మా వెంట్రుక కూడా పీకలేరు
నీ జేజమ్మ దిగొచ్చినా మమ్మల్నేం చేయలేరు
మాది ప్రజాస్వామ్యబద్దంగా ఏర్పడ్డ సర్కారు
ఉమ్మడి రాజధాని పాలనా సౌలభ్యానికి మాత్రమే
ఏపీలో ఇతర పార్టీల నేతలను చేర్చుకుంటే నీతి
మేం చేర్చుకుంటే అవినీతా
నేను కుర్చీ లాక్కొని ముఖ్యమంత్రిని కాలేదు-సీఎం కేసీఆర్
హైదరాబాద్ :
సీఎం కేసీఆర్ అధ్యక్షతన సచివాలయంలో మంత్రివర్గ భేటీ జరిగింది. సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వం రంగంలో ఉన్న 25వేల ఉద్యోగాలకు జులై నెలలో నోటిఫికేషన్ లు విడుదల చేయనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ స్వయంగా విలేకరుల సమావేశంలో కేబినెట్ వివరాలు వెల్లడించారు. తనను అరెస్టు చూస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక్క రోజులో కూల దోస్తానని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించడాన్ని సీఎం కేసీఆర్
తీవ్ర స్వరంతో ప్రతిస్పందించారు. ఆయన మాటల్లోనే నీవేమన్న రాష్ట్ర్రపతివా? మాదీ ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ప్రభుత్వం నీవుకాదు కదా! నీ జెమ్మ వచ్చినా మా వెంట్రుకకూడా పీకలేరు. ఉమ్మడి రాజధాని సౌలభ్యం కోసం మాత్రమే. నీ రాజధాని ఏర్పాటు అయ్యే వరకు పాలన సాగించుకోడానికే. మా భూభాగంపై నీ పెత్తనం ఎలా ఉంటుంది. తెలంగాణ
దేశంలో అంతర్భాగం. ”మే 31 నుండి జూన్ పదో తేదీ లోపున 120 మంది ఎమ్మెల్యే ఫోన్లను ట్యాప్ చేస్తామా ? ఎందుకు ఫిర్యాదు చేయలె. తెహాల్క విషయంలో బంగారు లక్ష్మణ్ జరిగిన పరిణామాలు తెలియవా ? నీకు లేదా నీతి. ఎస్పీవై రెడ్డి ఏ పార్టీలో గెలిచిండు. ఏ పార్టీలో ఉన్నారు ? కొత్తపల్లి గీత..ముస్తాఫా..జలీల్ ఖాన్..ఉప్పులేటి కల్పన..వీరంతా ఏ పార్టీలో ఉన్నారు..ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారు. పార్టీ ఫిరాయింపు చట్టం వర్తించదా ? 9మంది ఎమ్మెల్సీలను తీసుకున్నారు. ఆరు కాంగ్రెస్..మూడు వైసీపీ పార్టీకి చెందిన వారున్నారు. నీవు చేర్చుకుంటే నీతి..ఇతరులు చేస్తే అవినీతా ? మండలి ఎన్నికల్లో సీపీఎం..సీపీఐ..వైసీపీలతో తాను స్వయంగా ఫోన్ చేయడం జరిగింద, మద్దతివ్వాలని కోరడం జరిగింది. తమకు బలం ఉంది కాబట్టే పోటీ చేయడం జరిగింది. ఆ సమయానికి చంద్రబాబుకు సరియైన బలం లేదు. రేవంత్ రెడ్డి సంప్రదింపులు చేయడం వల్ల నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ స్టన్ ఏసీబీని సంప్రదించాడు. ఈ వ్యవహారంలో డబ్బులు అందచేయలేదా ? దీనిని ఏమంటారు ? ఒక సంవత్సరంలో హైదరాబాద్ లో శాంతి భద్రతలకు భంగం కలిగిందా ? అని కేసీఆర్ పేర్కొన్నారు.
