మానవత్వం చాటుకున్న నవీన్ బాబు.
– పలువురిని పరామర్శించి ఆర్థిక సాయం.
– “జనంసాక్షి” కథనానినికి స్పందించిన నవీన్ బాబు.
– 5000 ఆర్ధిక సహాయం, నెలకు 2000 పెన్షన్.
బూర్గంపహాడ్ సెప్టెంబర్ 04 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండల పరిధిలోని మొరంపల్లి బంజర గ్రామంలో ఇటీవల “తల్లి మరణంతో దిక్కు తోచని చిన్నారులు” అనే వార్త “జనంసాక్షి” దినపత్రికలో వచ్చిన కథనానికి స్పందించి చిన్నారులకు 5000 సాయంతో పాటు ప్రతినెల 2000 చొప్పున పెన్షన్ సౌకర్యం కల్పించిన నవీన్ బాబు ఆర్మీ అధినేత ప్రముఖ సామాజికవేత్త నవీన్ బాబు. ఆయన ఆదివారం మండలంలో విస్తృతంగా పర్యటించి ముసలిమడుగు గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ కళ్యాణ్ అనే యువకుడిని ఆయన పరామర్శించారు. అనంతరం మోరంపల్లి బంజర గ్రామానికి చెందిన కట్కోజు శశికళ అనే మహిళ ఇటీవల మృతి చెందడంతో ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతురాలు శశికళది నిరుపేద కుటుంబం కావడంతో తల్లిని కోల్పోయిన ఇద్దరు చిన్నారులు ఒక్కసారిగా దీనస్థితిలో ఉండటంతో ఆదివారం చిన్నారుల భవిష్యత్తు కోసం 5000 రూపాయలు నగదును వితరణ అందించారు. అలాగే ప్రతి నెల 2000 చొప్పున అందిస్తానని చదువులకు ఖర్చు పెట్టుకుంటానని ఏ అవసరం ఉన్న ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నానని చిన్నారులకు భరోసా ఇచ్చారు. చిన్నారులకు చేయూతనివ్వడం చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు. అనంతరం బూర్గంపహాడ్ చేరుకొని స్థానిక యువత కోరిక మేరకు వారు ఏర్పాటు చేసినటువంటి వరసిద్ధి వినాయక మండపాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గొమ్మూరు కాలనీ చేరుకుని యువనేత నిమ్మల హరీష్ ఇంట్లో తేనీటి విందు స్వీకరించారు. అనంతరం నాగిని ప్రోలు లోని రజక వీధిలో ముదిగొండ వీరన్న చంచలపు శ్రీనివాస్ రావుల ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వినాయక మండపం సందర్శించి గణనాధిని పూజలు అందుకున్నారు అక్కడ యువతతో ముచ్చటించి అనంతరం పాలెం రాజా శేఖర్ రెడ్డి ఇంటి వద్ద అల్పాహారం సేకరించి అవినీడి నరసయ్య తండ్రి ని పరామర్శించారు. సార పాక చేరుకుని అక్కడ యువతతో చర్చించారు. ఈ కార్యక్రమంలో బోనం నాగిరెడ్డి, కందికొండ రెడ్డి, నిమ్మల హరీష్, తదితరులు పాల్గొన్నారు.