకు చెమటలు కారిపోతు న్నాయి.అతని శరీరం పై ఉన్న బట్టలు చమటకుతడిసిపోయినది. రాజేశంకు కుటుంబం- బ్రతుకు-పిల్లల చదువులపై జ్యాస వుంది. కాని మరిదీనిమీదతేదు. కడుపు మాడబట్టిరెండు రోజులయింది. గంట గంటాకు చల్లనినీళ్లు కుండలో నుంచి ముంచుకుంటు తాగుతుండు బట్టలను మగ్గంపై నేస్తుండు. ఇంతలో తమ్ముడైన నారాయణ వచ్చి అన్నయ్య అన్నయ్య అని ఎంత పిలిచినప&్పటికి తిరిగి నారాయణ వైపు రాజేశం చూడటం లేదు. మళ్లీ పిలిచాడు. గట్టిగా నారాయణ చూడటం తేదు. నారాయణ వేళ్లి తన అన్న రాజేశం ను చూడగానే మగ్గంపై చనిపోయాడు. తన అ్నయ్యకు ఎమాయింది, మాట్లాడటం లేదు, అని ఇరుగుపోరుగు వారిని గట్టిగా కేకవేసి పిలిచాడు.అందరూ మగ్గలను నిలిపివేసి రాజేశం మృత దేహం వైపుకు వచ్చారు. ఎట్లా చనిపోయాడు. ఎమాయింది అని ఎవ్వారికి అర్ధం కావాట్లేదు. అందరూ రాజేశం చనిపోయిన, బతికి ఉన్నడాని బావిస్తూన్నారు.హూటాహూటిన స్థానిక అసుపత్రికి తరలించారు. ప్రయివేటూ అసుపత్రి వారు డబ్బులు ముందుగా అడ్వాన్స్‌గా పదివేలా రూపాయాలు చేల్లిస్తేనే వైధ్యం చేస్తామని లేదంటే లేదని మేండికేసారు. రాజేశం తమ్ముడు దగ్గర కూడా చిల్లిగవ్వ లేదు. ఫీజు కట్టలేక ప్రభుత్వ అసుపత్రికి తరలించారు. అకలి చావుతో చనిపోయాడాని వైద్యులు తెలిపారు. మూడు రోజల నుంచి తిండి లేక చనిపోయాడాని వైధ్యులు చెప్పారు. ఇది తెలుసుకున్న అకలిచావుపై ప్రజా సంఘలా వారు. రాజాకీయ పార్టీల వారు ప్రభుత్వ తీరును ఎండగాడుతున్నారు. శవంపై శపథం చేస్తున్నారు. రాజకీయ నేతలు అకలాచావుతో చనిపోవడం ప్రభుత్వం అవలంబిస్తున్న విధానమేనని ప్రతిపక్ష పార్టీ, అధికార పార్టీపై దుమ్మెత్తిపోస్తుంది. మరో పార్టీయినా రాజీనామ చేయాలని అసపమార్థ ప్రభుత్వం అని అంటుండూ. అధికార పార్టీ ఎమ్మెల్యే మాత్రం ఆకలి చావు కాదని, ప్రమాదవశాత్తు చనిపోయాడంటూ తప్పుడుగా డాధిస్తున్నారు. సిరిసిల్ల ప్రభుత్వం అసుపత్రి వైధ్యుడు శ్రీధర్‌ అకలిచావని ఎందుకు చెప్పాడంటూ, అధికార పార్టీ ఎమ్మెల్యే వైద్యుడు శ్రీధర్‌ను కస్సుబుస్సుమంటూన్నారు. రాజేశం భార్య రేణవ్వ, బిడ్డకోడుకు మంగమ్మ, రాజయ్య మాత్రం మా ఇంట్లో వండడానికి గించకూడా లేదని పదిహేనురోజుల నుంచి ఒక్కపూట తిని కడుపూలు మాడ్చుకుంటున్నామని మా ఉసూరు అధికార పార్టీ నేతలకు తగిలి వాళ్లు నాశనం గాను అంటూ శాపనార్థాలు పెడుతున్నారు. రాజేశం మృతదేహన్ని పరామర్షించడానికి వచ్చిన అధికార పార్టీ ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్‌ ఆర్‌డిఓ, స్థానిక ఎమ్మార్వో వచ్చి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందిస్తామని ఓదార్చి హామినిచ్చారు. ఎమ్మార్వో మాత్రం దహాన సంస్కరాణలకు 1500 రూపాయాలు నారాయణకు అందించి పత్తా లేకుండా పారిపోయాడు. మానవత్వం ఉన్న వాళ్లు సానుభూతితో రాజేశం అంతిమ అంతక్రియాలకు తల పదిరూపాయాలు, యాబై రూపాయాలు, వంద రూపాయాలు