మాల్యా అప్పులేరట!

4

– 2010 రాజ్యసభ అఫిడవిట్‌లో కింగ్‌ఫిషన్‌ అధినేత

న్యూఢిల్లీ,మార్చి12(జనంసాక్షి):లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యాకు చెందిన సంస్ధలు, ఆస్తుల విలువ వేల కోట్ల రూపాయలు ఉంటుంది. మాల్యాకు బీర్ల తయారీ కంపెనీ, ఐపీఎల్‌ జట్టు,

ఎఫ్‌ వన్‌ టీమ్‌, కింగ్‌ ఫిషర్‌ ఎయిర్‌ లైన్స్‌ సహా పలు వ్యాపారాలున్నాయి. బ్రిటన్‌లో ఆయనకు ఓ బంగ్లా కూడా ఉందని వార్తలు వచ్చాయి. 2013 ఫోర్బ్స్‌ జాబితా ప్రకారం

భారత్‌లో అత్యంత ధనవంతులైన 100 మందిలో ఆయన 84వ స్థానంలో నిలిచారు. ఇక మాల్యాకు చెందిన సంస్థలు బ్యాంకులకు ఎగవేసిన మొత్తం 9 వేల కోట్ల

రూపాయలు.ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మాల్యాకు సొంత ఇల్లు లేదట. భూమి అసలే లేదు. చేతిలో 9500 రూపాయల నగదు మాత్రమే ఉంది. ఆయన ఒక్క రుపాయి కూడా అప్పులేరు. ఫెర్రారీ కారు, బంగారు, బాండ్లు, డిపాజిట్లు ఇతర ఆస్తలున్నీ కలిపి ఆయనకు 615 కోట్ల రూపాయల సంపద ఉంది.  ఈ విషయాలన్నీ ఆయనే వెల్లడించారు. 2010లో రాజ్యసభకు పోటీచేసినపుడు మాల్యా దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఈ విషయాలు పొందుపరిచారు.ఆరేళ్ల క్రితం మాల్యాకు 615 కోట్ల విలువైన ఆస్తులు మాత్రమే

ఉన్నాయా? అయితే ఆయన సంస్థలకు బ్యాంకులు వేలాది కోట్ల రూపాయల రుణాలు ఎలా ఇచ్చాయి? ఇప్పుడు ఇన్ని వేల కోట్లు ఎలా ఎగ్గొట్టారు? మాల్యా దేశం విడిచి వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని బ్యాంకులు సుప్రీం కోర్టును ఆశ్రయించేలోపే ఆయన విదేశాలకు పారిపోయిన సంగతి తెలిసిందే.