ముమ్మాటికీ విద్రోహమే — ఎమ్మార్పీఎస్ ,టీపీఎఫ్ ,ఏపీవైఎస్
టేకులపల్లి, సెప్టెంబర్ 17( జనం సాక్షి ): సెప్టెంబర్ 17 విలీనము కాదు,విమోచనము కాదు ముమ్మాటికీ విద్రోహమే నని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు నల్లగట్ల వెంకటేశ్వర్లు, టీపీఎఫ్ నాయకులు మెంతెన సంజీవరావు, ఏపీవైయస్ జిల్లా అధ్యక్షులు ఎట్టి ప్రశాంత్ లు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉన్న అప్పటి హైదరాబాద్ సంస్థానం ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం తో పాటు ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్న నాందేడ్, ఔరంగాబాద్, ఉస్మానా బాద్ లతో కూడిన మరాఠ్వాడ, ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రంలో ఉన్న గుల్బర్గా, రాయచూర్ ప్రాంతాలు ఉన్నాయి. దీనితో కూడిన హైదరాబాద్ నిజాం నవాబులు పరిపాలించేవారన్నారు. నిరంకుశ ప్రభుత్వానికి దొరల అరాచకానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో తెలంగాణ ప్రాంతంలో సామాన్య ప్రజలే సాయుధులై భూమికోసం, భుక్తి కోసం, దేశవిముక్తి కోసం జరిపిన పోరాటమే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అన్నారు. నిజాం పాలనలో జాగిర్దారులు, దేశముఖులు, భూస్వాములు దేశ్పాండేలు మొదలైన దొరల దురాగాతల కారణంగా విసిగి వేసారిన ప్రజలు కమ్యూనిస్టు నాయకత్వంలో దొరలకు వ్యతిరేకంగా పోరాటం సాగించారు. 1946 జూలైలో కామ్రేడ్ దొడ్డికొమురయ్య, సాకలి ఐలమ్మ త్యాగంతో మొదలైన తెలంగాణ సాయుధ పోరాటంలో 2000 మందినాయకులు రజాకార్ల చేతిలో ప్రాణాలర్పించారు. ఈ క్రమంలోనే మూడు వేల గ్రామాలని విముక్తి చేశారు. పది లక్షల ఎకరాల భూమిని ప్రజలకు పంచిపెట్టారు. కమ్యూనిస్టులు హైదరాబాదు రాజ్యాన్ని కైవసం చేసుకుంటారని భావించిన నిజాం ప్రభుత్వం భారత ప్రభుత్వంతో లోపాయి కారఒప్పందం కుదురుచుకుంది . దీనిలో భాగంగానే విప్లవకార్లకు రజాకార్లకు మధ్య జరిగే ఘర్షణలో ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారనే పేరిట 1948 సెప్టెంబర్ 13న హైదరాబాదుపై సైనిక చర్య