మిషన్‌ భగీరథతో గిరిజన పల్లెలకు శుద్దజలం

భద్రాద్రి కొత్తగూడెం,డిసెంబర్‌9(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం కొలువు తీరిన తరువాత ప్రతి ఆదివాసీ పల్లె స్వచ్ఛమైన నీరు అందుకుంటుందని జడ్పీ ఛైర్మన్‌ కోరం కనకయ్య అన్నారు. ఇది వరకు ఏజెన్సీ పల్లెలు కలుషీత నీటిపైనే ఆధారపడాల్సి వచ్చేదని అన్నారు. వాగులు, వంకలు, చెలమిల విూదనే మారుమూల గ్రామాలు ఆధారపడ్డాయని అన్నారు. త్వరలో ప్రజల ముందుకు రానున్న మిషన్‌ భగీరథతో ప్రజల కష్టాలన్ని తొలగిపోతాయని అన్నారు. ఏజెన్సీలో నీటి తండ్లాట ఉండబోదని అన్నారు. ఒకప్పుడూ విద్యనభ్యసించాలన్న, వైద్యం చెయించుకోవాలన్నా మైళ్ళ దూరం నడవాల్సి వచ్చేదని అన్నారు. ఇప్పుడు ఆ పరిస్ధితి లేకుండా సీఎం కేసీఆర్‌ అన్ని రకాలుగా అభివృద్ధి చేశారని తెలిపారు. విద్య వ్యవస్ధ ఏజెన్సీలో పూర్తిగా వెనుకబాటుకు గురైందని, నేడు ఆ సమస్యను అధిగమించామని తెలిపారు. వైద్యం కోసం మైళ్ళ దూరం నడవాల్సిన పరిస్ధితి వచ్చిందని, రహదారుల ఏర్పాటుతో సునాయాసంగా నియోజకవర్గ కేంద్రానికి చేరుకునేలా ప్రభుత్వం కల్పించిందని అన్నారు. వివిధ శాఖల ఆధ్వర్యంలో ప్రభుత్వ పని తీరు బ్రహ్మండంగా ఉందని, అభివృద్ధి కార్యక్రమాలు రోజురోజుకు ముందుకు సాగుతున్నాయని అన్నారు. ఇలాంటి పరిపాలనతో సీఎం కేసీఆర్‌ చరిత్ర పుటల్లో నిల్వనున్నారని అభివర్ణించారు. విపక్షాలు కేవలం ఉనికి కోసమే విమర్శలు చేస్తున్నాయని అన్నారు.