మయన్మార్‌ అధ్యక్షుడిగా సూకీ డ్రైవర్‌

2

– ప్రతిపాదనకు నిర్ణయించిన ఆంగ్‌సాన్‌

న్యూఢిల్లీ,మార్చి10(జనంసాక్షి): మయన్మార్‌లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం కోసం పోరాడి ఎన్నికల్లో విజయం సాధించిన ఆంగ్‌ సాన్‌ సూకీ నాయకత్వంలోని నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమొక్రసీ (ఎన్‌ఎల్‌డీ) పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. మయన్మార్‌ అధ్యక్ష పదవిలో సూకీ కారు డ్రైవర్‌, ఆమె కుటుంబానికి సన్నిహితుడు అయిన హెచ్‌ టిన్‌ క్యా (69) ను ప్రతిపాదించాలని నిశ్చయించింది. ప్రస్తుతం ఈయన సూకీ ఆధ్వర్యంలోని ఒక చారిటబుల్‌ సంస్థ కార్యకలాపాలను చూసుకుంటున్నారు. విదేశీయుడిని పెలళ్‌ఇ చేసుకున్న కారణంగా రాజ్యాంగం ప్రకారం సూకీ అధ్యక్షపదవికి దూరమ్యారు. సూకీ పార్టీ ఎన్నికల్లో గెలిచినప్పటికీ తాను అధ్యక్ష పదవిని చేపట్టకుండా టిన్‌ క్యాను అధ్యక్షుడిని చేయాలనుకోవడం వెనుక ఒక ముఖ్య కారణం ఉంది. మయన్మార్‌ రాజ్యాంగం ప్రకారం ఈ దేశ అధ్యక్ష పదవిలో ఉన్నవారికి విదేశాల్లో బంధువులుండరాదు. సూకీ భర్త మైకేల్‌ అరిస్‌ బ్రిటిష్‌ పౌరుడు కాగా, వీరి సంతానం అలెగ్జాండర్‌, కిమ్‌ కూడా బ్రిటిష్‌ పౌరసత్వాన్ని కలిగి ఉన్నారు. దీంతో సూకీ మయన్మార్‌ అధ్యక్ష పదవిని చేపట్టడానికి అవకాశం లేకుండా పోయింది. చివరికి పార్టీ ఎంపీలకు కూడా చెప్పకుండా అధ్యక్ష ఎన్నికలకు హెచ్‌ టిన్‌ క్యాతో నామినేషన్‌ వేయించినట్లు తెలిసింది.

మయన్మార్‌ అధ్యక్షుడిగా నేషనల్‌ లీగ్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ పార్టీ(ఎన్‌ఎల్‌డీ) వ్యవస్థాపకురాలు ఆంగ్‌సాన్‌ సూకీ మాజీ డ్రైవరు, అత్యంత సన్నిహితుడైన యు తిన్‌ క్యావ్‌తో అధ్యక్ష పదవికి నామినేషన్‌ వేయించినట్లు ఎన్‌ఎల్‌డీ పార్టీకి చెందిన దిగువ సభ ఎంపీ ఖిన్‌ శాన్‌ లేంగ్‌ వెల్లడించారు. ఎగువ సభకు మరో అభ్యర్థితో నామినేషన్‌ వేయించామని పేర్కొన్నారు. తిన్‌ క్వావ్‌ సూకీ నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థలో సహాయం చేస్తుంటాడు. దాదాపు 15ఏళ్ల అనంతరం మయన్మార్‌ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఏళ్ల తరబడి వస్తున్న సైనిక పాలనకు తెరదించి నూతన ప్రణాళికలతో ఎన్‌ఎల్‌డీ పార్టీ ముందుకు సాగుతోంది.  ప్రస్తుతం అధ్యక్షుడిగా ఎంపికైన క్యావ్‌ ఆమె 2010లో గృహనిర్బంధం నుంచి విడుదలైనప్పటి నుంచి ఆమె వెంటే ఉన్నారు.