మృతుని కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం చేసిన జెడ్పిటిసి గై రుద్రమదేవి అశోక్ ఎంపీపీ బుర్ర రజిత సమ్మయ్య
ములుగు జిల్లా వెంకటాపూర్ రామప్ప మండలం నల్లగుంట గ్రామానికి చెందిన సాద రాజు కొన్ని రోజుల నుండి కిడ్నీ వ్యాధితో బాధపడుతూ చనిపోవడం జరిగింది.విషయం తెలుసుకొని మృతుని భార్యకు 5 వేల రూపాయలు ఆర్థిక సాయం చేసి మనోధైర్యాన్ని కల్పించారు.అనంతరం మండల అధ్యక్షులు లింగాల రమణారెడ్డి మాట్లాడుతూ మృతుని కుటుంబానికి భార్య పిల్లలకు టిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఇట్టి విషయాన్ని జెడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ దృష్టికి తీసుకుపోయి మృతుని కుటుంబాన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.అనంతరం మృతదేహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి గై రుద్రమదేవి అశోక్,ఎంపీపీ బుర్ర రజిత సమ్మయ్య, మండల అధ్యక్షులు లింగాల రమణారెడ్డి, గ్రామ సర్పంచ్ మందల సుచరిత శ్రీధర్ రెడ్డి, సీనియర్ నాయకులు గోవింద్ నాయక్,మందల మధుకర్ రెడ్డి,ఉపసర్పంచ్ భూక్య శంకర్,యువజన నాయకులు జనగాం రవి, నాయకులు మధుసూదన్ రెడ్డి, సంజీవరెడ్డి, సమ్మిరెడ్డి, రణధీర్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులు గ్రామస్తులు తదితరులు నివాళి అర్పించారు.