మునుగోడులో సిరిసిల్ల టిఆర్ఎస్ నాయకుల ప్రచారం.
సిరిసిల్ల. అక్టోబర్ 21. (జనం సాక్షి) మునుగోడు టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం సిరిసిల్ల టిఆర్ఎస్ నాయకులు ప్రచారానికి తరలి వెళ్లారు. శుక్రవారం మునుగోడు నియోజకవర్గంలోని గట్టుప్పల్ మండల కేంద్రంలో ఇంటింటి కి ప్రచారం నిర్వహించారు. టిఆర్ఎస్ నాయకులు దార్ల సందీప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచారంలో కౌన్సిలర్లు కల్లూరి రాజు, అన్నరం శ్రీనివాస్, నాయకులు బుర్ర మల్లికార్జున గౌడ్, శ్యామ్ సుందర్, తదితరులు పాల్గొన్నారు