మెడికల్ హబ్‌గా హైదరాబాద్
తెలంగాణలో మరిన్ని దవాఖానాలు తెరవండి
సీఎం కేసీఆర్
హైదరాబాద్, మార్చి1(జనంసాక్షి): హైదరాబాద్ మెడికల్ హబ్‌గా మారిపోనుందని సీఎం కేసీఆర్ అన్నారు. మాదాపూర్ లో సన్ షైన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. సకల సౌకర్యాలతో సన్ షైన్ హాస్పిటల్ జంట నగరాలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తోందని కొనియాడారు. ఐటీ కారిడార్, ఏరో స్పేస్ ఏరియాలో కూడా సన్ షైన్ బ్రాంచ్ లు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలోని ఇతర పట్టణాలకు కూడా వైద్య సేవలను విస్తరించాలని సన్ షైన్ యాజమాన్యాన్ని కోరారు. తెలంగాణ అంతటా ఆసుపత్రులు నిర్మించాలని సూచించారు. అవసరమైతే ప్రభుత్వం తరఫున స్థలం కూడా కేటాయిస్తామని సీఎం హావిూ ఇచ్చారు.