మతం నుంచి ఉగ్రవాదాన్ని వేరు చేయాలి

3
– ప్రపంచంలో ఏ దేశం ఆశ్రయం ఇవ్వొద్దు

– ఆసియా శిఖరాగ్ర సభలో మోదీ

కౌలాలంపూర్‌: మతం నుంచి ఉగ్రవాదాన్ని వేరు చేయాలని ఉగ్రవాదం ఇంక ఎంతమాత్రం ఆసియాకు సంబంధించిన సమస్య మాత్రమే కాదని, దాని విషనీడ ఇప్పుడు  ప్రపంచమంతా పరుచుకొని ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో జరుగుతున్న 10వ తూర్పు ఆసియా సదస్సులో ఆయన ప్రసంగించారు. ‘ఈ ఫోరంలో మనం చాలాసార్లు అనుకున్నాం.. మన ప్రాంతానికి ఉగ్రవాద సమస్య ఉందని. కానీ, పారిస్‌, అంకారా, బీరుట్‌, మాలి, రష్యా విమానంపై ఇటీవల జరిగిన అనాగరిక ఉగ్రవాద దాడులు. ప్రపంచంలో ఏ దేశం ఆశ్రయం ఇవ్వొద్దన్నారు.  ప్రపంచమంతా ఉగ్రవాద నీడ పరుచుకుందనే విషయాన్ని గుర్తు చేస్తున్నాయి.

ఉగ్రవాద నియామకాలు, దాడుల లక్ష్యాలకు మన సమాజాలన్నీ బాధితులేనని చాటుతున్నాయి’ అని మోదీ పేర్కొన్నారు. ‘ఉగ్రవాదం అణచివేసేందుకు మనం అంతర్జాతీయ సంకల్పాన్ని తీసుకొని సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్లాల్సిన అవసరముంది. రాజకీయాలు తావులేకుండా ఈ విషయంలో వ్యవహరించాలి’ అని మోదీ ఆసియా దేశాలకు సూచించారు.