మారిషస్‌ ఓ మినీభారత్‌

2

పలు కీలక ఒప్పందాలు

బిజీబిజీగా ప్రదాని మోదీ

న్యూఢిల్లీ,మార్చి12(జనంసాక్షి): భారత్‌ మారిషస్‌ల బంధం మరింత బలపడాలని ప్రధాని మోడీ ఆకాంక్షించారు. మారిషస్‌ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ మారిషస్‌ లోని హిందువుల పవిత్రస్థలమైన గంగా తలావ్‌ శివాలయాన్ని సందర్శించి ప్రత్యేక  ప్రార్థనలు చేశారు. మార్చి 12 మారిషస్‌  జాతీయ దినోత్సం సందర్భంగా మోదీ  జాతినుద్దేశించి ప్రసంగించిన అనంతరం వరల్డ్‌ హిందీ సెక్రటేరియట్‌ భవనానికి శంకుస్థాపన చేశారు.  ఈ సందర్భంగా హిందీ భాషను ఆదరిస్తున్న మారిషస్‌ ప్రజలను అభినందించారు.  మారిషస్‌  ఒక మినీ భారత్‌ అని  తన బిడ్డకు భారత మాత ప్రణామాలర్పిస్తోందన్నారు.  ఇక్కడున్న  కోట్లాది భారతీయుల కోరిక మేరకు మారిషస్‌ వచ్చానన్నారు. సీషెల్‌ నుంచి ఇక్కడకు చేరుకున్న ప్రధాని జాతీయదినోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మారిషస్‌ పర్యటనలో భాగంగా మోదీ మారిషస్‌ ప్రభుత్వంతో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు.  ఆర్థిక పురోగతికి భారత్‌ సహకరిస్తుందని హామీ ఇచ్చారు. మారిషస్‌లో మౌళిక వసతుల కోసం 500 మిలియన్‌ అమెరికన్‌ డాలర్ల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. హిందూ మహా సముద్రంపై మారిషస్‌ ఆధిపత్యాన్ని గౌరవిస్తామని, పెట్రోలియం నిల్వ బంకర్‌ సదుపాయాల నిర్మాణం త్వరలో చేపడతామని హామీ ఇచ్చారు.