మల్టీ పర్పస్ విధానం రద్దు చేయాలి, వేతనాలు పెంచాలి

12న కలెక్టరేట్ ఎదుట ధర్నా
— కె.బ్రహ్మచారి జిల్లా ప్రధాన కార్యదర్శి
గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ యూనియన్

టేకులపల్లి, సెప్టెంబర్ 9( జనం సాక్షి): గ్రామ పంచాయతీల్లో మల్టీ పర్పస్ విదానాన్ని రద్దు చేయాలని, గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచాలని గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ & వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కొలగాని బ్రహ్మచారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం సంఘం కార్యాలయంలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 12న గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నామని పంచాయతీ కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని డిమాండ్ చేశారు. మల్టీ పర్పస్ విధానం కోసం తెచ్చిన జీవో నెంబర్ 51రద్దు చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 60 ప్రకారం కేటగిరీల వారీగా వేతనాలు ఇవ్వాలని ఆయనడిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్& వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు మాలోత్ సతీష్ కుమార్,మండల అధ్యక్షులు మూడు బిచ్చు, సీఐటీయూ నాయకులు కడుదుల వీరన్న,ఈసం నరసింహారావు,నూకల రమేష్, చీమల మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.