మాపై నిఘా ఎందుకు పెట్టారు

1

రహస్య నివేదిక వెల్లడించాలి

మోదీతో నేతాజీ మనవడు

బెర్లిన్‌,ఏప్రిల్‌14(జనంసాక్షి): విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీని బెర్లిన్‌లో నేతాజీ ముని మనవడు సూర్యబోస్‌ కలిశారు. ఈ సందర్భంగా నేతాజీ కుటుంబంపై నిఘా పెట్టిన విషయాన్ని మోడీ దృష్టికి తెచ్చారు. నేతాజీ మనవడు సూర్యబోస్‌ జర్మనీలో స్థిరపడ్డారు. రహస్య ఫైళ్లపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. నేతాజీ రహస్య ఫైళ్లను వెల్లడించాలంటూ కోల్‌కతాలో బోస్‌ కుటుంబ సభ్యులు నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు. విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత మోడీని నేతాజీ కుటుంబ సభ్యులు కలవనున్నారు. నేతాజీ కుటుంబంపై 1948 -1968 మధ్య కాలంలో నెహ్రూ ప్రభుత్వం నిఘా పెట్టిందని ఈ నెల 4న జాతీయ ఛానళ్లలో ప్రచారం జరిగిన విషయం విదితమే. దీంతో దీనిపై దుమారం చెలరేగుతోంది. ప్రభుత్వం కూడా ఈ విషయాలన్నీ వెల్లడించడానికి సిద్దంగా ఉంది