వేసుకోని అన్ని ్లఇపి ఎనిమిది వేల రూపాయా లుజామానైవి, అటో,ఇటో, రాజేశం అంతక్రియాలు పూర్తనైవి. అటు,ఇటు అనేసరికి నల రోజులు అయి నవి. అటు అధికారల నుండి గాని, ఇటు ప్రభుత్వం నుంచి గాని ఉలుకు లేదు, పలుకు లేదు.. ప్రభుత్వం నుంచి ఎదైన సహాయం వస్తోందని రేణవ్వ, మంగమ్మ, రాజయ్య అశతో ఎదురు చుస్తున్నారు. ఎమి చేయాలో వీరికి అంతుపట్టడం లేదు. అయినా స్థానిక ఎమ్మెల్యేను కలవడానికి వెళ్లారు.ఉదయం లేవాగానే మంచినీళ్లు కూడా ముట్లకుండా పోయారు. ఎమ్మెల్యే ఇంటివద్ద నిలుచుండి, నిలుచుండి 12 గంటలవుతుంది. ఎవ్వరేవ్వరో వస్తున్నారు, వెళ్లిపోతున్నారు. వీరికి ఓపికనశించింది.సమయం 12-40 నిమిషాలు అవుతుంది. ఎమ్మెల్యే పి.ఎ పిలిచిండు. సార్‌ రమ్మంటుండు అని వందనం చేసి బోరునా ఎడ్చారు. ఎమ్మెల్యే నేను ఎమి చేయిలని అడిగాడు. అర్థిక సహాయం అందిస్తామని, రాజేశం మృత దేహం పై ప్రమాణం చేస్తివి గాదా, అడిగారు. నేను అలా అనలేదు. ప్రమాదవాసత్తుగా చనిపోయిన వారికి సహాయం చేయడం నా వల్ల కాదని చెప్పడంతో రేణవ్వ, మంగమ్మ, రాజ య్యలు బిక్కు బిక్కు మంటూ ఎడ్చుకుంటూ ఇంటి దారి పట్టారు. అప్పటికి కడుపులో మెతుకు లేక మడుతుంది, నడవస్తాలేదు. సృహా తప్పుకుంటూ, కింద పడిపోతూ రేణవ్వ లేస్తూంది.ఇదేమి కష్టాంరా దేవుడా? అంటూ కండ్లలో కన్నీళ్లు తిరుగుతున్నాయి. ఎడ్చి, ఎడ్చి అప్పటికి కళ్లు ఎర్రబడినవి. ఇంట్లో గించలేదు. ఎమి చెయాలో తోచడం లేదు. అర్థికసక్ష్మీఆయం కోసం సంవత్సరం పోడవునా తిరిగినా అధికారులలో ఇంతకూడా చలనం లేదు. రేణవ్వ, మంగమ్మ, రాజయ్యలు సిరిసిల్ల విడిచిపెట్టి పనులు వెతుకుంటూ పట్నం వలసెెల్లిపోయినారు. పట్నంలో పనులు దోరకకూండా పస్తులుండి పిల్లల చదువులు అగిపోయినాయి. పట్నం వలస వచ్చిన రెండు నెలల కాలంలో రేణవ్వ, మంగమ్మ, రాజయ్యలు పురుగుల మందుతాగి అత్మహత్యకు పాల్పడినారు. రాజేశం తమ్ముడు నారాయణకు పెళ్లి కాలేదు. ఈ మగ్గంపై అధారపడి పెళ్లి చేసుకుంటే ఎమిటి నా భవితని అలాగే ఉండిపోయాడు. రాజేశం చనిపోయిన సంవత్సరానికి అకలిచావుతో చనిపోయాడు. ప్రభుత్వం మాత్రం వ్యక్తిగత చవులని తప్పుగా వాధిస్తుంది. ఇలా, ఇలా, సిరిసిల్లా చేనేత రంగంపై ఆధారపడి కుటుంబం గడవక పిల్లలను చదివించలేక ఆకలి చావులు అత్మహత్యలతో మగ్గం, మరణ మగ్గంగా మారింది. పాలకులు మాత్రం తిన్నదారగాని, చావులాని అపవాధిస్తున్నారు. ప్రభుత్వాలు పాలకులు మారినా చేనేత కార్మికుల ఆకలి చావులు, అత్మహత్యలు సిరులున్న సిరిసిల్ల నేడు చావుల సిరిసిల్లగా మారింది. పాలకులు చేనేత రంగాన్ని నిర్లక్ష్యం చేయడం వల్లనే మగ్గలపై మరణ మగ్గాలుగా మారినది. అత్మహత్యలు ఆకలిచావులతో చనిపోయినా కుంటుంబాలు పుట్లకోకారు. చెట్టుకో కారు ఎకాకిలా దుర్బరమయినా జీవితాలను బిక్కు బిక్కు మంటూ అనుభవిస్తున్నారు.
– దామరపల్లి నర్సింహరెడ్డి
(సిరిసిల్లా చేనేత కార్మికుల వాస్తవా పరిస్థితి లోంచి…)