ఐఎస్‌ఐ ఏజెంట్‌ మోతీరామ్‌ గూఢచర్యం..

ఉగ్రదాడికి ముందు పహల్గాంలోనే విధులు..!
న్యూఢల్లీి(జనంసాక్షి):పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్న సీఆర్పీఎఫ్‌ జవాన్‌ మోతీ రామ్‌ జాట్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అతడి గురించి పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పర్యాటకులపై ఉగ్రదాడికి ముందు మోతీ రామ్‌ పహల్గాం లోనే విధులు నిర్వర్తించినట్లు సమాచారం. కేవలం దాడి జరగడానికి ఆరు రోజుల ముందే అతడు అక్కడి నుంచి బదిలీ అయినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడిరచాయి.సీఆర్పీఎఫ్‌లో అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌(ఏఎస్సై)గా పనిచేస్తున్న మోతీ రామ్‌ జాట్‌.. 2023 నుంచి దేశ భద్రతకు సంబంధించిన కీలకమైన సమాచారాన్ని పాక్‌ గూఢచర్య ఏజెంట్లకు అందజేస్తున్నట్లు అధికారులు సోమవారం తెలిపారు. ఆన్‌లైన్‌లో అతడి కదలికలు అనుమానాస్పదంగా ఉండటంతో కొంతకాలంగా అతడి సామాజిక మాధ్యమ ఖాతా మీద సీఆర్పీఎఫ్‌ నిఘా పెట్టింది. దీంతో అతడు గూఢచర్యానికి పాల్పడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే అతడిని నాలుగు రోజుల పాటు కఠినంగా విచారించిన సీఆర్పీఎఫ్‌ సర్వీసు నుంచి తొలగించింది. అనంతరం మే 21న ఎన్‌ఐఏకు అప్పగించింది. సోషల్‌ మీడియాలో పాకిస్థానీ హ్యాండ్లర్లతో మోతీరామ్‌ సంప్రదింపులు జరిపేవాడని విచారణలో గుర్తించారు. వారి నుంచి అతడు రూ.లక్షల్లో డబ్బు తీసుకున్నాడని, ఆ మొత్తాన్ని భార్య బ్యాంకు ఖాతాకు బదిలీ చేసుకున్నట్లు అధికారులు వెల్లడిరచారు. మన సైనిక దళాల సీక్రెట్‌ ఆపరేషన్లు, భద్రతా మోహరింపులు ఉన్న ప్రాంతాల సమాచారాన్ని అతడు పాక్‌కు చేరవేసినట్లు తేలింది. దీనిపై ఎన్‌ఐఏ మరింత లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఏప్రిల్‌ 22న పహల్గాంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బైసరన్‌ లోయలో పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవిక దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటన తర్వాత పాక్‌ గూఢచర్యంపై నిఘా సంస్థలు దృష్టిసారించాయి. ఈ క్రమంలోనే పంజాబ్‌, హరియాణా, ఉత్తరప్రదేశ్‌లో పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తరభారతంలోని చాలా చోట్ల పాక్‌ మద్దతు ఉన్న ఈ స్పై నెట్‌వర్క్‌ క్రియాశీలకంగా పనిచేస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

జ్యోతి మల్హోత్రా ఫోన్‌,ల్యాప్‌టాప్‌లలో 12టీబీ డేటా..!
` ఆమె నలుగురు పాక్‌ ఐఎస్‌ఐ ఏజెంట్లతో నేరుగా మాట్లాడిరది
` కేసులో కీలక విషయాలు వెలుగులోకి..
న్యూఢల్లీి(జనంసాక్షి):పాకిస్థాన్‌ కోసం గూఢచర్యం చేస్తోందన్న ఆరోపణలపై అరెస్టయిన హరియాణా యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రాకు సంబంధించి మరో విషయం వెలుగులోకి వచ్చింది.తనతో టచ్‌లో పాక్‌ అధికారులు ఇంటర్‌సర్వీస్‌ ఇంటెలిజెన్స్‌తో కలిసి పనిచేస్తున్నారని జ్యోతికి తెలుసని దర్యాప్తుతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడిరచాయి. కానీ ఆమె భయపడకుండా ఆ సంప్రదింపులు కొనసాగించారని పేర్కొన్నాయి. ఆమె ల్యాప్‌టాప్‌, ఫోన్‌లోని సమాచారం ఆధారంగా ఈ విషయాన్ని వెల్లడిరచాయి. గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన జ్యోతి ల్యాప్‌టాప్‌, ఫోన్‌ను స్వాధీనం చేసుకొని ఫోరెన్సిక్‌ విశ్లేషణకు పంపారు. వాటిల్లో అప్పటికే తొలగించిన సమాచారాన్ని అధికారులు రికవరీ చేశారని, అదంతా 12టెరాబైట్ల మేర ఉందని సమాచారం. ఈ కేసులో మరిన్ని ఆధారాల కోసం ఆ డేటాను స్కాన్‌ చేస్తున్నారు. తాను ఐఎస్‌ఐకు సంబంధించిన వ్యక్తులతో మాట్లాడుతున్నానని తెలిసే, కాంటాక్ట్‌ కొనసాగించారని ఆ సమాచారం ఆధారంగా ప్రాథమికంగా గుర్తించారు. జ్యోతి నలుగురు పాక్‌ ఐఎస్‌ఐ ఏజెంట్లతో నేరుగా మాట్లాడిరదని, వారిలో డానిష్‌, అహ్సాన్‌, షాహిద్‌ ఉన్నారని ఆ వర్గాలు వెల్లడిరచాయి. ఐఎస్‌ఐలో ఆ ఏజెంట్ల హోదాలు, ఉద్యోగాలు ఏంటో ధ్రువీకరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక..జ్యోతి మల్హోత్రాకు పాక్‌లో ఆరుగురు వ్యక్తులు ఏకే 47లతో భద్రత కల్పించిన దృశ్యాలు వైరల్‌ అయ్యాయి. వారు ధరించిన జాకెట్లపై ‘’నో ఫియర్‌’’ అని రాసి ఉన్నట్లు కనిపించింది. ఇక, 2023లో వీసా కోసం పాక్‌ హైకమిషన్‌కు వెళ్లిన సమయంలో తొలిసారి డానిష్‌ పరిచయం అయ్యాడని వెల్లడిరచింది. పాక్‌ హైకమిషన్‌ కార్యాలయానికి వీసా కోసం వచ్చే వారిని ట్రాప్‌ చేసి వారిని డానిష్‌ గూఢచర్యానికి వాడుకొనేవాడని.. యూట్యూబర్‌ జ్యోతి కూడా వీసా కోసం వెళ్లగా ఆమెను ట్రాప్‌ చేశాడని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఇంతకాలం పోలీస్‌ రిమాండ్‌లో ఉన్న జ్యోతిని కోర్టు నిన్న 14 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీకి పంపింది.పాకిస్థాన్‌తో సంబంధం ఉన్న గూఢచర్య నెట్‌వర్క్‌పై అధికారులు ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. కొన్ని వారాల వ్యవధిలో యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా సహా 10 మందికిపైగా అరెస్టయిన సంగతి తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో ఈమేరకు చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.