ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగిస్తోంది

` మూడు రోజుల్లో 900లకు పైగా డ్రోన్లతో దాడి చేసింది
` మరిన్ని క్షిపణులు ప్రయోగించడానికి మాస్కో సన్నద్ధం అవుతోందని నిఘా వర్గాలు తెలిపాయి: జెలెన్‌స్కీ
కీవ్‌(జనంసాక్షి):రష్యా-ఉక్రెయిన్‌ మధ్య కాల్పుల విరమణ కోసం ఒకవైపు మంతనాలు జరుగుతున్న వేళ కీవ్‌పై మాస్కో భారీ దాడులకు పాల్పడుతోంది. వీటిపై ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ మాట్లాడుతూ.. మూడు రోజులుగా తమ దేశంపై క్షిపణులతో పాటు 900కు పైగా డ్రోన్లతో దాడులు జరిగాయన్నారు. మాస్కో నేతలతో ఇస్తాంబుల్‌లో శాంతి చర్చలు జరుపుతున్నప్పటికీ.. దాడులు ఆగడంలేదని విమర్శించారు. అసలు ఈ యుద్ధం ఆపాలనే ఆలోచనే పుతిన్‌కు లేదన్న విషయం స్పష్టమవుతోందని అన్నారు.కీవ్‌పై మరిన్ని క్షిపణులు ప్రయోగించడానికి మాస్కో సన్నద్ధం అవుతున్నట్లు నిఘా వర్గాలు తెలిపాయని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. తాజాగా జరిగిన భారీ వైమానిక దాడుల్లో ఉక్రెయిన్‌లోని ఐదు ప్రదేశాలు, పలు వాణిజ్య, నివాస భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. మిలిటరీ స్థావరం ఉన్న పశ్చిమ ప్రాంతంపై రష్యా ఏడు క్రూయిజ్‌ క్షిపణులు, పెద్ద మొత్తంలో డ్రోన్లను ప్రయోగించిందన్నారు. ఇకనైనా దాడులకు పాల్పడకుండా రష్యాను కట్టడి చేసేందుకు అమెరికా, యూరప్‌లు ఆ దేశంపై కఠిన ఆంక్షలు విధించాలని కోరారు.యుద్ధ ఖైదీల అప్పగింతలో భాగంగా శుక్రవారం రష్యా-ఉక్రెయిన్‌ 390 మందిని, శనివారం 307 మందిని మార్పిడి చేసుకున్నాయి. తాజాగా మరో 303 సైనికులను పరస్పరం అప్పగించుకున్నట్లు రష్యా రక్షణశాఖ వెల్లడిరచింది. మరోవైపు కీవ్‌తోపాటు ఇతర ప్రాంతాలపై మాస్కో భీకర దాడులు చేస్తోంది. ఆదివారం రాత్రి ఒకేరోజు 69 క్షిపణులతో పాటు 298 డ్రోన్లతో విరుచుకుపడిరది. వీటిలో ఇరాన్‌ రూపొందించిన షాహిద్‌ డ్రోన్లు కూడా ఉన్నట్లు సమాచారం. మొత్తంగా ఈ దాడుల్లో 12 మంది చనిపోగా.. పలువురు గాయాలపాలయ్యారు. ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ (%ణశీఅaశ్రీస ుతీబఎజూ%) మీడియాతో మాట్లాడుతూ.. ఈ దాడులను తీవ్రంగా ఖండిరచారు. పుతిన్‌ పూర్తిగా పిచ్చిపట్టినట్లుగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. జెలెన్‌స్కీ మాటలతో సమస్యలు మరింత తీవ్రమవుతున్నాయని అన్నారు.

 

ఉక్రెయిన్‌ సరిహద్దు గ్రామాలు రష్యా అధీనంలోకి
కీవ్‌(జనంసాక్షి):కొద్ది రోజులుగా ఉక్రెయిన్‌పై భారీగా విరుచుకుపడుతున్న రష్యా తాజాగా ఆ దేశంపై మరిన్ని చర్యలకు ఉపక్రమించింది. ఉక్రెయిన్‌ ఈశాన్య సుమీ ప్రాంతంలోని నాలుగు సరిహద్దు గ్రామాలను మాస్కో సీజ్‌ చేసినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు. రష్యా సరిహద్దు వెంబడి బఫర్‌ జోన్‌ ఏర్పాటుకు ఇటీవల పుతిన్‌ ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. సుమీలో గ్రామాలను ఆక్రమించుకుంటూ రష్యన్‌ దళాలు మరింత ముందుకు సాగడానికి ప్రయత్నిస్తున్నాయని ఆ ప్రాంత సైనిక పరిపాలన అధిపతి ఒలేప్‌ా హ్రిహోరోవ్‌ వెల్లడిరచారు. వారిని ఎదుర్కోవడానికి తమ దళాలు తీవ్రంగా పోరాడుతున్నాయని అన్నారు. ప్రస్తుతం మాస్కో స్వాధీనం చేసుకున్న గ్రామాల ప్రజలను ఇప్పటికే అక్కడి నుంచి ఖాళీ చేయించామని తెలిపారు. ఉక్రెయిన్‌ బలగాల నుంచి కర్క్స్‌ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకొన్నాక తొలిసారి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ గత నెలలో ఆ ప్రాంతంలో పర్యటించారు. అక్కడి కుర్చాటోవ్‌ నగరంలోని మున్సిపల్‌ అధికారులతో చర్చలు జరిపారు. కర్క్స్‌ ప్రాంతంలో ఉక్రెయిన్‌ దళాలు పాతిన మందుపాతరలను తొలగించేందుకు అదనపు దళాలను మోహరించాలని పుతిన్‌ ఆదేశాలు జారీ చేశారు. సరిహద్దుల్లో ఉక్రెయిన్‌ చొరబాట్లకు అవకాశం ఉండడంతో సరిహద్దుల వెంబడి ‘భద్రతా బఫర్‌ జోన్‌’ను ఏర్పాటు చేయాలని తమ సైన్యాన్ని ఆదేశించారు. కానీ ఆ జోన్‌ ఎక్కడి వరకు ఉంటుందనే విషయంపై అధికారులకు స్పష్టతినివ్వలేదు. ఇందులో భాగంగానే ప్రస్తుతం రష్యా సైన్యం ఉక్రెయిన్‌ సరిహద్దులను సీజ్‌ చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.మరోవైపు ఇరుదేశాల మధ్య శాంతి ఒప్పంద చర్చలు జరుగుతున్నప్పటికీ కీవ్‌పై..మాస్కో దాడులు ఆగడంలేదు. కేవలం మూడు రోజుల్లోనే రష్యా.. ఉక్రెయిన్‌పై 900లకు పైగా డ్రోన్లను ప్రయోగించిందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ పేర్కొన్నారు. యుద్ధాన్ని నివారించాలంటే ప్రపంచ దేశాలు పుతిన్‌పై ఒత్తిడి తీసుకురావడమే మార్గమని అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సైతం ఈ ఘర్షణలు ఆపడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

