మానవీయ కోణంలో వైద్యం చేయండి మాజీ రాష్ట్రపతి కలాం

5

మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం

గుంటూరు ,మార్చి 16(జనంసాక్షి): వైద్యులు మానవతా హృదయంతో వైద్య సేవలను అందించాలని మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం అన్నారు.గుంటూరులో నూతనంగా ఏర్పాటు చేసిన రమేష్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పటల్‌ను మాజీ రాష్ట్ర పతి ఏపీజే అబ్దుల్‌ కలాం ఆదివారం ఉదయం ప్రారం భించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… వైద్యులు రెండు హృదయాలను కలి గి ఉండాలని సూచించారు. వైద్యం చేసే హృదయంతో పా టు మానవతా హృదయం కూడా ఉండాలని వైద్యులకు దిశానిర్దేశం చేశారు. తమ వద్దకు వచ్చేరోగులకు ధనిక, పేద అనే తేడా లేకుండా అందరికీ ఒకే రకమైన వైద్య సేవలు అం దించటం ద్వారానే వైద్యవృత్తి ప్రతిష్ట పెరుగుతుందన్నారు. భారత దేశంలో చిన్న పిల్లలు, గర్భిణిలు అత్యధికంగా చని పోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఈ మరణాలు సంభవించకుండా వైద్యులు విస్తృతమైన పరిశోధనలు చేపట్టాలని ఆకాం క్షించారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ… దేశాభివృద్ధిలో ఆరోగ్యం పాత్ర కీలమని, ఆరోగ్యం ద్వారానే దేశ సంసద సాధ్యపడుతుందన్నారు. ప్రపంచంలో అనేక దేశాలు అభివృద్ధి చెందాయంటే ఆయా దేశాలు ఆరోగ్య పరంగా బలోపేతంగా ఉండటమే దానికి కారణమన్నారు. కార్యక్రమంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావు, రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్‌, నారాయణ, ప్రత్తిపుల్లారావు, కిశోర్‌బాబు, ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్యేలు మోదుగుల, వేణుగోపాల్‌రెడ్డి, నక్కా ఆనందబాబు, డాక్టర్‌ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.