జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్‌

` పులామ్‌ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు
` కీలక నేత మృతి
రాంచీ(జనంసాక్షి):రaార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. పులామ్‌ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో నిషేధిత సీపీఐ మావోయిస్టుకు చెందిన కమాండర్‌ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.సోమవారం అర్ధరాత్రి హైదర్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోని సీతాచువాన్‌లో ఈ ఎన్‌కౌంటర్‌ జరిగినట్లు పోలీసులు వెల్లడిరచారు. ఎదురుకాల్పుల్లో నిషేధిత సీపీఐ మావోయిస్టు అగ్ర కమాండర్‌ తులసి భూనియన్‌ మృతి చెందినట్లు పేర్కొన్నారు. రూ.15లక్షల రివార్డు ఉన్న మరో మావోయిస్టు తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. వారి నుంచి పలు రకాల ఆయుధాలు, రైఫిళ్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.్ణ సోమవారం రaార?ండ్‌లోని లాతహోర్‌లో ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ ఘటనలో కూడా మావోయిస్టు సభ్యుడు మనీశ్‌ యాదవ్‌ మృతి చెందాడు. అతడిపై రూ.5లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు వెల్లడిరచారు. రూ.10లక్షల రివార్డున్న పార్టీ జోనల్‌ కమాండర్‌ కుందన్‌ సింగ్‌ ఖర్వర్‌ను అరెస్టు చేసినట్లు తెలిపారు.

ఛత్తీస్‌గఢ్‌లో 18 మంది మావోయిస్టుల లొంగుబాటు
చర్ల(జనంసాక్షి):ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో పోలీసుల ఎదుట 18 మంది మావోయిస్టులు లొంగిపోయారు. పీఎల్‌జీఏ(పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ) బెటాలియన్‌లో చురుకుగా ఉన్న నలుగురితో సహా 18 మంది లొంగిపోయారు. వారిలో 10 మందిపై గతంలో మొత్తం రూ.38 లక్షల రివార్డు ప్రకటించారు. సుక్మా ఎస్పీ కిరణ్‌ చవాన్‌ ముందు వీరు లొంగిపోయారు. ఛత్తీస్‌గఢ్‌ ప్రభుత్వం నిర్వహిస్తున్న నక్సల్‌ రహిత గ్రామ పంచాయతీ పథకం కింద సాధించిన విజయంగా దీన్ని ఎస్పీ పేర్కొన్నారు.ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ కగార్‌లో పెద్దఎత్తున మావోయిస్టులను భద్రతాదళాలు మట్టుబెట్టాయి. ఈ నేపథ్యంలో వీరు లొంగిపోయినట్లు తెలుస్తోంది.