మోదీ పాలనలో దేశం తిరోగమనం

4

– ప్రకాశ్‌ కారత్‌

గుంటూరు, ఆగస్ట్‌1(జనంసాక్షి):

వ్యవస్థలను దెబ్బతీసే లా   మోడీ సర్కార్‌ తిరోగమనంలో   పనిచేస్తోందని  సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు ప్రకాష్‌ కరత్‌ విమర్శలు గుర్పించారు. ప్రజా సంఓఏమాన్ని పక్న పెట్టి కార్పోరేట్ల సేవలో తరలించే పనిలో మోడీ పడ్డాడని అన్నారు. గుంటూరులో ‘ప్రజాసామ్యం – కార్పొరేట్‌ రాజకీయాలు’ అంశంపై జరిగిన  సదస్సులో కరత్‌ పాల్గొని ప్రసంగించారు. మోడీ ప్రభుత్వం గ్రావిూణ ప్రాంత ప్రజలు, కార్మిక వర్గంపై దాడి చేస్తోందన్నారు. గతంలో ఉన్నటువంటి రక్షణ చర్యలను.. పథకాలను నిర్వీర్యం చేస్తోందని, ప్రభుత్వ విధానాలు ఎండగట్టేందుకు ప్రచారాన్ని చేయాలని నిర్ణయించడం జరిగిందన్నారు. వ్యవసాయ కార్మికులు, వివిధ రంగాల్లో ఉన్న వారు దుష్పలితాలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వ్యవసాయ పంటలకు గిట్టుబాటు ధరపై ఎన్నికల్లో హావిూలు గుప్పించిందని, కానీ అధికారంలోకి వచ్చాక హావిూలు, స్వామి నాథన్‌ కమిటీ సిఫార్సులను అమలు చేయలేమని మోడీ సర్కార్‌ పేర్కొంటోందన్నారు. ఏపీకి పదేళ్ల పాటు ప్రత్యేక ¬దాపై అనేక వాగ్ధానాలు ఇచ్చిన బీజేపీ మాట ఎందుకు మారుస్తుందో చెప్పాలని కరత్‌ సూటిగా ప్రశ్నించారు.