మమతల మహాకావ్యం ‘ఇల్లు’
ఆధునిక కవిత్వంలో కవిత్వం కాని వస్తువంటూ లేదు.అన్నీ కవితా వస్తువులే.బాల్యం,మవ్వనం,ప్రేమా,దు:ఖం,ముసలితనం ఉ ద్వేగాలు ఉద్యమాలు,అన్నీ కవితా వస్తువులే.మనిషికి అనుకున్న కోరిక నెరవేరకపోతే అశాంతి,అనుకున్న లక్ష్యాన్ని సాధించకపోతే క్షోభ.ఆదర్శంలో విఫలమైతే మనస్సులో పెను తుఫాను.విశ్వాసం ప టాపంచలైతే ఆకాశమే విరిగిపడినంత బాధ.ఆశ నిరాశల మధ్య మనిషి జీవితం ఓ సంక్షోభం.సంక్లిష్టం.ఇవన్నీ ఆధునిక కవికి కవితా వస్తువులే.అవే కాదు ఒక జడ పదార్థాన్ని తీసుకుని తడి పదార్థం చేస్తున్నారు ఆధునిక కవులు.సెంటిమెంట్ లేకపోలే మనిషే కాదు. అలాంటి జడపదార్థామే ఇల్లు.ఇల్లే ఓ సెంటిమెంటు.తాము పుట్టి పెరిగిన వూరుతోనే కాదు.తాము గడిపిన ఇంటితో కూడా బలీయ మైన అనుబంధం ఉంటుంది.ఒక భావోద్వేగ సంబంధం ఉంటుం ది.ఇంటిని అమ్ముతున్నప్పుడు ఆ ఇంటిని కూలగొడుతున్నప్పుడు మనిషి ఫీలింగ్ చెప్పలనివి కాదు.నేను బతికినంత కాలం ఇంటిని ఇమ్మకురా అనే తల్లిదండ్రులు ఎందరో.తాను బతికినంత కాలం తన ఇల్లు బతకాలనుకునే వాళ్లు మరెందరో.ఇదొక మానవీయ అ నుబంధం. తన కళ్ల ముందే ఇల్లు కూలగొడుతుంటే కవి విల విలలాడుతాడు.ఇంటికోసం దేనినైనా త్యాగం చేయాలంటాడు కవి.ఇంటిని కూల్చమంటే ఇంట్లోంచి వీచే పరిమళాలన్నింటినీ కూ ల్చడమేనంటాడు.’భగ్వాన్’ ‘నా చిన్నప్పటి పాత ఇల్లు ‘కవితలో ఒక మానవీయ దృష్టి చెమ్మగిల్లితే తప్ప ఇలాంటి కవిత పుట్టదు.
‘ఒక గునపం పోటుతో ఆ గడపను తొలగిస్తుంటే
ఆకాశంలోంచి నాయినమ్మ విలపిస్తున్నట్టుగా ఉంది
నన్నల్లుకున్న నా పూర్వికులు బాహువులన్నీ
ముక్కలుముక్కలవుతున్నట్టుగా ఉంది’
ఇంటిలో పెరిగిన వాళ్లకే ఆ ఇంటితో ఇంత అనుబంధం ఉంటే ఆ ఇంటిని కట్టిన వాళ్లకి ఎలా ఉంటంది.?అదీ ఊహించుకున్న కవికి వాళ్ల నాయినమ్మ విలపిస్తున్నట్లుగా అన్పించడం సహజం.ఆ ఇల్లు ధ్వంసం అవుతున్న క్రమంలో కవికి ఒక్కొక్క అవయవమూ తెగిపడుతున్నట్టుగా అన్పించడం కూడా సహజాతి సహజమే. భగ్వాన్ ఇంకా ఇలా చెబుతున్నాడు.
నాలోంచి నన్ను తవ్వేస్తున్నట్టుగా ఉంది
అక్క పెళ్లి ఆ ఇంట్లోనే జరిగింది
రేపు అక్కనెలా ఓదార్చాలో అర్థం కావడంలేదు
నాయినమ్మ గారిల్లేది అని అడిగే పిల్లలకు
రేపు ఏమని జవాబు చెప్పాలో తెలియడం లేదు
తాతాయ్య చనిపోతూ చనిపోతూ
ఇంటిని గురించి కలవరించాడు
ఇవాళ్ల తాతాయ్య హత్య చేయబడ్డాడు
గుండె గదుల్లాంటి ఇంటి గదులు కూడా
ఇవాళ్ల నా గుండె కాళీ అయ్యింది.
