మార్చి 21 నుంచి ‘పది’ పరీక్షలు

హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ పదో తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి కీలక ప్రకటన వెలువడిరది. 2025, మార్చి 21 నుంచి ఏప్రిల్‌ 4వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలను నిర్వహించనున్నట్లు ఎస్సెస్సీ బోర్డు ప్రకటించింది. పదో తరగతి పరీక్షలు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరగనున్నాయి. ఇక ఫిజికల్‌ సైన్స్‌, బయోలాజికల్‌ సైన్స్‌ పరీక్షలను ఉదయం 9.30 గంటల నుంచి 11 గంటల వరకు నిర్వహించనున్నారు.
పది పరీక్షల టైం టేబుల్‌ ఇదే..
మార్చి 21(శుక్రవారం) ఫస్ట్‌ లాంగ్వేజ్‌, మార్చి 22(శనివారం) సెకండ్‌ లాంగ్వేజ్‌, మార్చి 24(సోమవారం) థర్డ్‌ లాంగ్వేజ్‌(ఇంగ్లీష్‌), మార్చి 26(బుధవారం) గణితం, మార్చి 28(శుక్రవారం) సైన్స్‌(ఫిజికల్‌ సైన్స్‌),మార్చి 29(శనివారం) సైన్స్‌(బయోలాజికల్‌ సైన్స్‌),ఏప్రిల్‌ 2(బుధవారం) సోషల్‌ స్టడీస్‌,ఏప్రిల్‌ 3(గురువారం) ఓఎస్‌ఎస్సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ -1,ఏప్రిల్‌ 4(శుక్రవారం) ఓఎస్‌ఎస్సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌ -2