మహాత్మ జ్యోతీరావు ఫూలేకు సీఎం కేసీఆర్‌ ఘన నివాళి

5

హైదరాబాద్‌,ఏప్రిల్‌11(జనంసాక్షి):

రాష్ట్రవ్యాప్తంగా మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న పూలే జయంతి వేడుకల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా హైదరాబాద్‌ అంబర్‌పేటలోని ఆయన విగ్రహానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ, వాణిజ్యపన్నులశాఖ మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జోగు రామన్న, పద్మారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. కేంద్రమంత్రి దత్తాత్రేయ కూడా పూలమాల వేసి నివాళులు అర్పించారు. నల్లగొండ జిల్లాలో జరిగిన జయంతి వేడుకలో మంత్రి జగదీష్‌రెడ్డి, మెదక్‌ జిల్లా సంగారెడ్డిలో జరిగిన కార్యక్రమంలో మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, ఎంపీ బీబీ పాటిల్‌, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌లు అదేవిధంగా మహబూబ్‌నగర్‌ జిల్లా కొల్లాపూర్‌లో జరిగిన వేడుకలో మంత్రి జూపల్లి కృష్ణారావులు పాల్గొని పూలే విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. హైదరాబాద్‌ గాంధీభవన్‌లో మహాత్మా జ్యోతిబాపూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్‌ నేతలు పొన్నాల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. రవీంద్రభారతిలో మహాత్మాజ్యోతిబా పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. జ్యోతిబా పూలే జయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు, స్పీకర్‌ మధుసూదనాచారి, మంత్రులు  తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, జోగురామన్న,కేంద్రమంత్రి దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యులు కె. కేశవరావు, బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎమ్మల్యే కృష్ణయ్య పాల్గొన్నారు. గాంధీభవన్‌లో జ్యోతిబా పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. వేడుకల్లో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. టిడిపి కార్యాలయం ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి ఏపీ ముఖ్యమంత్రి, టిడిపి అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… పూలే ఆశయాలను ఆచరించాలి… అదే ఘనమైన నివాళి అన్నారు. పూలే ఆశయ సాధనకోసం ఎన్టీఆర్‌ తపించేవారని, పూలేను ఆదర్శంగా తీసుకుని ఆనేక కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వెనుకబడిన వర్గాలు…రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు ఉప ప్రణాళిక తెచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని స్పష్టం చేశారు. వెనుకబడిన వర్గాలను పైకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. బడుగు, బలహీనవర్గాలు అభివృద్ధి చెందితేనే నిజమైన ప్రజాస్వామ్యం వస్తుందన్నారు. కార్యక్రమంలో పలువురు తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.