మేక్‌ ఇన్‌ ఇండియాలో ఓడలు తయారు చేస్తాం

4
ప్రధాని నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ,మార్చి30(జనంసాక్షి):  మేకిన్‌ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఇక్కడే ఓడలు నిర్మిద్దామని, ఆ సత్తా భారత్‌కు ఉందని నిరూపిద్దామని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. జాతీయ సముద్ర రవాణా దినోత్సవం సందర్భంగా కేంద్ర నౌకాయానశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సముద్ర రవాణాలో మన దేశానికి 5వేల సంవత్సరాల చరిత్ర ఉందన్నారు. దీనికి సంబంధించి ఓ వస్తు ప్రదర్శనశాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. చరిత్రలో నిలిచిపోయిన విశేషాలన్నింటినీ భవిష్యత్‌ తరాలకు తెలిసేలా దానిలో పొందుపరుస్తామన్నారు. ఇదిలావుంటే గుర్తింపుకార్డుతో నౌకా సిబ్బంది విదేశీయానం చేసే సౌలభ్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించింది. ఇప్పటివరకు అమల్లో ఉన్న ఈ వెసులుబాటును కేంద్రం వెనక్కి తీసుకుంది. జూన్‌ 1 నుంచి పాస్‌పోర్టు లేనిదే ఎవరూ ప్రయాణించరాదని ఉత్తర్వులు జారీ చేసింది.