మల్కాపూర్ పాఠశాలలో ఘనంగా వజ్రోత్సవ వేడుకలు
తాండూరు రూరల్ ఆగస్టు (జనం సాక్షి): తాండూరు మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో మల్కాపూర్ గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి పండరి ఆధ్వర్యంలో ఘనంగా 75 స్వాతంత్ర దినోత్సవ వజ్రోత్సవ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ఆవరణలో విద్యార్థులు 75 స్వాతంత్ర దినోత్సవం వేడుకలలో భాగంగా 75 అంకె ఆకారంలో కూర్చొని దేశభక్తిని చాటారు. చూపరులకు విద్యార్థుల ఆసక్తి, ఓపిక ఎంతగానో ఆకట్టుకుంది. అదే విధంగా పాఠశాల ఆవరణలో 75 ఆకారంలో సర్పంచ్ విజయలక్ష్మి పండరి, ఉప సర్పంచ్ అబ్దుల్ మజీద్, మరియు ఉపాధ్యాయులు కలిసి మొక్కలను నాటి నీరు పోశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ విజయలక్ష్మి పండరి మాట్లాడుతూ…. ప్రతి ఒక్కరూ వారి ఇండ్లపైన జాతీయ జెండాలను ఎగురవేయాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారని ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను ఎగురవేసి వాటిని సంరక్షించుకోవాలని పేర్కొన్నారు. వజ్రోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థులు పాల్గొని వజ్రోత్సవ వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. పాఠశాలలో నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిదని గుర్తు చేశారు.