తెలంగాణకు ముగ్గురు హైకోర్టు జడ్జిల బదిలీ
` 11 హైకోర్టులకు చెందిన 21 మంది బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు
ఢల్లీి(జనంసాక్షి): 11 హైకోర్టులకు చెందిన 21 మంది జడ్జిల బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. మద్రాస్ హైకోర్టు జడ్జి జస్టిస్ బట్టు దేవానంద్ ఏపీ హైకోర్టుకు, కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్ సుమలత తెలంగాణ హైకోర్టుకు, కర్ణాటక హైకోర్టు జడ్జి జస్టిస్ లలిత కన్నెగంటి తెలంగాణ హైకోర్టుకు, పాట్నా హైకోర్టు జడ్జి జస్టిస్ అభిషేక్‌రెడ్డి తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం పేర్కొంది.