ముఖ్యమంత్రి పాతబస్తీ పర్యటన చారిత్రాత్మకం
గతంలో ఏ ముఖ్యమంత్రీ పర్యటించిన దాఖలాలు లేవు
పాతబస్తీ వాసుల ఇ్కట్లు స్వయంగా తెలుసుకుంటున్న సీఎం
ఎంఐఎం నేతలతో కలిసి పాతబస్తీలో సుడిగాలి పర్యటనలు
సీఎం పర్యటన పట్ల హర్షం వ్యక్తం చేస్తున్న పాతబస్తీవాసులు
హైదరాబాద్, మే 21(జనంసాక్షి): వలస పాలకుల నిర్లక్ష్యపు నీడలో ఆనవాళ్లు కోల్పోయే ప్రమాదంలో పడిపోయిన పాతబస్తీకి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మంచి రోజులు వచ్చాయను కోవచ్చా? అంటే అవుననే చెప్పాలి. దీనికి కారణం పాతబస్తీలో ముఖ్యమంత్రి కేసీఆర్ చారిత్రక పర్యటన. సమైక్య రాష్ట్రంలో చారిత్రక హైదరాబాద్ నిర్లక్ష్యానికి గురైందనటానికి ఒక్క ముఖ్యమంత్రి కూడా పాతబస్తీలో పర్యటించకపోవడం నిలువెత్తు నిదర్శనం. కానీ ఆ రికార్డును చెరిపేస్తూ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ ముఖ్యమంత్రీ వెళ్లని పాతబస్తీలో పర్యటించటమే కాకుండా, అక్కడి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పాతబస్తీని నిర్లక్ష్యం చేసిన పాలకులు, ముఖ్యమంత్రులు పర్యటించరు” అంటూ పతాక శీర్షికన జనంసాక్షి ప్రచురింఛిన కథనానికి స్పందించిన సీఎం కేసీఆర్ వెంఠనే తన రూట్ ప్లాన్ మార్చారు. స్వచ్చ హైదరాబాద్‌లో భాగంగా చివరి రోజున పాతబస్తీలో పర్టటంచారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలని సంకల్పించి అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు. హైదరాబాద్ నగరాన్ని గంగా యమునా తెహజీబ్‌గా తిరిగి తీర్చిదిద్దే వరకు శ్రమిస్తానని స్పష్టంచేశారు. పాతబస్తీని అందంగా రూపొందించటానికి ఎంఐఎం తదితర పార్టీల నేతలతో కలిసి శ్రమిస్తామని సీఎం పేర్కొన్నారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా సీఎం కేసీఆర్ పాతబస్తీని సందర్శించారు. పాతబస్తీలో పర్యటించిన ఆయన అక్కడి స్థానికులనడిగి వారి సమస్యలు తెలుసుకున్నారు. పాతబస్తీని అభివృద్ధి చేయటానికి తెలంగాణ సర్కారు కట్టుబడి ఉందన్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత పౌరులపైనే ఉందన్నారు. పాతబస్తీని అందరం కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందామని కేసీఆర్ పిలుపునిచ్చారు. డబీర్‌పురాలో స్వచ్ఛహైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం సీఎం స్థానికులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రూ.1200 కోట్లతో డబీర్‌పురాలో జలాశయం నిర్మిస్తామని, ఈ జలాశయానికి హజ్రత్ అబ్బాస్ పేరు పెడుతామని సీఎం పునరుద్ఘాటించారు. తెలంగాణ అభివృద్ధి కోసం అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణ ఏర్పడితే కరెంటు సమస్య ఉంటుందని దుష్ప్రచారం చేశారని, అయితే .ఆ సమస్యను ఇపుడు అధిగమించి చూపించామన్నారు. గంగాజమున తహజీబ్ లాగా తెలంగాణలో మైనార్టీల అభివృద్ధికి పాటుపడతామని తెలిపారు. తెలంగాణ అభివృద్ది ఫలాలు అందరికీ అందాలని అన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల వరకు అధికారులు లేరని.. రెండు మూడు నెలల క్రితమే అధికారులను కేటాయించడంతో పాలన గాడిలో పడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఎం వెంట ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రి జగదీశ్ రెడ్డి,ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డితోపాటు జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, తదితరులు పాల్గొన్నారు. పాల్గొన్నారు. గంగా-జమున సంస్కృతికి పేరుగాంచిన చారిత్రక నగరమిదని, హిందూ, ముస్లింల ఐక్యతతో ప్రపంచానికే ఈ నగరం ఆదర్శం కావాలన్నారు. త్వరలో పాతబస్తీలో ప్రత్యేకంగా 2,3 రోజులు పర్యటిస్తామని, ఏయే సమస్యలు ఉన్నాయో చూసి పరిష్కరిస్తామని చెప్పారు. పాత బస్తీలో మురికి కాల్వల సమస్య పరిష్కారానికి ఈరోజే ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్య లేదు… రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. పాతబస్తీలో మురికి కాలువల సమస్య పరిష్కరానికి ఇవాళే ఉత్తర్వులు జారీ చేస్తున్నామన్నారు. పాతబస్తీ పర్యటనలో భాగంగా సీఎం సైదాబాద్ ఎర్రకుంటలోని స్మశానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఎర్రకుంట చెరువును మిషన్‌కాకతీయలో చేర్చి పునరుద్దరిస్తమన్నారు. స్మశానాన్ని అభివృద్ధి చేసేందుకు రూ.2కోట్లు మంజూరు చేస్తమని హావిూనిచ్చారు. డబీర్‌పురాలో నీటి సమస్య తీవ్రంగా ఉందని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా పాతబస్తీలో పర్యటించారు. ఇందులో భాగంగా డబీర్‌పురాలో స్థానికులతో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సీఎంతోపాటు స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ అసదుద్దీన్ మాట్లాడుతూ తెలంగాణ బంగారు తెలంగాణగా మారాలని ఆకాంక్షించారు. పాతబస్తీలో అభివృద్ధి జరుగాలని సీఎంను కోరారు.