మసూద్‌పై నిషేధం విధించండి
– చైనాతో సుష్మా చర్చలు
మాస్కో,ఏప్రిల్ 18(జనంసాక్షి): జైషే చీఫ్ మసూద్‌పై నిషేధం విధించాలన్న అంశాన్ని ఐక్యరాజ్యసమితిలో చైనా అడ్డుకున్న విషయంపై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఆ దేశంతో అధికారికంగా చర్చించింది. పఠాన్‌కోట్ వైమానిక కేంద్రంపై దాడి జరిగిన ఘటనలో మసూద్ కీలక పాత్ర పోషించినట్లు భారత్ ఆరోపిస్తోంది. భారత్, రష్యా, చైనా దేశాల మధ్య మాస్కోలో జరుగుతున్న చర్చల సమయంలో ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. చైనా విదేశాంగ మంత్రి వాంగ్ వైతో సుష్మా ఈ అంశాన్ని చర్చించారు. రహస్య వీటో ద్వారా భారత్ అభ్యర్థనను చైనా అడ్డుకున్న విషయం తెలిసిందే.