ముఫ్తీ సయూద్‌ వ్యాఖ్యలపై ఉభయసభల్లో దుమారం

2
ప్రధాని వివరణకు విపక్షాల పట్టు

కాంగ్రెస్‌ వాకౌట్‌

న్యూఢిల్లీ,మార్చి2(జనంసాక్షి): జమ్మూకశ్మీర్‌ ముఖ్యమంత్రి ముఫ్తీ మహమ్మద్‌ సయీద్‌ చేసిన వ్యాఖ్యలపై పార్లమెంటు ఉభయ సభల్లో దుమారం రేగింది. దీనిపై ప్రధాని వివరణ ఇవ్వాలని విపక్షాలు పట్టుబట్టాయి.  సోమవారం  ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్‌ పార్టీ ఈ విషయాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకొని సభాకార్యక్రమాలను అడ్డుకుంది. ఉగ్రవాదులు సహకరించడం వల్లే జమ్మూ కశ్మీర్లో ఎన్నికలు జరిగాయని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ముప్తీ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ సమాధానం చెప్పాలని పట్టుబట్టింది. ఈ అంశాన్ని తాము చాలా సీరియస్‌గా తీసుకుంటున్నామని పార్టీ నాయకుడు మల్లిఖార్జున ఖర్గే చెప్పారు.  కాశ్మీర్‌లో ఎన్నికలు ప్రశాంతంగా జరగడం అభినందనీయమని అంటూనే ప్రధాని, ముఫ్తీల మధ్య ఏ రకమైన చర్చలు లేదా ఒప్పందాలు జరిగాయో సభకు వివరించాలన్నారు. ముఫ్తీ చేసింది దేశం మొత్తానికి వర్తించే వివాదాస్పద వ్యాఖ్యలని, మనోభావాలను దెబ్బతీసేవని పేర్కొన్నారు. దీనిపై వివరణ ఇవ్వాలన్నారు. ఈ దశలో ¬ంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ లేచి సమాధానం ఇవ్వబోగా ఖర్గే అబ్యంతరం చెప్పారు. ఇదగి ప్రధాని, ముఫ్తీల మధ్య జరిగిన చర్చని, అందువల్ల ప్రధాని ఏం మాట్లాడారో స్పష్టమైన వివరణ ఇవ్వాలన్నారు. ప్రధాని మాత్రమే సమాధానం ఇవ్వాలన్నారు. దీంతో జమ్మూ కాశ్మీర్‌ సీఎం ముఫ్తీ మహ్మద్‌ చేసిన వ్యాఖ్యలు లోక్‌సభలో తీవ్ర దుమారం రేపాయి. కాశ్మీర్‌ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ముఫ్తీ విూడియాతో మాట్లాడుతూ కాశ్మీర్‌లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పాక్‌ ప్రజలు, ఉగ్రవాదులు సహకరించారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను లోక్‌సభలో విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. ముఫ్తీ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ వివరణ ఇవ్వాలంటూ పట్టుబట్టాయి. కాశ్మీర్‌ సీఎం ముఫ్తీ చేసిన వ్యాఖ్యలు దేశాన్ని కించపరిచేలా ఉన్నాయని కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే విమర్శించారు. ఆయనకు ఇతర సభ్యులు కూడా మద్దతు పలికాయి. దీనిపై స్పందిచిన అధికారపక్షం ముఫ్తీ వ్యాఖ్యలతో తమకెలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. ఆ వ్యాఖ్యలు ముఫ్తీ వ్యక్తిగతమని ¬ం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్పష్టం చేశారు. అయినప్పటికీ విపక్ష నేతలు వినిపించుకోకుండా దీనిపై ప్రధాని నేరుగా సమాధానం ఇవ్వాలని పట్టుబట్టాయి. బీజేపీ అగ్రనేతల మధ్య సీఎంగా ప్రమాణం చేసిన ముఫ్తీ అనంతరం విూడియా సమావేశంలో  ముఖ్యమైన ప్రాంతానికి సంబంధించి అలాంటి వ్యాఖ్యలు చేస్తే విూరు ఎందుకు మందలించలేదని లేదని కేంద్రాన్ని కాంగ్రెస్‌ నిలదీసింది. పాకిస్థాన్‌ను  పరోక్షంగా పొగడటమేనని వ్యాఖ్యానించింది. మనందరిని విమర్శించడమేనని చెప్పింది. ఇందుకు రాజ్నాథ్‌ సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. మఫ్తీ  అభిప్రాయంతో కేంద్రానికి సంబంధం లేదని చెప్పారు.  సయీద్‌ వ్యాఖ్యలతో సంబంధం లేదని స్పష్టం చేశారు. ప్రధానితో మాట్లాడిన తర్వాత తాను సభలో స్పందించినట్లు పేర్కొన్నారు. ఈ అంశంపై ప్రధాని వివరణ అవసరం లేదని పునరుద్ఘాటించారు.ముఫ్తీ వ్యాఖ్యలపై ప్రధాని వివరణ ఇవ్వాలని లోక్‌సభలో ప్రతిపక్షాలు చేసిన డిమాండ్‌పై ఆయన స్పందిస్తూ జమ్మూ కశ్మీర్‌ లో ఎన్నికలు ప్రశాంతంగా జరుగడానికి ప్రజలే కారణమని తెలిపారు. ప్రధానితో ముఫ్తీ వ్యాఖ్యలపై మాట్లాడిన తర్వాతనే తాను సభలో స్పందించినట్టు పేర్కొన్నారు. హురియత్‌,పాకిస్థాన్‌, మిలిటెంట్‌ సంస్థలు సానుకూలంగా వ్యవహరించడం వల్లే జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ముఫ్తీ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.  దీంతో ప్రభుత్వ తీరును నిరసిస్తూ కాంగ్రెస్‌ వాకౌట్‌ చేసింది.