ఇల్లుని తవ్వుతుంటే తనని తవ్వుకున్నట్టుగా ఉందని కవి ఫీలవుతున్నాడు.ఇంటిని కూల్చడం ద్వారా తాతయ్యని హత్య చేసినట్టుగా గుండె గదుల లాంటివే ఇంటి గదులు అంటాడు. భగ్వాన్ ఇల్లు కూల్చడం వల్ల తన గుండె ఖాళీ అయ్యిందని కవిత ముగించి మన మనసుల్ని ఖాళీ చేస్తాడు.మంచి ఆర్థ్రత ఉన్న కవి భగ్వాన్ .ఇది కూలగొట్టిన ఇంటిని గురించి .ఇంటికి కూడా వార్థ క్యం వస్తుంది.తన తల్లికి వచ్చినట్టుగా.ఆ ఇంటితో ఉన్న అనుబం ధం మమకారాన్ని ఆ ఇల్లు జహజంగా నేలకూలే వరకు ఆ ఇంటిని బ్రతికించాలంటాడు మరో కవి (జింబో)
‘ఇక్కడ గచ్చుమీద టినాక్సైడ్ ప్రతిబింబాలు కన్పించవు
కానీ ఎన్ని సుందర బింబాలో
ఇక్కడ గోడలకి లప్పం ఫినిషింగ్ లేదు
కానీ ఎన్ని లాలనలో
ఇక్కడ అటాచ్‌డ్ బాత్రూంమ్స్‌లేవు
కానీ ఎన్ని అటాచ్‌మెంట్సో
నే పుట్టక ముందు పుట్టిన ఇల్లు
అది బతికినంతకాలం బతకాలనే..!
కనీసం
నే బతికినంత కాలం బతకాలనే.!!
ఆ ఇంటి గచ్చుకి టినాక్సైడ్ ట్రీట్‌మేంట్ లేదు.మన ప్రతి బింబాలు ఆ గచ్చులో కన్పించవు. కానీ ఎన్ని సుందర బింబాలో.ఆ ఇంటికి ఇప్పుడున్న ఇంటికి మల్లే లప్పం ఫినిషింగ్ లేదు.కానీ ఎన్ని లాలనలో ,అలాచ్‌డ్ బాత్రుంస్ లేవు.కానీ ఎన్ని అటాచ్‌మెంట్సో.అందుకని ఆ ఇల్లు బతకాలని కోరుకుంటాడు కవి.కనీసం తాను బతికినంత కాలం బతకాలని .ఇది ఇలా ఉంటే తనను ఆదరించి అక్కున చేర్చుకున్న పాత ఇంటిని అమ్ముతున్నప్పుడు ఆ కవి బెంగటిల్లుతాడు.ఎన్.గోపీ అలాగే బెంగటిల్లాడు.ఆ ఇంటిమీద ఆయన మమకారం చూద్దాం.
‘ఆ వీధులు నాకెంత పరిచయమో
నా కళ్లకు గంతలు కట్టండి
ఆ ఇంటి ముందు నా కళ్లాగుతాయి
ఏమీ లేనప్పుడూ
నేనేమి కానపుడూ
బాహువులు సాచి
అక్కున చేర్చుకున్న ఇల్లది
అనాథ భావానికి
అభయ హస్తాన్నిచ్చి
గాజుపెంకును గళాభరణంగా ధరించిన ఇల్లది..
రక్ల సంబంధాలు మానవ సంబంధాలు మాత్రమే కాదు.భౌతిక పదార్థం మీద కూడ కవులకి విపరీతమైన సెంటిమెంటు .అలాంటి ఇంటికి ప్రతీ కవి ఒక ఎమోషనల్ వాససుడే.ఇవి ఇల్లునూ కూలగొడుతున్నప్పుడు ఇంటికి వార్థక్యం వచ్చినప్పుడు ఇంటిని అమ్మినప్పుడు కవుల అనుభవాలు అనుభూతులు సెంటిమెంట్లు .ఇక’సెలవురోజు’ఇల్లు ఎలా ఉంటుందో చూద్దాం. మీకినీడు సూర్యభాస్కర్ ఓ అందమైన ఫీలింగ్‌ని తన కవితగా చెక్కాడు.
మౌన క్షణాల మధ్య బందీలమై
సొంత యింట్లో శరణార్థులం
ఎక్కన్నుంచో వచ్చి ఒకే సెల్‌లో చేరిన ఖైదీలా!
భార్య భర్తల మధ్య మౌనం ఏర్పడినప్పుడు ఇల్లు ఎలా ఉంటుంది? సొంత ఇంట్లోనే శరణార్థులాగే ఉంటుంది.ఇక్కడితో ఆ ఏడు ఇలా కొనసాగిస్తాడు సూర్యభాస్కర్ ..
ఇంతలో….
ఒక శభ్ధ కెరటం సుడిగాలిలా
పరిగెత్తుకు లోనికి దూసుకొస్తుంది
ఆయాసంతో రొప్పుతూనో
అలసి సొలసి అలమటిస్తూనో
ఆటకెళ్లిన అమ్మాయి..!
మౌనం భగ్నం,వ్రతం చెడుతుంది
ఫలితం ఒక్కోసారిదక్కుతుంది
ఒక్కోసారి….
ఆటకెళ్లిన అమ్మాయి రాకతో మౌనం భగ్నమవుతుంది.ఒక సున్నితమైన సన్నివేశం.ఇల్లు ఒక అపురూప కావ్యం.మమతల ,మమకారాల మహాకావ్యం.అలాంటిఇల్లు బతికినంత కాలం బతకాలనే .వాళ్ల స్వాధీనంలో బతకాలి.ఇంటికీ,ఇంటి గురించి రాసిన కవులకి మమతల మహా నమస్కారం.