ములుగు జిల్లాకు వరాల జల్లు
జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ …..
ములుగు జిల్లాలో అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి కేసిఆర్ రూ. 120 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు,ఏజెన్సీ ప్రాంతం లో మెరుగైన రవాణా సౌకర్యం కోసం రోడ్లు,వంతెనలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ అన్నారు.గతంలో ములుగు జిల్లా అభివృద్ది కోసం ఏటూరునాగారం,గోవిందరావుపేట, మంగపేట,తాడ్వాయి,వెంకటాపురం, వాజేడు మండలాలలో రోడ్లు,వంతెనలకు నిర్మాణానికి జడ్పీ చైర్మన్ నిధుల కోసం ముఖ్యమంత్రి కేసిఆర్ ని కోరగా స్పందించిన ముఖ్యమంత్రి కేసిఆర్ గురువారం రోజున ఆయా మండలాలలో నూతన రోడ్లు వంతెనలకు గాను రోడ్డు మరియు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ద్వారా ఈ నిధులను విడుదల చేసినట్లు జడ్పీ చైర్మన్ తెలిపారు,ఈసందర్బంగా మరోమారు ముఖ్యమంత్రి కేసిఆర్ ములుగు జిల్లా అందులో ఏజెన్సీ ప్రాంతాలకు నిధులు విడుదల చేసి మరోమారు ఆదివాసీలపై, ఏజెన్సీ ప్రాంతంపైతనకున్న ప్రేమను మరోమారు చాటుకున్నారన్నారు.తన కోరిక మేరకు ములుగు జిల్లా అభివృద్దికి నిధులను కేటాయించిన ముఖ్యమంత్రి కేసిఆర్, ఆర్ అండ్ బి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిలకు ఈసందర్బంగా జడ్పీ చైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు.రోడ్ల కోసం ఏటూరునాగారం మండలానికి 1656.66, గోవిందరావుపేట మండలానికి 125, కన్నాయిగూడెం 97.35, మంగపేట1802.34, తాడ్వాయి 2238.29, వెంకటాపురం 361.55, వాజేడు 1601.14,వంతెన నిర్మాణానికిగాను ఏటూరునాగారం 982.65, మంగపేట 667, తాడ్వాయి 853, వెంకటాపురం 517.63, వాజేడు 1205 లక్షలలో నిధులు విడుదల చేశారు..