”పాలమూరు ఎత్తిపోతల పథకానికి రూ. 35,200 కోట్లతో కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. హైదరాబాద్ సిటీకి డ్రింకింగ్ వాటర్ కు ఆమోదం తెలపడం జరిగింది. సమైక్య రాష్ట్రంలో ఫ్లోరైడ్ బాధితులను పట్టించుకోలేదు. ప్రధాన మంత్రి టేబుల్ పై పెట్టి అడిగినా సమస్య పరిష్కారం కాలేదు. ఇందుకు రూ. 6190 కోట్లతో ఫ్లోరైడ్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపడం జరిగింది. పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిస్థితిపై కమిటీ వేయడం జరిగింది. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి కమిటీలో ఉంటారు. వీరు అధ్యయనం చేసి త్వరలో నిర్ణయం తీసుకుంటాం. గీత్స, మత్స్య కార్మికుల కోసం ఐదు లక్షల ఇన్సూరెన్స్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. రిజిష్టర్ చేసుకున్న సోసైటీల్లో పేర్లను నమోదు చేసుకున్న కార్మికులకు మాత్రమే ఇది వర్తిస్తుంది. మైనార్టీల కోసం 10 రెసిడెన్షియల్ స్కూల్స్, 10 హాస్టళ్లను ఏర్పాటు చేయాలి. రూ. 25 కోట్లను కేటాయిస్తూ ఫ్రీ మెట్రిక్ స్కాలర్ షిప్స్ అందచేయడం జరుగుతుంది. అనాథ బాలికలు, బాలుర కోసం చదువుల భారాన్ని ప్రభుత్వమే చూసుకుంటుంది. మంత్రి కడియం శ్రీహరి పరిశీలించి వారం రోజుల్లో నివేదిక ఇస్తే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. సోషల్ వెల్ఫేర్ హాస్టల్ విద్యార్థులకు గ్రాముల మాదిరిగా కాకుండా కడుపునిండా అన్నం పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం. దీనికి సంబంధించిన సాధ్యసాధ్యాలను కడియం శ్రీహరి అధ్యక్షతన ఉండే కమిటీకి బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. ఈటెల, జోగు రామన్న చందులాల్, లక్ష్మారెడ్డిలు ఈ కమిటీలో ఉంటారు. దీనిపై నివేదిక ఇచ్చిన అనంతరం నిర్ణయం తీసుకుంటాం. నిజామాబాద్ జిల్లాలో రుద్రారంలో ఫుడ్ సైన్స్ టెక్నాలజీ ఏర్పాటు చేస్తాం. ఈనెల 12వ తేదీన టీఎస్ పాస్ గైడ్ లైన్స్ పై చర్చించాం. రైటు టు క్లియరెన్స్ చట్టాన్ని శాసనసభ ఆమోదించడం జరిగింది. ప్రభుత్వ రంగంలో ఉన్న 25వేల ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. జులై నెలలో నోటిఫికేషన్లు విడుదల చేయడం జరుగుతుంది. వయో పరిమితిపై తొందరలో నిర్ణయం తీసుకుంటాం. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడం జరుగుతుంది. ఇందులో కొన్ని సమస్యలున్నాయి. స్థానికులు..స్థానికేతరులు ఉన్నారు. వీరికి ఓ టెస్ట్ పెట్టి అన్ని పరిశీలించి స్థానికులకు మాత్రమే అవకాశం ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. దీనిపై గైడ్ లైన్స్ రూపొందుతున్నాయి. ఎక్సైజ్ పాలసీపై నిర్ణయం తీసుకోలేదు. ఎనిమిది సంవత్సరాల వయస్సున్న వారు బీడీలు చుడుతున్నారు. వీరికి ఇన్సూరెన్స్ చేయాలని డిమాండ్స్ చేస్తున్నారని ఇది చేయడం సబబు కాదని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఒంటెద్దు పోకడతో పట్టిసీమ ప్రాజెక్టు..
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఒంటెద్దు పోకడతో పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. పోలవరం నుండి 80 టీఎంసీల నీరు తీసుకోవచ్చు. ఏపీలో ఉన్న ఎగువున ఉన్న ప్రాంతాలకు నీరు సప్లై చేయాలి. ఏ రాష్ట్రాన్ని సంప్రదించకుండా ప్రాజెక్టును చేపట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్రానికి 45 టీఎంసీల నీరు రావాలి. ఇటీవలే ఏపీ రాష్ట్రానికి 197 టీఎంసీల నీరు కేటాయించింది. ఆర్డీఎస్ లో 4 టీఎంసీల నీరు కేటాయించారు. 25 టీఎంసీల తెలుగు గంగకు..9 టీఎంసీల నీరు జూరాల ప్రాజెక్టు ఇచ్చారు. మిగతా 150 టీఎంసీల నీరు నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులకు కేటాయించారు. సెక్షన్ 3 ప్రకారం పిటిషన్ వేయడం జరిగింది. కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణకు అన్యాయం జరిగింది. నీటి పంపకాలు జరగాలని కోరడం జరిగింది” అని కేసీఆర్ పేర్కొన్నారు.
ఏ ఫోన్ ట్యాప్ చేయలె..
తాము ఏ ఫోన్ ట్యాప్ చేయలేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కేబినెట్ విూటింగ్ అనంతరం విలేకరుల సమావేశంలో టెలిఫోన్ ట్యాపింగ్ విషయంపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై విలేకరులు ఈ విషయాన్ని ప్రస్తావించారు.