ముంపు ప్రాంతాలను పరిశీలించిన
పుట్ట మధూకర్,పెద్దపల్లి జడ్పీ చైర్మన్
మహదేవపూర్ సెప్టెంబర్ 19 ( జనంసాక్షి)
మహాదేవపూర్ మండలంలోని గోదావరి పొడవునా ఉన్న వరద ముంపు గ్రామాలలో తెరాస మంథని నియోజకవర్గ బాధ్యులు&పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ పర్యటించారు.మేడి గడ్డ,సురారం,బెగ్లూర్,బొమ్మాపూ ర్,బ్రహ్మణపల్లి,ఎడపల్లి,కుదురు పల్లి గ్రామాలలో ముంపుకు గురైన చేన్లు,తెగిన గట్లు,గోదావరి బ్యాక్ వాటర్ తీవ్రత ను పరిశీలించి,అధికారుల నుండి నష్టపరిహారం అందిందా లేదా అని రైతులను అడిగి తెలుసుకున్నారు..అధికారుల అలసత్వాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా చూస్తామని,ప్రతి పక్ష పార్టీ నుండి ఎమ్మెల్యే గా గెలిచి,ప్రజలకు నేను ఏం చేయగలను అన్నట్లు ఉండటమే తప్పా,ఏనాడు ప్రజల గురించి ఆలోచించలేదని,అధికారులు పనిచేయకపోతే నాకే లాభం జరుగుతుందని,అధికారుల గురించి పట్టించుకోవడం లేదని,పనులు కావద్దనే కుటీల నీతితో కసాయి లా పాలన కొనసాగిస్తున్నాడని విమర్శించారు .ఈ నియోజకవర్గంలో ఎస్ సి,ఎస్టీ,బీసీ,మైనార్టీ చిన్న, సన్నకారు రైతులు,వ్యవసాయ ఆధారిత కుటుంబాలు అన్నమో రామ చంద్ర అని అలమటిస్తుంటే,దోచుకొని అమెరికా బెంగుళూర్ లో దాచుకోవడంలో చూపిన శ్రద్ధ ప్రజల కు సేవ చేయాలనే ఆలోచనపై లేదని అన్నారు.ఎమ్మెల్యే దారిలోనే అధికారులు ఉండి, ప్రాజెక్ట్ పరిసర గ్రామాలలో చాలా చిన్న సమస్యలు కూడా చేయలేకపోయారని,మట్టిని తొలగిస్తే కొన్ని ఎకరాలు సాగులోకి వచ్చేవని,ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రజలకు పనులు జరిగేలా చూస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో తెరాస జిల్లా యువజన నాయకులు జక్కు రాకేష్,టీ ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు లింగంపల్లి శ్రీనివాస్,సర్పంచ్ లు శ్రీపతిబాపు,లచ్చిరెడ్డి,ఎంపీపీ రాణి బాయి,వ్యవసాయ సహకార సంఘం ఛైర్మెన్ చల్ల తిరుపతిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు