మాతృభాషలో భావ వ్యక్తీకరణ బలంగా వుంటుందా!
తెలుగు భాష అమలు గురించి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రెండు ప్రధానమైన తీర్పులని వెలువరించింది. అయితే వాటిని తెలుగు భాషాభిమానులు పట్టించుకున్నట్టుగా అన్పించడం లేదు. ఇప్ప టికైనా వాటికి తగు ప్రాముఖ్యాన్ని, ప్రచారాన్ని ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పెద్ద సంచలనాన్ని సృ ష్టించిన శ్రీలక్ష్మి హత్య కేసులో కోర్టులలో తెలుగు వినియోగం గురించిన ప్రస్తావన వచ్చింది. అదేవిధంగా మత్స్య సంఘాల టీము కి బృహత్ ప్రణాళిక (మాస్టర్ ప్లాన్), ముసాయిదా ప్రణాళికలను తమకి అర్థం కాని భాషలో ఇచ్చారని తెలుగులో ఇవ్వాలని ప్రభు త్వాన్ని ఆదేశించాలని హైకోర్టుని ఆశ్రయించాయి. ఈ రెండు తీర్పు లు తెలుగు భాష వినియోగం గురించి వచ్చిన తీర్పులుగా పరిగ ణించవచ్చు. ఇంకా ఏవైనా తీర్పులు వున్నాయో లేదో తెలియదు కానీ ఈ రెండు తీర్పులు తెలుగు భాష వినియోగం గురించి వచ్చిన ప్రధాన తీర్పులుగా పరిగణించవచ్చు. మొదటి కేసు కోర్టులో మాతృభాష గురించిన అంశం. అందుకే ఆ కేసుని ఇక్కడ ప్రస్తావిస్తాను. శ్రీలక్ష్మి హత్య కేసు విషయానికి వస్తే – (ఏల్చూరి మనోహర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తీర్పు తేదీ 7న అక్టోబర్ 2005, 2005 (2) ఏఎల్‌డీ క్రిమినల్ 751= 2005 క్రిమినల్ లా జర్నల్ 4593, న్యాయమూర్తులు జాస్తి చలమేశ్వర్, ఎంవీ రెడ్డి తేదీ : 21.6.2004 రోజున విజయవాడ శారదా పీజీ కాలేజీలో మౌఖిక పరీక్షకు హాజరవుతున్న శ్రీలక్ష్మిపై గొడ్డలితో మనోహర్ దాడి చేశాడు. ఆమె అక్కడికక్కడే మరణించింది. ఆ సహ విద్యార్థుల సమక్షంలో ఈ సంఘటన జరిగింది. కేసు నమోదైంది. కేసు విచారణ తరువాత విజయవాడ మహిళా కోర్టు అతనికి మరణశిక్ష విధించి, ఆ శిక్షని ధ్రువీకరించడానికి హైకోర్టుకి పంపించింది. కేసుని విచారించిన న్యాయమూర్తి ఎం. చలపతిరావు మరణ శిక్ష విధించడానికి గల కారణాలని తెలుగులో రాశారు. ఈ విధంగా తెలుగులో కారణాలు రాయడాన్ని మనోహర్ న్యాయవాది హైకోర్టు ముందు అభ్యంతరం లేవనెత్తారు. ఈ కేసుని విచారిచిన ఉన్నత న్యాయస్థానం మరణశిక్షు బదులుగా జీవితఖైదును ఖరారు చేసింది. సుప్రీం కోర్టు నిర్దేశించిన ఈ కేసు అరుదైన కేసులో అరుదైనదిగా భావించడానికి వీల్లేదని కోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. ముద్దాయి న్యాయవాది లేవనెత్తిన అభ్యంతరం అప్పమైన దిగా కింది కోర్టుల విషయంలో ఈ విషయానికి అత్యంత ప్రాము ఖ్యం వున్నందున ఈ విష యాన్ని తీర్పు చివర్లో ప్రస్తా వించాల్సి వస్తుందని హైకో ర్టు తన తీర్పులో పేర్కొంది. ‘మరణశిక్ష’ విధించడానికి కారణాలని తెలుగులో రాసి నందుకు ముద్దాయి న్యాయ వాది అభ్యంతరం లేవనె త్తారు. దీని గురించి పరిశీ లించాలంటే క్రిమినల్ ప్రొ సీజర్ కోడ్‌లోని 23వ అధ్యా యం కోర్టుల్లో సాక్ష్యం స్వీక రించడం గురించి ప్రస్తా విస్తుంది. అందులో ముఖ్య మైన నిబంధన 272 – అది ఈ విధంగా వుంటుంది.
