మార్పు మావల్లే సాధ్యం

4

పీడీపీ భాజపా కూటమి అపవిత్ర కలయిక

హురియత్‌ నేత మస్రత్‌

శ్రీనగర్‌,మార్చి08(జనంసాక్షి): హుర్రియత్‌ కాన్ఫరెన్స్‌ నేత, కశ్మీర్‌ వేర్పాటువాద నాయకుడు మసరత్‌ అలం జైలు నుంచి విడుదలైన మరుసటి రోజే జమ్మూకశ్మీర్‌లో ఏర్పడిన

పీడీపీ-బీజేపీ ఉమ్మడి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వాలు మారినంత మాత్రాన క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాదని అన్నారు. ఆ మార్పు తామన్న తీసుకురావాలి లేదంటే ప్రజలన్న తీసుకురావాలి అని చెప్పారు. తాను జైలు నుంచి విడుదల కావడం పెద్ద విషయమేమి కాదని గతంలో కూడా పలుమార్లు జైలుకు వెళ్లానని,  చిన్నతనంనుంచి తాను జైలులోనే ఎక్కువగా ఉన్నానని పేర్కొన్నారు. తనకు మూడుసార్లు బెయిల్‌ లభించిందని అన్నారు. మేం చేయదలుచుకున్న అంశాలపై చట్టం ద్వారా ముందుకు వెళతామని, ప్రస్తుతం తాను తన కుటుంబంతో గడపాలనుకుంటున్నానని వివరించారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడనే కారణాలతో 2010లో పోలీసులు అతడిని అరెస్టు చేసి బారాముల్లా జైలుకు తరలించారు.