*మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి*
రేగొండ (జనం సాక్షి) : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. వెలుగు మండల సమైక్య మహాసభ ఎపిఎం తిరుమల్ సింగ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ మహాసభ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి హాజరై మాట్లాడారు. మహిళలు ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉంటే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ సమైక్య సంఘాలు అభివృద్ధి దిశలో పయనిస్తున్నాయని తెలిపారు. మహిళలు రుణాలు తీసుకొని తిరిగి చెల్లించడమే కాకుండా తీసుకున్న రుణాలతో వ్యాపార రంగాల్లో రాణించాలని సూచించారు. పాడి పరిశ్రమ హోటల్లు లాంటి రంగాల్లో మహిళలు పెట్టుబడులు పెట్టాలని సూచించారు. మహిళా సంఘం సభ్యులకు చెక్కులు పంపిణీ చేశారు. ప్రపంచవ్యాప్తంగా మహిళలు పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారని అన్నారు. బ్యాంకులు మహిళలకు రుణాలు ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపిడి సురేష్,
డిపిఎం సోమయ్య, శ్రీనిధి ఆర్ఎం నారాయణ, ఎంపీపీ పున్నం లక్ష్మి రవి, జడ్పీటీసీ సాయిని విజయ, జడ్పీ కో ఆప్షన్ సభ్యులు రహీం, ఎంపీడీఓ సురేందర్, స్థానిక ఎంపీటీసీ మైస సుమలత, తెరాస మండల అధ్యక్షులు అంకం రాజేందర్, సర్పంచల ఫోరమ్ అధ్యక్షులు దాసరి నారాయణ రెడ్డి, ఎంపీటీసీ లు ప్రతాప్ రెడ్డి, ఐలి శ్రీధర్ గౌడ్, బొట్ల కవిత సామ్రాట్, నాయకులు, మహిళలు పాల్గొన్నారు .