 

 

రష్యాపై దీర్ఘశ్రేణి ఆయుధాలు ప్రయోగించవచ్చు
` ఉక్రెయిన్‌పై ఆంక్షలను తొలగించిన పశ్చిమ దేశాలు
బెర్లిన్‌(జనంసాక్షి):రష్యాపై దీర్ఘశ్రేణి ఆయుధాలు ప్రయోగించకుండా ఉక్రెయిన్‌పై ఉన్న ఆంక్షలను పశ్చిమ దేశాలు తొలగించాయి. ఈ విషయాన్ని జర్మనీ ఛాన్సలర్‌ ఫ్రెడ్రిక్‌ మెర్జ్‌ వెల్లడిరచారు.ఇటీవల కీవ్‌ సహా పలు నగరాలపై రష్యా భీకర దాడి చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. తాజాగా జర్మనీ సహా పలు మిత్రదేశాల నిర్ణయంతో రష్యా భూభాగంలోని దూర ప్రాంతాలను కూడా ఇప్పుడు ఉక్రెయిన్‌ లక్ష్యంగా చేసుకొనే అవకాశం లభించినట్లైంది. దీనికి తోడు కీవ్‌ దీర్ఘశ్రేణి ఆయుధాలను పొందేందుకు అవకాశం లభించవచ్చు.‘’ఉక్రెయిన్‌ వాడే ఆయుధాల్లో రేంజిపై ఇక నుంచి ఎటువంటి ఆంక్షలు లేవు. అమెరికా, బ్రిటన్‌ , ఫ్రాన్స్‌, మా నుంచి ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. ఆత్మరక్షణ కోసం రష్యాలోని మిలిటరీ స్థావరాలను కూడా ఉక్రెయిన్‌ లక్ష్యంగా చేసుకోవచ్చని దాని అర్థం’’ అని జర్మనీ ఛాన్సలర్‌ ఫ్రెడ్రిక్‌ మెర్జ్‌ వెల్లడిరచారు. కాకపోతే తమ వద్ద ఉన్న శక్తిమంతమైన టారస్‌ క్షిపణులను జర్మనీ సరఫరా చేస్తుందా.. లేదా అనే విషయం మాత్రం ఆయన వెల్లడిరచలేదు. కాకపోతే.. ఉక్రెయిన్‌కు వీటి సరఫరాను గతంలో ఆయన సమర్థించారు. ఇక ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ బుధవారం బెర్లిన్‌ను సందర్శించనున్నారు.అమెరికాలోని గత బైడెన్‌ ప్రభుత్వం ఉక్రెయిన్‌ దీర్ఘశ్రేణి ఆయుధాలపై ఉన్న వినియోగాన్ని గత నవంబర్‌లోనే తొలగించింది. వాస్తవానికి యుద్ధం మొదలైన తొలి రెండేళ్లలో అటువంటి ఆయుధాలు ఇచ్చేందుకు మాత్రం అమెరికా తిరస్కరించింది. 2024 ఏప్రిల్‌లో తొలిసారి వాటిని అందించింది.మరోవైపు జర్మనీ నిర్ణయంపై క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ మండిపడ్డారు. అది అత్యంత ప్రమాదకరమైన చర్యగా అభివర్ణించారు. ‘’వారు ఇలాంటి నిర్ణయం తీసుకొన్నట్లైతే.. సమస్యకు రాజకీయ పరిష్కారం కనుగొనాలనే ప్రయత్నాలకు ఇబ్బంది తలెత్తినట్లే.ఉక్రెయిన్‌పై రష్యా ఆదివారం భీకర దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. రాజధాని కీవ్‌ సహా పలు ప్రాంతాలు లక్ష్యంగా 367 డ్రోన్లు, క్షిపణులు ప్రయోగించింది. మూడేళ్లుగా జరుగుతున్న యుద్ధంలో ఇదే అతిపెద్ద వైమానిక దాడి అని ఉక్రెయిన్‌ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు.