మళ్లీ వివాదాస్పదమైన రాందేవ్‌ బాబా ఉత్పత్తులు

1

ఉత్తరప్రదేశ్‌,ఏప్రిల్‌ 3(జనంసాక్షి): రామ్‌దేవ్‌ బాబా ఉత్పత్తులపై మరో వివాదం చోటుచేసుకుంది. ఉత్తర ప్రదేశ్‌ ప్రభుత్వం.. రామ్‌దేవ్‌ బాబా నూడుల్స్‌ ను నిషేధించింది. నూడిల్స్‌ లో మూడింతల యాష్‌ ఉన్నట్టు నిర్ధారణ కావడంతో అఖిలేష్‌ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. రామ్‌దేవ్‌ బాబా ఉత్పత్తులపై వరుసగా వస్తున్న ఆరోపణల నేపథ్యంలో.. వాటన్నింటినీ నిషేధించాలంటూ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. సాధారణంగా ఏ ఉత్పత్తినైనా తొలుత ల్యాబ్‌లలో పరీక్షించాకే మార్కెట్‌లోకి విడుదల చేస్తారు. అయితే రామ్‌దేవ్‌ బాబా ఉత్పత్తుల విషయంలో ఎలాంటి పరీక్షలు జరపలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే.. కుట్రపూరితంగానే ఇలాంటి వాదనలను వెలుగులోకి తెస్తున్నారని బాబా వర్గీయులు కొట్టి పారేస్తున్నారు. తమ ఉత్పత్తులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగానే తయారు చేస్తున్నామని వెల్లడించారు.