మన గుట్టకు మెట్రోరైలు

3

– 5 దశల్లో పూర్తి చేస్తాం

– సభలో మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌,మార్చి12(జనంసాక్షి):తెలంగాణా రాష్ట్ర రాజధానిలో అత్యంతప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న మెట్రోరైల్‌ను ఐదు దశల్లో పూర్తి చేయనున్నామని రాష్ట్ర పంచాయితీరాజ్‌, పురపాలన, ఐటి శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు వెల్లడించారు. ఆయన శనివారం శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాదానమిస్తూ రెండో దశను చేపట్టేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతోనే ఉందన్నారు. ఐదు మార్గాల్లో మెట్రో రైల్‌ను పొడిగించనున్నామన్నారు. మియాపూర్‌-పటాన్‌చెరు, ఎల్బీ నగర్‌-హయత్‌నగర్‌, నాగోలు- ఎల్బీనగర్‌, తార్నాక-ఈసీఐఎల్‌, రాయదుర్గం-శంషాబాద్‌ మార్గాల్లో 83 కిలోవిూటర్ల మేర మెట్రో రైల్‌ను విస్తరిస్తామన్నారు.  ఎంఎంటీఎస్‌ రెండో దశను ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి వరకు పొడిగిస్తామని మంత్రి హామి ఇచ్చారు. అలాగే వర్షాలకాలంలోగా నాలాలు, డ్రైనేజీల వ్యవస్థను మెరుగు పరుస్తామని  మరోప్రశ్నకు సమాధానంగా చెప్పారు. పాత డంపింగ్‌ బిన్‌ ల స్థానంలో కొత్తవాటిని ఏర్పాటు చేస్తామని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.