మొదటి రోజు జోరుగా ఆజాదికి గౌరవ్‌యాత్ర..
చేవెళ్ల ఆగస్టు 11 (జనంసాక్షి) చేవెళ్ల నియోజకవర్గం పరిధిలో ఉన్న మొయినాబాద్ మండలంలో టిపిసిసి ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు షాబాద్ దర్శన్ గారి ఆధ్వర్యంలో 15 కిలోమీటర్ల పాదయాత్ర, ఏఐసీసీ, టీపీసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ టిపిసిసి ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు షాబాద్ దర్శన్ గారి ఆధ్వర్యంలో నక్కలపల్లి నుంచి తోల్కట్ట,మొయినాబాద్ వరకు చేపట్టిన ఆజాదీ కి గౌరవ్ పాదయాత్ర జోరుగా కొనసాగింది… ఈ యాత్రకు ప్రజలు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు.. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తరలి వచ్చారు.. సుమారు 5 గంటల పాటు 15 కిలోమీటర్లు సాగిన ఆజాదీ కి గౌరవ్ పాదయాత్ర ఈ యాత్ర చేపట్టిన షాబాద్ దర్శన్ గారు మాట్లాడుతూ.. జాతిపితను చంపిన గాడ్సేను బీజేపీ పొగుడుతోందని, భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారిని మోడీ ప్రభుత్వం కించపరుస్తోంది అన్నారు..టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అమలు చేయకపోవడం సిగ్గుచేటన్నారు.
బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇష్టారాజ్యంగా నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ ప్రజలు నడ్డివిరుస్తున్నారు.పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారు..కాంగ్రెస్ పార్టీ బలోపేతాన్ని అడ్డుకోవడానికే సోనియాగాంధీ గారిని,రాహుల్ గాంధీ గారిని ఈడీ కేసుల పేరుతో బీజేపీ ప్రభుత్వం వేధిస్తున్నారు.. వారి పైన పెట్టిన కేసులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.. ఎవరెన్ని కేసులు పెట్టినా వచ్చే రోజులలో రాష్ట్రంలో,కేంద్రంలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ పార్టీయే అని అన్నారు.. బీజేపీ, టీఆర్ఎస్ రెండూ తోడుదొంగలే అని ఆ పార్టీల మాయమాటలను ప్రజలు పట్టించుకోవద్దు అన్నారు..కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందన్నారు.. ఇందిరమ్మ ఇళ్లు,రూపాయికే కిలో బియ్యం,విద్యార్థుల చదువు కోసం ఫీజు రియింబర్స్‌మెంట్,తక్షణమే రుణమాఫీ చేసి మళ్లీ రుణాలు మంజూరు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని అన్నారు..
ప్రజలు,విద్యార్థులు.. అన్నివర్గాల ప్రజలు మేల్కొని టీఆర్ఎస్ బీజేపీలకు బుద్ధి చెప్పాలి అన్నారు..రాష్ట్రంలో,కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అందరూ సహకరించాలన్నారు.. ఈ కార్యక్రమంలో చేవెళ్ల నియోజకవర్గం సీనియర్ నాయకులు సున్నపు వసంతం గారు,భీమ్ భరత్ గారు,ప్రైవేట్ కళాశాలల యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు గౌరీ సతీష్ గారు,కాంగ్రెస్ మొయినాబాద్ మండల అధ్యక్షులు తమ్మాలి మాణయ్య గారు,చేవెళ్ల మండల అధ్యక్షులు వీరేందర్ రెడ్డి గారు,నవాబుపేట్ మండల అధ్యక్షులు వెంకటయ్య గారు,శంకర్పల్లి మండల అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, మండల సహకార సంఘం చైర్మన్ లు చంద్రారెడ్డి గారు,దెవర వెంకట్ రెడ్డి,గొనె ప్రతాప్ రెడ్డి, బుచ్చి రెడ్డి, నియోజకవర్గం కాంగ్రెస్ ఏ బ్లాక్ అధ్యక్షులు మల్ల రెడ్డి, కాంగ్రెస్ నాయకులు షాబాద్ సురేందర్ రెడ్డి, రామచంద్రయ్య గారు,చేవెళ్ల స్వామి గారు,శ్రీరామ్ నగర్ ఎంపీటీసీ సభ్యులు రామ్ రెడ్డి, మొయినాబాద్ ఎంపీటీసీ సభ్యులు రాజు, ఎంపీటీసీ రవీందర్ రెడ్డి, బాకారం ఉప సర్పంచ్ శ్రీనివాస్ యాదవ్, మొయినాబాద్ ఉప సర్పంచ్ రాజేష్ గౌడ్, ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, చందనగర్ ఉప సర్పంచ్ లక్ష్మీకాంత్ రెడ్డి, మండల ఓబీసీ సెల్ అధ్యక్షులు గణేష్ గౌడ్, మండల బీసీ సెల్ ఉపాధ్యక్షులు మహేందర్ ముదిరాజు,, జిల్లా నాయకులు జంగా రెడ్డి, సొసైటీ డైరెక్టర్ రాఘవేంద్ర రెడ్డి, మాజీ సర్పంచులు తోల్కట్ట సత్యనారాయణ, అమర్నాథ్ రెడ్డి, కనుకమామిడి కే శ్రీనివాస్, మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు మరియు రవీందర్ రెడ్డి, బాలకృష్ణ రెడ్డి, మండల యువ నాయకుడు నర్సింగ్ రావు, బాకారం గ్రామ అధ్యక్షులు అనిల్, మండల రైతు సంఘం అధ్యక్షులు వెంకట్ రెడ్డి, బాబన్న సత్యనారాయణ, మండల సోషల్ మీడియా ఇంచార్జ్ మోత్కుపల్లి దినేష్ కుమార్,జైపాల్ రెడ్డి గారు,వెంకట్ రెడ్డి,డప్పు రాజు ,గడ్డం వెంకట్ రెడ్డి, మహేందర్ రెడ్డి,గౌతమ్ రెడ్డి,విక్రం రెడ్డి, కుమారి, నరసింహ, వడ్ల నరసింహ చారి, శ్రీనివాస్ ,బిక్షపతి ముదిరాజ్ ,రమేష్ ,మాణిక్ రెడ్డి, చిలుకూరు ప్రభాకర్ రెడ్డి, పెద్దమంగళారం యాదయ్య,మిరాజ్, కృష్ణ, వెంకటేశం, బిక్షపతి, దాసు ,ఎన్ఎస్యుఐ చేవెళ్ల నియోజకవర్గం అధ్యక్షులు మధు ,యూత్ కాంగ్రెస్ చేవెళ్ల నియోజకవర్గం అధ్యక్షులు పెంటా రెడ్డి, చేవెళ్ల మండల అధ్యక్షులు శ్రీనివాస్, ప్రసాద్ కుమార్,, నిరంజన్ గౌడ్,ఉమర్,రియాజ్,వినోద్ కుమార్,జాంగిర్,అంజి,జంగయ్య,అప్సర్,శంకర్ మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.