మళ్లీ పెట్రోమంట

1

న్యూఢిల్లీ,మార్చి16(జనంసాక్షి):వాహనదారులకు భారీ షాక్‌.  ఇప్పటికీ పెరిగిన ధరలతో సతమతం అవుతున్న ప్రజలకు ఇప్పుడు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరింతగా పెరిగాయి. లీటరు పెట్రోల్‌ ధర ఏకంగా రూ.3.07, డీజిల్‌ రూ.1.90 పెరిగింది. కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ఈ మేరకు నిర్ణయించాయి. పెంచిన ధరలు  గురువారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి.కొత్త ధరల ప్రకారం నాలుగు ప్రధాన నగరాల్లో లీటర్‌ పెట్రోల్‌ ఢిల్లీలో రూ.59.68, కోల్‌కతాలో రూ.63.76, ముంబయి రూ.65.79, చెన్నైలో

రూ.59.13 పైసలకు పెరగనుంది. చివరిగా చమురు ధరలు ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీ పార్లమెంట్‌ లో బడ్జెట్‌ ప్రవేవపెట్టిన ఫిబ్రవరి 29న పెట్రోల్‌ ధర తగ్గగా, డీజిల్‌ ధర పెరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే పెరిగిన నిత్యావసర ధరలతో ప్రజలు సతమతమవుతున్న నేపథ్యంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెంచడం అన్యాయమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పేర్కొంది. వెంటనే కేంద్ర ప్రభుత్వం ధరల పెంపు నిర్ణయాన్నివెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేసింది. అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గుతున్న ధరలు పెంచడం దారుణమని… ధరల పెంపును వైఎస్సార్‌ సీపీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపింది. లీటరు పెట్రోల్‌ ధర ఏకంగా రూ.3.07, డీజిల్‌ రూ.1.90 పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వ రంగ చమురు సంస్థలు గురువారం నిర్ణయించాయి. పెంచిన ధరలు గురువారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్న విషయం తెలిసిందే.