మహ్మద్‌ నషీద్‌కు 13 ఏళ్ల జైలు

6
మాలే,మార్చి14(జనంసాక్షి):

మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహ్మద్‌ నషీద్‌ కు అక్కడి కోర్టు 13 ఏళ్ళ జైలు శిక్ష విధిం చింది. తీవ్రవాదం తదితర నేరారోపణలపై ఈ శిక్ష విధించారు. 2012లో మహ్మద్‌ నషీద్‌ పదవీచ్యుతుడు కావటానికంటే ముందు అప్పటి చీఫ్‌ జడ్డిని అక్రమంగా నిర్బంధించారనే నేరారోపణలపై ముగ్గురు జడ్జీలతో కూడిన ధర్మాసనం అతనికి 13 ఏళ్ళ జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ఇచ్చినపుడు కోర్టు హాలులోనే ఉన్న నషీద్‌ చిరు నవ్వుతో తన కుటుంబ సభ్యుల కు కరచాలనం ఇచ్చారు. మహ్మద్‌ అబ్దుల్‌ గయూమ్‌ 30 ఏళ్ళ నిరంకుశ పాలన త ర్వాత మానవ హక్కుల, పర్యావరణ ఉద్య మకారుడు నషీద్‌ 2008 అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధిచారు. నషీద్‌కు ప్రస్తుత అ ధ్యక్షుడు యవిూన్‌ రాజకీయ ప్రత్యర్థి కావడం గమనార్హం. ఆయన  ఈ సందర్భంగా మాట్లాడుతూ న్యాయం కోసం పోరాడుతామని అన్నారు.