మహిళా బిల్లు ప్రవేశపెట్టండి

4

– సోనియా గాంధీ

న్యూఢిల్లీ,మార్చి8(జనంసాక్షి):పార్లమెంట్‌లో తక్షణమే మహిళాబిల్లును ప్రవేశపెట్టాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలిపారు.మహిళలు నిర్ణయాత్మక శక్తిగా ఎదిగినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని లోక్‌ సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ చెప్పారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లోక్‌ సభలో మహిళా సభ్యులు మాట్లాడేందుకు ఇవాళ ఆమె ప్రత్యేకంగా అవకాశం కల్పించారు. దీంతో పలువురు సభ్యులు మహిళల సమస్యలపై మాట్లాడారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా లోక్‌ సభలో మహిళ సభ్యులు ఫుల్‌ జోష్‌ లో కన్పించారు. వుమెన్స్‌ డే కావటంతో మహిళా ఎంపీలు కొంతమందికి ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం కల్పించారు స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌. మహిళలు నిర్ణయాత్మక శక్తిగా ఎదగాల్సిన అవసరముందని ఈ సందర్భంగా సుమిత్రా మహాజన్‌ ఆకాంక్షించారు. మహిళల సమస్యలను మహిళలే ప్రస్తావించాలని కోరారు. ఆడవారికి అన్ని రంగాల్లో సరైన ప్రాధాన్యం లభించినప్పుడే దేశాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా మహిళ సభ్యులకు అవకాశం కల్పించటం చక్కని సంప్రదాయమని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ ప్రశంసించారు. దేశంలో మహిళలకు రాజకీయంగా మరిన్ని అవకాశాలు దక్కాల్సిన అవసరముందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో తమ సత్తా చాటుతున్నారని? భవిష్యత్‌ లో మరింత రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మహిళా అక్షరాస్యత పెరిగితేనే అభివృద్ధి సాధ్యమన్నారు ఎంపీ కవిత. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నప్పటికీ?రాజకీయంగా వెనుకబడుతున్నారన్నారు. సోనియా గాంధీ ఒక మహిళ కాబట్టే? తెలంగాణ ప్రజల బాధను అర్ధం చేసుకొని? రాష్ట్రాన్ని ఇచ్చారని కవిత అన్నారు. మొదటి లోక్‌ సభలో కేవలం 3 శాతం ఉన్న మహిళా సభ్యులు ఇన్నేళ్ల కాలంలో 12 శాతానికి మాత్రమే పెరిగారని కవిత గుర్తు చేశారు. రాజకీయాల్లో మహిళల పాత్ర పెంచేందుకు తగు చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. ప్రత్యేక చర్చలో అన్ని పార్టీల నుంచి మహిళా సభ్యులు మాట్లాడారు. బుధవారం కూడా ప్రత్యేక చర్చ కొనసాగనుంది.