కోర్టులోని భాష : ఈ కోడ్ అవసరాల నిమిత్తం హై కోర్టు కాకుండా మిగతా కోర్టుల్లోని భాషని నిర్దేశించే అధికారం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి వుంటుంది. అదే కోడ్‌లోని 27వ అధ్యాయం తీర్పులు వెలువరించడం గురించి ప్రస్తావిస్తుంది. నిబంధన 354 ప్రకారం ఈ చట్టంలోని ఇతర నిబంధనలలో ప్రత్యేకంగా పేర్కొనిప్పుడు తప్ప తీర్పులు కోర్టు భాషలో రాయాలి. తెలుగుని అధికారభాషగా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశిస్తే కోర్టులు తీర్పులను తెలుగులో వెలువరించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం 29.3.1974 రోజున జీవో ఎంఎస్ నం. 485ని జారీ చేసింది. ఆ ప్రభుత్వ ఉత్తర్వు ప్రతి మా ముందు వుంది. ఈ ఉత్తర్వు ప్రకారం తెలుగు, ఉర్దూ భాషలో కాకుండా కొన్ని జిల్లాల్లో మరాఠీ, కన్నడ, తమిళంలో కూడా ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఉత్తర్వుని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని నిబంధన 272 ప్రకారం ప్రభుత్వం జారీ చేసింది. కోర్టు భాషని తెలుగుగా ప్రభుత్వం నిర్దేశించిన తరువాత తీర్పులని తెలుగులో వెలువరించాలని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవస రం లేదన్న మా అభిప్రాయం. నిబంధన 272 అనేది విచారణల్లో తెలుగు వినియోగం గురించి ప్రస్తావించిన అధ్యాయంలో వుంది. అధ్యాయానికి వున్న శీర్షిక నిబంధనలోని అర్థాన్ని నియంత్రించదు. తీర్పు మొత్తం ఇంగ్లిష్‌లోనే వుంది. మరణ శిక్ష విధించడానికి గల కారణాలని న్యాయమూర్తి తెలుగులో వివరించాడు. దాని వల్ల కేసుకు ఎలాంటి హాని జరగదు’.
ఈ తీర్పు ద్వారా రెండు విషయాలు గోచరమవు తున్నాయి. క్రిమినల్ కోర్టులో తీర్పులని తెలుగులో వెలువరిం చవచ్చు. అది చట్ట సమ్మతం. ఇది ఒక అంశం. ఇక్కడ మరో ప్రధాన అంశం మనం గమనించాల్సి వుంది. సెషన్స్ కోర్టు న్యాయ మూర్తి ఇంగ్లిష్ బాగా రాయగలడు. మొత్తం తీర్పుని ఇంగ్లిష్‌లో రాశాడు. ముద్దాయికి మరణ శిక్ష విధించాలంటే దాన్ని అరుదైన కేసులో అరుదైనవిగా పరిగణించడానికి బలమైన కారణాలు రాయా ల్సి వుంటుంది. ఆ కారణాలని ఇంగ్లిష్‌లో కన్నా తెలుగులో రాస్తే బలవత్తరంగా వుంటుందని న్యాయమూర్తి భావించి వుంటాడు. ఇది నా అభిప్రాయం మాత్రమే. ఇక్కడొక విషయం చెప్పుకోవాలి. ఏ విదేశీ భాషకూడా మాతృభాష స్థానాన్ని పొందలేదు. సంక్లిష్టమైన భావాలని సహజంగా వెలువరించడం మాతృభాషలోనే వుంటుంది. మాతృభాషకి మించిన భాష మరోటిలేదు.