మరో దళిత యువకుడి దారుణ హత్య

2

– అగ్రవర్ణాల దురహంకారం

చెన్నై,మార్చి14(జనంసాక్షి): తమిళనాట మరో ఘాతుకం చోటుచేసుకుంది. అగ్రకులానికి చెందిన ఓ యువతిని వివాహం చేసుకున్నందుకు ఓ దళిత యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అత్యంత రద్దీగా ఉండే  నడిరోడ్డుపై వ్యక్తిని అత్యంత కిరాతకంగా హత్య చేసి.. అనంతరం అతడి భార్యపైనా దాడికి పాల్పడ్డ కిరాతక ఘటన తమిళనాడులోని తిరుపూర్‌లో జరిగింది. ఆదివారం జరిగిన ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఇంజనీరింగ్‌ చదువుతున్న శంకర్‌ అనే యువకుడు పెద్దలను ఎదిరించి ఎనిమిది నెలల కిందట కౌసల్య అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆదివారం మధ్యాహ్నం శంకర్‌, కౌసల్య రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. బైక్‌లపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు వారిని అడ్డుకున్నారు. రోడ్డుపై అందరూ చూస్తుండగానే.. ఆ ఆగంతుకులు పదునైన ఆయుధాలతో శంకర్‌పై దాడి చేసి హత్య చేశారు. అనంతరం కౌసల్యపై దాడిచేసి తీవ్రంగా కొట్టి అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటన అంతా అక్కడి సీసీటీవీ కెమేరాల్లో రికార్డైరది. ఈ ఘటనలో శంకర్‌ అక్కడికక్కడే మృతి చెందగా.. కౌసల్య తలకు బలమైన గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. సమాచారం అదుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సీసీటీవీ ఫుటేజి ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామని పోలీసులు తెలిపారు. యువతి తరఫు బంధువులే తమ కుమారుడిని చంపారని శంకర్‌ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆ యువకుడు ఓ దళితుడిని నరికి చంపి.. అతడి భార్యపై ముగ్గురు వ్యక్తులు విచక్షనా రహితంగా దాడి చేశారు. తిరుపూర్‌లో రద్దీగా ఉండే మార్కెట్లో పట్టపగలే  జరిగిన ఈ ఘోరం మొత్తం సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. ఈ దారుణం జరుగుతున్నప్పుడు అందరూ చూస్తూనే ఉన్నా.. ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. రద్దీగా ఉన్న రోడ్డులో ఫుట్‌పాత్‌ విూదకు ఓ వ్యక్తిని లాగిన దుండగులు, అతడిని కొడుతూ, ఆయుధాలతో దాడి చేయడం కనిపించింది. అతడి కదలికలు ఆగిపోయిన తర్వాత.. అతడి భార్యవిూద వాళ్ల ప్రతాపం మొదలైంది. ఆమెను కింద పడేసి కొట్టడం మొదలుపెట్టారు. ఆ తర్వాత ఆ నిందితులు ముగ్గురూ మోటారు సైకిల్‌ విూద పారిపోయారు. ఇంజనీరింగ్‌ మూడో తరగతి చదువుతున్న వి.శంకర్‌ (23), ఎనిమిది నెలల క్రితం కౌసల్య (19) అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. కౌసల్య అగ్రకులానికి చెందిన కుటుంబం నుంచి రావడంతో.. ఆమె తల్లిదండ్రులకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెబుతున్నారు. పెళ్లయిన తర్వాత వాళ్లు ఒప్పుకొంటారని తాము అనుకున్నామని, కానీ చివరకు తమ కొడుకును కోల్పోవాల్సి వచ్చిందని శంకర్‌ తండ్రి వేలుసామి ఆవేదన వ్యక్తం చేశారు.